ముద్దుల ప్రాక్టీస్ కోసం ఇంటికి రమ్మన్నాడు: సల్మాన్ ఖాన్ భామ జరీన్ ఖాన్

సల్మాన్ ఖాన్ హీరోగా 2010లో వచ్చిన ‘వీర్’ సినిమాతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది జరీన్ ఖాన్.

news18-telugu
Updated: September 20, 2019, 12:29 PM IST
ముద్దుల ప్రాక్టీస్ కోసం ఇంటికి రమ్మన్నాడు: సల్మాన్ ఖాన్ భామ జరీన్ ఖాన్
Instagram/zareenkhan
  • Share this:
‘వీర్’ సినిమాతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది జరీన్ ఖాన్. చూడటానికి అచ్చం  కత్రినా కైఫ్‌లా ఉందంటూ సల్మాన్ ఖాన్ ఆమెకు ‘వీర్’ సినిమాలో అవకాశం ఇచ్చారని అప్పట్లో వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే అంత పెద్ద హీరో అండదండలు ఉన్నప్పటికీ తాను కూడా లైంగిక వేధింపులు ఎదుర్కొన్నానని జరీన్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది... వివరాలలోకి వెళితే 'వీర్' సినిమా అనుకునంత ప్రేక్షకాదరణ పొందలేదు దాంతో జరీన్‌కు అవకాశాలు తగ్గిపోయాయి. దీనికితోడు జరీన్‌కు అన్నీ సెక్స్ ఓరియంటెడ్ సన్నివేశాలు ఉన్న సినిమాల అవకాశాలు వచ్చేవి. ఈ క్రమంలో ఆమెకు కొందరి నుంచి చేదు ఘటనలు కూడా ఎదురయ్యాయని తెలిపింది. ఓసారి ఓ దర్శకుడు తనతో ప్రవర్తించిన తీరు గురించి జరీన్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది.
వివరాల్లోకి వెళితే.. ఓ సినిమాలో నేను ముద్దు సీన్లలో నటించాల్సి ఉంది. ఆ సీన్లను ప్రాక్టీస్ చేయడానికి ఇంటికి రమ్మని ఓ దర్శకుడు నన్ను అడిగాడని తెలిపింది. అందుకు నేను అంగీకరించలేదు. అలాగే బాలీవుడ్‌కి చెందిన కొందరు ప్రముఖులతో సన్నిహితంగా ఉంటేనే అవకాశాలు వస్తాయని మరో వ్యక్తి నాకు సలహా ఇచ్చాడని.. అయినా నేను అలాంటి పనిచేయలేదని జరీన్ ఈ సందర్భంగా చెప్పుకొచ్చింది. 
View this post on Instagram
 

Don’t grieve... Anything you lose comes around in another form. #WednesdayWisdom #ZareenKhan


A post shared by Zareen Khan 🦄🌈✨👼🏻 (@zareenkhan) on

జరీన్ ఖాన్ ప్రస్తుతం గోపిచంద్ హీరోగా వస్తోన్న 'చాణక్య' సినిమాలో నటిస్తోంది. ఈ సినిమా టీజర్ ఇటీవలే విడుదలై మంచి ఆదరణ పొందింది. మెహ్రీన్ హీరోయిన్‌గా చేస్తోంది. ఈ సినిమా దసరాకు విడుదలకానుంది.
First published: September 20, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading