బాలకృష్ణ‌ను సవాల్ చేయనున్న ఎమ్మెల్యే రోజా..

బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను డైరెక్షన్‌లో త్వరలో ఓ కొత్త సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే.

news18-telugu
Updated: November 28, 2019, 7:23 PM IST
బాలకృష్ణ‌ను సవాల్ చేయనున్న ఎమ్మెల్యే రోజా..
Twitter
  • Share this:
బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను డైరెక్షన్‌లో త్వరలో ఓ కొత్త సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. బాలయ్య, బోయపాటి కాంబినేషన్‌లో గతంలో వచ్చిన ‘సింహా’, ‘లెజెండ్‌’ చిత్రాలు మాంచి విజయాన్ని అందుకున్నాయి. తాజాగా ఈ ఇద్దరి కలయికలో మరో సినిమా వస్తోంది. అయితే ఈ సినిమా కూడా గత సినిమాల మాదిరిగానే  ఫ్యామిలీ యాక్షన్‌ జానర్‌లో రానుందని తెలుస్తోంది. కాగా ఓ అదిరిపోయే వార్త  సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అదేంటంటే ఈ సినిమాలో రోజా నటించనున్నారని.. అంతేకాదు ఆమె ఈ సినిమాలో విలన్ పాత్రలో కనిపించనున్నారని తెలుస్తోంది. కానీ దీనిపై ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. బాలకృష్ణ, రోజా కాంబినేషన్‌కు తెలుగు ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు ఉంది. గతంలో  ఈ ఇద్దరి కాంబినేషన్‌లో గతంలో వచ్చిన సినిమాలు మాంచి వినోదాన్ని అందించాయి. దీంతో మరోసారి ఈ ఇద్దరు సందడి చేయబోతున్నారనే వార్తలు రావడంతో అభిమానులు ఎంతో సంతోష పడుతున్నారు.

Twitter
Twitter


కాగా బాలయ్య ప్రస్తుతం కె.ఎస్‌.రవికుమార్‌ దర్శకత్వంలో ‘రూలర్‌’ అనే చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమాకు సంబందించి ఇటీవల ఓ టీజర్ వచ్చిన సంగతి తెలిసిందే. రూలర్‌లో సోనాల్‌ చౌహాన్‌, వేదిక హీరోయిన్స్‌గా చేస్తున్నారు. డిసెంబర్‌ 20న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు  రానుంది.
పూజా హెగ్డే హాట్ పిక్స్..
First published: November 28, 2019, 6:45 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading