MAA Elections: 'మా'లో మరో బిగ్ ట్విస్ట్.. పోలింగ్ కేంద్రంలో రౌడీషీటర్.. సాక్ష్యాలిదిగో...!

'మా' అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తన ప్యానల్‌ సభ్యులతో కలిసి ఆయన తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ప్రకాశ్‌ రాజ్‌, తన సమక్షంలోనే ఎన్నికల అధికారి పోస్టల్ బ్యాలెట్లు ఓపెన్ చేయించారని.. అందులో మూడో వ్యక్తి ప్రవేశించలేదన్నారు మంచు విష్ణు. కానీ ఎన్నికలు అయిపోయిన తర్వాత ఇలాంటి విమర్శలు అన్నీ తనకు వినిపిస్తున్నాయని చెప్పాడు ఈయన.

MAA elections: సాంబశివరావుకు వైసీపీతో నేరుగా సంబంధం లేదని తెలుస్తోంది. కానీ వైసీపీ పేరును వాడుకొని సెటిల్‌మెంట్లు, దందాలు చేస్తుంటాడని సమాచారం. మోహన్ బాబు ఫ్యామిలీతో మాత్రం సత్సంబంధాలు ఉన్నాయని సినీ వర్గాలు చెబుతున్నాయి.

  • Share this:
    మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (MAA) ఎన్నికలు ముగిసి 12 రోజులవుతున్నా.. టాలీవుడ్‌లో ఇంకా రచ్చ కొనసాగుతూనే ఉంది. ఈ అసోసియేషన్ ఎప్పుడూ వార్తల్లోనే ఉంటుంది. తాజా ప్రకాశ్ రాజ్ (Prakash Raj) సంచలన వ్యాఖ్యలు చేశారు. అక్టోబరు 10న జరిగిన మా ఎన్నికల పోలింగ్‌లో రౌడీ షీటర్లు పాల్గొన్నాని బాంబు పేల్చారు. దీనికి సంబంధించి ఫొటోలను ఆయన విడుదల చేశారు. కృష్ణా జిల్లా జగ్గయ్యపేటకు చెందిన  రౌడీ షీటర్ నూకల సాంబ శివరావు (Nookala Samba shiva rao) పోలింగ్ కేంద్రం లోపలికి వెళ్లి ఓటర్లను బెదిరించారని ఆరోపించారు.  మంచు విష్ణు (Manchu Vishnu)కు అనుకూలంగా పోలింగ్‌ను ప్రభావితం చేశారని విమర్శించారు. మా సభ్యుడి కాని బయటి వ్యక్తిని లోపలికి ఎలా అనుమతించారని ప్రశ్నిస్తున్నారు. సాంబ శివరావు వైసీపీ కార్యకర్తగా ఉన్నారని ప్రకాశ్ రాజ్ ఆరోపిస్తున్నారు.

    నూకల సాంబశివరావుపై అనేక బెదిరింపులు, సెటిల్‌మెంట్ కేసులు ఉన్నాయని ప్రకాశ్ రాజ్ తెలిపారు. ఆయనపై జగ్గయ్యపేటలో రౌడీషీట్  ఉంది. రెండు హత్యకేసుల్లో నిందితుడిగా ఉన్నారు. నోట్ల రద్దు సమయంలో కోట్లాది రూపాయలను అక్రమంగా తరలించినట్లు నూకల సాంబపై ఆరోపణలున్నాయి. అడ్డుకునేందుకు ప్రయత్నించిన ఎస్‌ఐని కారుతో తొక్కించి హత్యాయత్నం చేశారు. అంతేకాదు  రజినీకాంత్ ఫ్యాన్స్ అసోసియేషన్‌లో సభ్యుడిగానూ నూకల సాంబశివరావు ఉన్నారు. మోహన్ బాబు ద్వారా రజినీకాంత్‌తో ఈయనకు పరిచయం ఏర్పడినట్లు సినీ వర్గాలు తెలిపాయి.

    అఖిల్ సాంగ్ వింటూ ఫ్యామిలీతో అల్లు అర్జున్ లాంగ్ డ్రైవ్.. వీడియో వైరల్..

    ఐతే సాంబశివరావుకు వైసీపీతో నేరుగా సంబంధం లేదని తెలుస్తోంది. కానీ వైసీపీ పేరును వాడుకొని సెటిల్‌మెంట్లు, దందాలు చేస్తుంటాడని సమాచారం. మోహన్ బాబు ఫ్యామిలీతో మాత్రం సత్సంబంధాలు ఉన్నాయని సినీ వర్గాలు చెబుతున్నాయి. ఐతే మా  సభ్యుడి కానీ ఓ రౌడీ షీటర్‌కు పోలింగ్ కేంద్రంలో పనేంటని ప్రకాష్ రాజ్ విమర్శలు గుప్పిస్తున్నారు. ఆ ఫొటోల ఆధారంగా 'మా' ఎన్నికల అధికారి కృష్ణమోహన్‌కు ఆయన ఫిర్యాదు చేశారు. ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడిన విష్ణుపై తక్షణం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పోలింగ్ రోజున అసలేం జరిగిందో అందరికీ తెలియాలని, సీసీ ఫుటేజీని ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.  'మా' ఎన్నికల్లో అక్రమాలకు సంబంధించి మరిన్ని ఆధారాలను బయటపెడతానని ప్రకాశ్ రాజ్ స్పష్టం చేశారు.

    ఆకట్టుకుంటోన్న వరుడు కావలెను ట్రైలర్.. ఫ్యామిలీ ఆడియెన్సే టార్గెట్..

    మరోవైపు మా ఎన్నికల అధికారి కృష్ణమోహన్ వాదన భిన్నంగా ఉంది. ఎన్నికలపై ఎవరూ అభ్యంతరం చెప్పలేదని అన్నారు. తమకు ఇప్పటి వరకు ఎలాంటి ఫిర్యాదులు అందలేదని స్పష్టం చేశారు.
    Published by:Shiva Kumar Addula
    First published: