Roja: రోజా నిజంగానే అంత పని చేస్తుందా.. హ్యాపీగా ఫీల్ అవుతున్న ఫ్యాన్స్..

తాజాగా రోజా మరోసారి సినిమాల్లో రీ ఎంట్రీ ఇవ్వడానికి రంగం సిద్దం చేసుకున్నట్టు సమాచారం. ఒక పెద్ద హీరో, దర్శకుడికి సంబంధించిన సినిమాలో కీలక పాత్రలో నటించడానికి ఓకే చెప్పినట్టు సమాచారం.

news18-telugu
Updated: August 14, 2019, 11:37 AM IST
Roja: రోజా నిజంగానే అంత పని చేస్తుందా.. హ్యాపీగా ఫీల్ అవుతున్న ఫ్యాన్స్..
ఎమ్మెల్యే రోజా (File)
news18-telugu
Updated: August 14, 2019, 11:37 AM IST
ప్రస్తుతం  సినీ నటి రోజా.. ఒకవైపు రాజకీయాలు..మరోవైపు జబర్ధస్త్ షోతో తీరిక లేకుండా గడిపింది. అంతేకాదు వైసీపీ నుంచి నగరి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి రెండో సారి ఎమ్మెల్యేగా ఎన్నిక అయింది. దీంతో రోజాకు వై.యస్.జగన్మోహన్ రెడ్డి మంత్రి వర్గంలో మంత్రి పదవి ఖాయం అనే మాట వినబడింది. కానీ సామాజిక సమీకణాల నేపథ్యంలో రోజాకు క్యాబినేట్‌లో స్థానం దక్కలేదు. దీంతో రోజాకు జగన్మోహన్ రెడ్డి క్యాబినేట్ హోదా గల  ఏపీఐఐసీ చైర్మన్ పదవి కట్టబెట్టారు. ఈ పదవిపై రోజా అసంతృప్తి ఉన్నట్టు సమాచారం ఉన్న పైకి మాత్రం బాగానే ఉన్నట్టు కనబడుతుంది. ఏపీఐఐసీ చైర్మన్ పదవి దక్కినప్పటికీ రోజా ..జబర్ధస్త్ షోకు జడ్జ్‌గా వ్యవహరిస్తున్నారు. ఇది వరకటిలా జబర్ధస్త్‌ షోలో హుందాగా వ్యవహరిస్తున్నారు.

ysrcp mla roja slams tdp chief chandrababu naidu in kia motors car inauguration, కియా కారు ప్రారంభోత్సవంలో మాజీ సీఎం చంద్రబాబుపై ఏపీఐఐసీ ఛైర్మన్, ఎమ్మెల్యే రోజా తీవ్ర విమర్శలు గుప్పించారు. ఎన్నికల్లో ఓటమితో చంద్రబాబు మతిస్థిమితం లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు.చంద్రబాబు పాలనంతా అవినీతి, లంచాలతో నడిచిందని ధ్వజమెత్తారు రోజా. విదేశాల నుంచి ప్రతినిధులను పిలిపించి డబ్బులు వృథా చేశారే తప్ప..ప్రజలకు ఏమీ చేయలేదని విరుచుకుపడ్డారు.
రోజా (ప్రతీకాత్మక చిత్రం)


క్యాబినేట్ ర్యాంకుతో సమానంగా ఉన్న పదవిలో ఉండటంతో పాటు.. మరో రెండున్నరేళ్ల తర్వాత జరగబోయే మంత్రివర్గ విస్తరణలో చోటు దాదాపు ఖాయమనే ఉద్యేశ్యమే ఏమో జబర్ధస్త్ ప్రోగ్రామ్‌లో రోజా.. ఇది వరకటిలా డాన్సులు మాత్రం చేయడం లేదు. తాజాగా రోజా మరోసారి సినిమాల్లో రీ ఎంట్రీ ఇవ్వడానికి రంగం సిద్దం చేసుకున్నట్టు సమాచారం. ఒక పెద్ద హీరో, దర్శకుడికి సంబంధించిన సినిమాలో కీలక పాత్రలో నటించడానికి ఓకే చెప్పినట్టు సమాచారం. కథలో రోజా పాత్రకు ప్రాముఖ్యం ఉండటంతో రోజా ఈ క్యారెక్టర్ చేయడానికి ఓకే చెప్పినట్టు సమాచారం. ఈ సినిమాలో యాక్ట్ చేసేందకు రోజాకు బాగానే ముట్టజెప్పబోతున్నట్టు సమాచారం. తొందర్లనే ఈ విషయమై అఫీషియల్ ప్రకటన వెలుబడే అవకాశం ఉంది. ఏమైనా ఇప్పటికే నటిగా దాదాపు 100 సినిమాలకు పైగా నటించింది రోజా. రాజకీయాల్లో ప్రవేశించడంతో సినిమాలకు గుడ్ బై చెప్పి .. జబర్ధస్త్ షోతో పాటు పలు టీవీ ప్రోగ్రామ్స్‌కు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు. ఏమైనా సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వాలన్న రోజా నిర్ణయాన్ని ఆమె అభిమానులు స్వాగతిస్తున్నారు.

First published: August 14, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...