పడి పడి లేచే మనసు అంటూ వాలంటైన్స్ డే ప్రత్యేకతను చెబుతున్న ప్రదీప్..

ప్రతీ సందర్భానికి ఒక రోజు ఉన్నట్లే.. ప్రేమ గొప్పతనాన్ని చాటి చెప్పేందుకు కూడా ఒక రోజు ఉంది. అది ఫిబ్రవరి 14, ప్రేమికుల రోజు. ఈ ప్రేమికుల రోజు.. ప్రతీ ఒక్కరూ తాము ప్రేమించేవారికి తమ ప్రేమను మరింత గొప్పగా చెప్పాలనుకుంటారు. ఈ ప్రేమికుల రోజు సందర్భంగా యాంకర్ ప్రదీప్ మాచిరాజు ఈ సందర్భంగా ...

news18-telugu
Updated: February 12, 2020, 8:17 PM IST
పడి పడి లేచే మనసు అంటూ వాలంటైన్స్ డే ప్రత్యేకతను చెబుతున్న ప్రదీప్..
జీ తెలుగులో ప్రసారం కానున్న ప్రదీప్ మాచిరాజు పడి పడి లేచే మనసు (Twitter/Photo)
  • Share this:
ప్రతీ సందర్భానికి ఒక రోజు ఉన్నట్లే.. ప్రేమ గొప్పతనాన్ని చాటి చెప్పేందుకు కూడా ఒక రోజు ఉంది. అది ఫిబ్రవరి 14, ప్రేమికుల రోజు. ఈ ప్రేమికుల రోజు.. ప్రతీ ఒక్కరూ తాము ప్రేమించేవారికి తమ ప్రేమను మరింత గొప్పగా చెప్పాలనుకుంటారు. అందుకే ఈ సందర్భాన్ని ఒక మర్చిపోలేని రోజుగా మార్చాలని భావించిన జీ తెలుగు… తెలుగు ప్రేక్షకుల కోసం ‘పడి పడి లేచే మనసు’ అనే కార్యక్రమాన్ని రూపొందించింది. ఈ కార్యక్రమం ఫిబ్రవరి 16 ఆదివారం సాయంత్రం 6 గంటల నుంచి మీ జీ తెలుగు మరియు జీ తెలుగు హెచ్‌డీ ఛానెల్స్‌లో ప్రసారం కానుంది.  డిఫరెంట్‌ కాన్సెప్ట్‌తో రూపొందించిన ‘పడి పడి లేచే మనసు’ కార్యక్రమంలో ప్రదీప్‌ మాచిరాజు, రోల్‌ రైడా, వెంకట్‌ శ్రీరామ్‌, ఆకాశ్‌ బైరమూడి, ప్రణవి మానుకొండ, పూజా మూర్తి, కల్కి రాజా లాంటి ఈ ప్రోగ్రామ్‌లో పాల్గొన్నారు. ఇక జీ తెలుగు ఆల్‌టైమ్‌ ఫేవరెట్‌ జంటలైన వీజే సన్నీ, మేఘనా లోకేష్‌ తొలిసారిగా ఈ కార్యక్రమాన్ని అద్భుతమైన జోష్‌తో నిర్వహించారు. అన్నింటికి మించి అల వైకుంఠపురంలో సినిమాలోని బుట్టబొమ్మ, సరిలేరు నీకెవ్వరు సినిమాలోని మైండ్‌ బ్లాక్‌ పాటలకు వీజే సన్నీ, మేఘనా లోకేష్‌ తమ అద్భుతమైన స్టెప్పులతో ఇరగదీశారు. వీజే సన్నీ అనగానే మంచి డ్యాన్సర్‌ గుర్తుకువస్తాడు, కానీ సన్నీ తొలిసారిగా గాయకుడి అవతారం ఎత్తాడు. ఇక ప్రతాప్‌ అభి, అనూష హెగ్డే తమ ప్రేమ కథను, అందులోని మధురిమల్ని అందరితో పంచుకున్నారు. ఈ సందర్భంగా మెరుపు కలలు సినిమాలోని వెన్నెలవే వెన్నెలవే పాటతో ప్రేక్షకులను అలరించాడు అభి.

zee telugu host padi padi leche manasu programe for  valentines day special,pradeep machiraju,pradeep,zee 5,padi padi leche manasu,Valentine day,Valentine week,valentine list,valentine day 2020,valentine day list,valentine gift,gift for valentine,valentine special,valentine week 2020,valentine day gift,zee 5,pradeep,valentines day,tollywood,telugu cinema,పడి పడి లేచే మనసు,వాలెంటైన్స్ డే,ప్రేమికుల రోజు
జీ తెలుగులో ప్రసారం కానున్న పడి పడి లేచే మనసు ప్రోగ్రామ్ (Twitter/Photo)


సాధారణంగా టీవీ షోస్‌ అంటే ప్రదీప్‌ మాచిరాజు అందర్ని ఆహ్వానిస్తాడు. కానీ ఈ షోకి ప్రదీప్‌నే ప్రత్యేక అతిథిగా ఆహ్వానించారు. ఆ అహ్వానం కూడా అలా ఇలా కాదు, ఆయన లేటెస్ట్‌గా నటించిన ‘30 రోజుల్లో ప్రేమించడం ఎలా’ సినిమాలోని నీలి నీలి ఆకాశం పాటకు ఆకాశ్‌ బైరమూడి, ఐశ్వర్య తమ అద్భుతమైన పర్‌ఫార్మెన్స్‌తో ప్రదీప్‌ని మర్చిపోలేని విధంగా ప్రోగ్రామ్‌లోకి ఆహ్వానించడం విశేషం.

zee telugu host padi padi leche manasu programe for  valentines day special,pradeep machiraju,pradeep,zee 5,padi padi leche manasu,Valentine day,Valentine week,valentine list,valentine day 2020,valentine day list,valentine gift,gift for valentine,valentine special,valentine week 2020,valentine day gift,zee 5,pradeep,valentines day,tollywood,telugu cinema,పడి పడి లేచే మనసు,వాలెంటైన్స్ డే,ప్రేమికుల రోజు
జీ తెలుగులో ప్రసారం కానున్న పడి పడి లేచే మనసు ప్రోగ్రామ్ (Twitter/Photo)
ప్రేమకథలు, వాటి తాలూకు ఊసులతో పాటు ప్రేమ ఎంత మధురం సీరియల్‌లో నటిస్తున్న వెంకట్‌ శ్రీరామ్‌-వర్షా హెచ్‌కె, త్రినయనిలో నటిస్తున్న ఆషికా గోపాల్‌ పడుకునే-చందు గౌడ, తూర్పు పడమర సీరియల్‌లోని యామిని-జయా కవి- విజయ్‌ తమ ప్రజెన్స్‌తో ఆహుతుల్ని ఆకట్టుకున్నారు.సో… ఈ వేలంటైన్స్‌ డేని జీ తెలుగు ‘పడి పడి లేచే మనసు’ కార్యక్రమంతో ఆనందంగా జరుపుకోండి. పడి పడి లేచే మనసు.. ఫిబ్రవరి 16, ఆదివారం సాయంత్రం 6 గంటల నుంచి మీ జీ తెలుగు మరియు జీ తెలుగు హెచ్‌డి ఛానల్స్‌లో ప్రసారం కానుంది.

 
First published: February 12, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు