ఏపీఐఐసీ పదవిపై రోజా అసంతృప్తి.. కారణాలు అవేనా..

ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కేబినెట్‌లో మంత్రి పదవి దక్కించుకోలేకపోయిన ఎమ్మెల్యే రోజాను వైసీపీ నాయకత్వం ఎలాగోలా బుజ్జగించింది. ఆమెకు కీలకమైన ఏపీఐఐసీ చైర్మన్ పదవిని కట్టబెట్టి ఆమెను కూల్ చేసింది. కానీ రోజా మాత్రం ఏపీఐఐసీ చైర్మన్ పదవి పై అంతగా ఆసక్తి లేనట్టు ఆమె సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి.

news18-telugu
Updated: July 18, 2019, 6:34 PM IST
ఏపీఐఐసీ పదవిపై రోజా అసంతృప్తి.. కారణాలు అవేనా..
ఎమ్మెల్యే రోజా (File)
  • Share this:
ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కేబినెట్‌లో మంత్రి పదవి దక్కించుకోలేకపోయిన ఎమ్మెల్యే రోజాను వైసీపీ నాయకత్వం ఎలాగోలా బుజ్జగించింది. ఆమెకు కీలకమైన ఏపీఐఐసీ చైర్మన్ పదవిని కట్టబెట్టి ఆమెను కూల్ చేసింది. కానీ రోజా మాత్రం ఏపీఐఐసీ చైర్మన్ పదవి పై అంతగా ఆసక్తి లేనట్టు ఆమె సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. వై.యస్.జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష ఉన్నపటి నుంచి పార్టీ తరుపున రోజా అన్ని వేదికల్లో తన వాయిస్ వినిపించేది. అంతేకాదు గత చంద్రబాబు ప్రభుత్వంలో ఎన్నో విషయాల్లో ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టడంలో రోజా సఫలమయ్యారు. దీంతో అప్పటి  ప్రభుత్వం రోజాపై ఏడాది పాటు సస్పెన్షన్ వేటు వేసిన సంగతి తెలిసిందే కదా. ఈ రకంగా చంద్రబాబు నేతృత్వంలోని టీడీపీ ప్రభుత్వంపై అలుపెరగని పోరాటం చేసింది రోజా. అంతేకాదు వైసీపీ తరుపున సినీ గ్లామర్ కాస్తంత ఎక్కువ ఉన్నది ఈమెకే. మరోవైపు జబర్దస్త్ కామెడీ షో జడ్జ్‌గా రోజా మాస్‌లో మాంచి ఫాలోయింగ్ కూడా ఉంది.

ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కేబినెట్‌లో మంత్రి పదవి దక్కించుకోలేకపోయిన ఎమ్మెల్యే రోజాను వైసీపీ నాయకత్వం ఎలాగోలా బుజ్జగించింది. ఆమెకు కీలకమైన ఏపీఐఐసీ చైర్మన్ పదవిని కట్టబెట్టి ఆమెను కూల్ చేసింది. కానీ రోజా మాత్రం ఏపీఐఐసీ చైర్మన్ పదవి పై అంతగా ఆసక్తి లేనట్టు ఆమె సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి.
ఎమ్మెల్యే రోజా, సీఎం జగన్


ఈరకంగా వైసీపీ తరుపున ఎన్నో పోరాటాలు చేసిన రోజాకు ఏపీఐఐసీ పదవితో సరిపెట్టడాన్ని రోజా అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. జగన్ కూడా తన సామాజిక వర్గంతో పాటు మిగిలిన సామాజికి వర్గాలకు మంత్రివర్గంలో తగిన ప్రాతినిధ్యం కల్పించాడు. మరోవైపు లోక్‌సభ, రాజ్యసభతో పాటు మిగిలిన కార్పోరేషన్ పదవుల్లో తన సామాజిక వర్గానికి మంచి ప్రాధాన్యతే ఇచ్చాడు. అదే కోవలో ఇపుడు రోజాకు ఏపీఐఐసీ పదవితో సరిపెట్టారు. ఇక రెండున్నరేళ్ల తర్వాత జరగబోయే మంత్రి వర్గ విస్తరణలో రోజాతో పాటు వైసీపీ గెలుపులో కీలక పాత్ర పోషించిన తక్కిన వారందరికీ మంత్రి పదవులు ఇస్తానని చెప్పడంతో వాళ్లందరు రిలాక్స్‌గా ఉన్నారు. ఏమైనా రెండు సార్లు ఎమ్మెల్యే గెలవడంతో పాటు పార్టీ తరుపున బలమైన వాయిస్‌ను వినిపించిన తనకు ఏపీఐఐసీ వంటి కీలక పదవి ఇచ్చిన రోజా అసంతృష్తితో రగిలిపోతున్నట్టు రోజా సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి.
Published by: Kiran Kumar Thanjavur
First published: July 18, 2019, 6:34 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading