అంగరంగ వైభవంగా జీ తెలుగు సినీ అవార్డ్స్.. ఉత్తమ నటీనటులుగా చిరు, సమంత..

తెలుగు ఎంటర్ట్మెంట్ రంగంలో అద్భుతమైన సీరియల్స్‌, అదిరిపోయే రియాలిటీ షోస్‌.. అంతకుమించిన సూపర్‌ హిట్‌ సినిమాలతో అప్రతిహతంగా తన జైత్రయాత్ర కొనసాగిస్తోంది జీ తెలుగు ఛానెల్. ఎన్నో ఏళ్లుగా తెలుగు ప్రేక్షకుల్ని రంజింపచేస్తున్న జీ తెలుగు, జీ సినీ అవార్డ్స్‌ 2020 కార్యక్రమాన్ని కన్నుల పండుగగా జరిగింది.

news18-telugu
Updated: January 24, 2020, 7:04 PM IST
అంగరంగ వైభవంగా జీ తెలుగు సినీ అవార్డ్స్.. ఉత్తమ నటీనటులుగా చిరు, సమంత..
కళా తపస్వీ విశ్వనాథ్‌ను జీవిత సాఫల్య పురస్కారంతో సత్కరించిన చిరంజీవి (Zee/Telugu)
  • Share this:
తెలుగు ఎంటర్ట్మెంట్ రంగంలో అద్భుతమైన సీరియల్స్‌, అదిరిపోయే రియాలిటీ షోస్‌.. అంతకుమించిన సూపర్‌ హిట్‌ సినిమాలతో అప్రతిహతంగా తన జైత్రయాత్ర కొనసాగిస్తోంది జీ తెలుగు ఛానెల్. ఎన్నో ఏళ్లుగా తెలుగు ప్రేక్షకుల్ని రంజింపచేస్తున్న జీ తెలుగు, జీ సినీ అవార్డ్స్‌ 2020 కార్యక్రమం ఎంతో కన్నుల పండుగగా జరిగింది. ఈ వేడుకకు తెలుగు సినీ రంగానికి సంబంధించిన అతిరథ మహారథులు హాజరయ్యారు. ఈ వేడుక నాన్‌స్టాప్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రొగ్రామ్స్‌తో పాటు.. అద్భుతమైన డ్యాన్స్‌లకు వేదికగా మారింది జీ సినీ అవార్డ్స్‌ 2020 ప్రోగ్రామ్. ఈ   కార్యక్రమం జనవరి 25, 26 తేదీల్లో శని, ఆదివారాలు  సాయంత్రం 6 గంటల నుంచి  జీ తెలుగు మరియు జీ తెలుగు హెచ్‌డీ చానెల్స్‌లో ప్రసారం కానుంది.

జీ తెలుగు ఉత్తమ నటిగా ఎంపికైన సమంత అక్కినేని (Zee/Telugu)


ఈ వేడుకలో మెగాస్టార్ చిరంజీవి ప్రధాన ఆకర్షణగా నిలిచారు. ఆయనతో పాటు.. జయప్రద, రామ్‌, సమంత, కార్తికేయ, పూజా హెగ్డే, చార్మీకౌర్‌, రెజీనా, నీల్‌ నితిన్‌ ముకేష్‌, ఖుష్బూ, శ్రద్ధా శ్రీనాథ్‌, అల్లరి నరేష్‌, శివాత్మిక రాజశేఖర్‌, ఆనంద్‌ దేవరకొండతో పాటు ఇతర సినీ సెలబ్రిటీలు హాజరై సందడి చేసారు. ఈ అవార్డు కార్యక్రమంలో నిధి అగర్వాల్, మెహ్రీన్, హాట్ యాంకర్ అనసూయ డాన్సులు ప్రోగ్రామ్‌కే హైలె‌ట్‌గా నిలిచాయి. జీ తెలుగు 2020 ప్రోగ్రామ్‌లో ప్రముఖ దర్శకుడు కళా తపస్వీ కే.విశ్వనాథ్ జీవిత సాఫల్య పురస్కారంతో సత్కరించారు.

జీ తెలుగు అవార్డ్స్ వేడుకలో డాన్సులతో సందడి చేసిన కార్తికేయ (Zee/Telugu)


ఇక సైరా సినిమాలో నటనకు గాను చిరంజీవి ఉత్తమ నటుడి అవార్డు సొంతం చేసుకున్నారు. ఇక మజిలీ, ‘ఓ బేబి’ సినిమాలో నటనకు గాను సమంత ఉత్తమ నటిగా పురస్కారం అందుకుంది. ఇక ఈ కార్యక్రమంలో మహేష్ బాబు ట్విట్టర్ స్టార్‌గా అవార్డు అందుకోవడం విశేషం. మొత్తానికి ఎంతో అంగరంగ వైభవంగా జరిగిన ఈ వేడుకను ఆద్యంతం ప్రదీప్, రవి, శ్యామల తనదైన యాంకరింగ్‌తో రక్తి కట్టించారు.
Published by: Kiran Kumar Thanjavur
First published: January 24, 2020, 7:03 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading