• HOME
  • »
  • NEWS
  • »
  • MOVIES
  • »
  • YUVRAJ SINGH WISHES SANJAY DUTT SPEEDY RECOVERY FROM LUNG CANCER SR

Yuvraj Singh: ఆ నొప్పి ఎంత బాధిస్తుందో నాకు తెలుసు.. : యువరాజ్ సింగ్‌..

Yuvraj Singh: ఆ నొప్పి ఎంత బాధిస్తుందో నాకు తెలుసు.. : యువరాజ్ సింగ్‌..

సంజయ్ దత్, యువరాజ్ సింగ్ Photo : Twitter

Sanjay Dutt: ప్రముఖ బాలీవుడ్‌ నటుడు సంజయ్‌దత్‌కు ఊపిరితిత్తుల క్యాన్సర్‌ నిర్ధారణ అయినట్లు తాజాగా వార్తలు వస్తోన్న విషయం తెలిసిందే.

  • Share this:
    ప్రముఖ బాలీవుడ్‌ నటుడు సంజయ్‌దత్‌కు ఊపిరితిత్తుల క్యాన్సర్‌ నిర్ధారణ అయినట్లు తాజాగా వార్తలు వస్తోన్న విషయం తెలిసిందే. సంజయ్ దత్ గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. శ్వాస తీసుకోవడంలో కొంత ఇబ్బంది రావడంతో ముంబయిలోని ఓ ఆసుపత్రిలో చేరి పరీక్షలు చేయించుకున్నాడు. అయితే ఆ పరీక్షల్లో ఆయనకు కరోనాకు నెగిటివ్ రాగా.. లంగ్ క్యాన్సర్ అని తెలిందట. దీంతో ఆయన మెరుగైన వైద్యం కోసం అమెరికా వెళ్లనున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా సంజయ్‌ దత్‌ ఆరోగ్యంపై టీమిండియా మాజీ క్రికెటర్‌ యువరాజ్‌సింగ్‌ ట్విటర్‌ ద్వారా స్పందించాడు. యువరాజ్ సింగ్ ఆయనలో ధైర్యాన్ని నింపే ప్రయత్నం చేశాడు. గతంలో యువరాజ్ కూడా 2011లో ఈ క్యాన్సర్‌తో బాధ పడి కోలుకున్నాడు. యువరాజ్ తన ట్విట్టర్ ఖాతాలో సంజయ్‌ను ఉద్దేశిస్తూ...



    సంజయ్ దత్... మీరు ఈ సమయంలో మీరు ఫైటర్‌లా పోరాడాలి. ఆ నొప్పి ఎలా ఉంటుందో నాకు తెలుసు. ఆ నొప్పిని నేను స్వయంగా అనుభవించాను. ఆ నొప్పిని భరించేందుకు మీరు దృఢంగా ఉండాలి. మీరు తొందరగా కోలుకోవాలని ఆ దేవున్ని ప్రార్థిస్తున్నాను'' అని ట్వీట్‌ చేశాడు.
    Published by:Suresh Rachamalla
    First published: