క్యాస్టింగ్ కౌచ్‌ పై రోజా సంచలన వ్యాఖ్యలు.. తమ్మారెడ్డికి అదిరిపోయే కౌంటర్ ఇచ్చిన ఫైర్ బ్రాండ్..

ప్రముఖ దర్శక, నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ ‘నా ఆలోచన’ అనే కార్యక్రమం ద్వారా తన రాజకీయ , సినిమా అభిప్రాయాలను పంచుకుంటుంటారు. తాజాగా ఈ కార్యక్రమంలో తాజాగా జరిగిన ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో రెండోసారి నగరి నియోజకవర్గం నుంచి రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన సినీ నటి కమ్ వైసీపీ నేత రోజాతో ప్రత్యేకంగా  ఇంటర్వ్యూ చేసారు. ఈ ఇంటర్వ్యూలో రోజాను రాజకీయ, సినిమా కు సంభందించిన పలు ప్రశ్నలను సంధించారు తమ్మారెడ్డి. దానికి ఎంతో ఆసక్తికరంగా సమాధానాలు ఇచ్చింది రోజా. 

news18-telugu
Updated: June 13, 2019, 10:58 AM IST
క్యాస్టింగ్ కౌచ్‌ పై రోజా సంచలన వ్యాఖ్యలు.. తమ్మారెడ్డికి అదిరిపోయే కౌంటర్ ఇచ్చిన ఫైర్ బ్రాండ్..
ఎమ్మెల్యే రోజా, తమ్మారెడ్డి భరద్వాజ్
  • Share this:
ప్రముఖ దర్శక, నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ ‘నా ఆలోచన’ అనే కార్యక్రమం ద్వారా తన రాజకీయ , సినిమా అభిప్రాయాలను పంచుకుంటుంటారు. తాజాగా ఈ కార్యక్రమంలో తాజాగా జరిగిన ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో రెండోసారి నగరి నియోజకవర్గం నుంచి రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన సినీ నటి కమ్ వైసీపీ నేత రోజాతో ప్రత్యేకంగా  ఇంటర్వ్యూ చేసారు. ఈ ఇంటర్వ్యూలో రోజాను రాజకీయ, సినిమా కు సంభందించిన పలు ప్రశ్నలను సంధించారు తమ్మారెడ్డి. దానికి ఎంతో ఆసక్తికరంగా సమాధానాలు ఇచ్చింది రోజా.  ఎంతో ఇంట్రెస్ట్‌గా సాగిన ముఖాముఖిలో  రెండోసారి ఎమ్మెల్యే గా గెలిచినందుకు ఎలా ఫీల్ అవుతున్నావ్ అనే ప్రశ్నకు సమాధానంగా రోజా చాలా ఆనందంగా ఉంది అంటూ సమాధానమిచ్చింది. ఈ ఐదేళ్ల కాలంలో  అసెంబ్లీలో చాలా విషయాలపై ఫైట్ చేయడం వల్ల చంద్రబాబు నన్ను అసెంబ్లీకి రాకుండా అడ్డుకోవడానికి చాలా ప్రయత్నాలు చేశారని చెప్పుకొచ్చారు. అవన్నీ దాటి గెలిచి రావడం చాలా ఆనందంగా ఉంది అంటూ సమాధాన మిచ్చింది.

YSRCP MLA Roja Sensational comments on Casting Couch with tammareddy bharadwaj interview,ysrcp mla roja,ysrcp nagari ap assembly constituency mla roja,nagari mla roja,roja interview with tammreddy bharadwaj,tammareddy bharadwaj,tammareddy bharadwaj roja interview,roja mla oath,roja sensational comments on casting couch,roja instagram,roja twitter,roja facebook,roja jabardasth comedy show,jabardasth comedy show,tollywood,telugu cinema,తమ్మారెడ్డి భరద్వాజ,తమ్మారెడ్డి భరద్వాజ రోజా ఇంటర్వ్యూ,వైసీపీ నగరి ఎమ్మెల్యే రోజా,ఎమ్మెల్యే రోజా,రోజా,కాస్టింగ్ కౌచ్ పై రోజా సంచలన వ్యాఖ్యలు,తమ్మారెడ్డి భరద్వాజా రోజా,రోజా ఫేస్‌బుక్,రోజా ఇన్‌స్టాగ్రామ్,రోజా ట్విట్టర్,రోజా అందాలు,
రెండోసారి ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన రోజా


మరోవైపు తమ్మారెడ్డి భరద్వాజ్ సినీ ఇండస్ట్రీలో జరుగుతున్న కాస్టింగ్ కౌచ్‌పై రోజాను పలు ప్రశ్నలు అడగడంతో పాటు ఇండస్ట్రీలో కౌస్టింగ్‌ కౌచ్ తరహాలో మీకేమైన అనుభవాలు ఎదురయ్యాయా అని   అడిగిన ప్రశ్నకు రోజా ఆసక్తికరమైన జవాబిచ్చింది.  నా సినీ ప్రయాణం మొత్తం ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా సాఫీగానే సాగింది అంటూ సమాధానమిచ్చారు. నీకు నాలా ఎందుకు అంత నోటి దూల? అందర్నీ తిడతావు? అనే ఆసక్తికర ప్రశ్నకు సమాధానంగా బయటివాళ్ళు నన్ను ఫైర్ బ్రాండ్ అనిపిలుస్తారు. దానివల్లే మనం బతుకుతున్నాం. మన జోలికి ఎవరూ రావడం లేదు. నాతో ఉన్న వాళ్లతో చాలా ఫ్రెండ్లీగానే ఉంటా.అంటూ తన శైలి లో సమాధానమిచ్చింది. సినిమాల్లో గాడ్ ఫాదర్ ఉండాలంటారా? అని తమ్మారెడ్డి సంధించిన ప్రశ్నకు సమాధానంగా నేనైతే ఒక సినిమా చేసిన తరువాత మళ్లీ ఆ నిర్మాతతో రెండో సినిమా చేయలేదు. ఒక్క మీతో తప్ప. ఇండస్ట్రీలో  రోజా రాక్షసి అని పేరుంది. అందుకే నాకు ఎక్కువ అవకాశాలు ఇవ్వలేదు అంటూ రోజా చెప్పుకొచ్చారు.
Published by: Kiran Kumar Thanjavur
First published: June 13, 2019, 10:58 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading