హోమ్ /వార్తలు /సినిమా /

Roja-Hyper Aadi: హైపర్ ఆదిని దారుణంగా నిరాశపరిచిన రోజా.. అందరూ షాక్

Roja-Hyper Aadi: హైపర్ ఆదిని దారుణంగా నిరాశపరిచిన రోజా.. అందరూ షాక్

Roja Jabardasth: జబర్దస్త్ జడ్జి రోజా తనలోని కొత్త యాంగిల్‌ను చూపించారు. కమెడియన్‌గా అవతారమెత్తి.. హైపర్ ఆది స్కిట్‌లో నటించారు. పంచ్ ఫలక్‌నుమాకే పంచ్‌లా అన్నట్లుగా.. హైపర్ ఆదికే పంచ్‌లు వేస్తూ హైలైట్‌గా నిలిచారు రోజా.

  రోజా సెల్వమణి.. ఇటు జబర్దస్త్, అటు రాజకీయాలను రెండింటినీ బ్యాలెన్స్ చేస్తున్నారు. ఎమ్మెల్యేగా ఉన్నా.. ఏపీఐఐసీ ఛైర్‌పర్సన్‌‌గా బాధ్యతలు చేపట్టినా జబర్దస్త్‌ను మాత్రం వీడలేదు. కొన్ని కారణాలతో సహ జడ్జి నాగబాబు, పలువురు కమెడియన్లు ఈ షోను వదిలిపెట్టినప్పటికీ.. రోజా మాత్రం దూరం కాలేదు. జడ్జిగానే కాదు.. తనదైన పంచ్‌లతో కమెడియన్లపై సెటైర్లు వేస్తూ కడుపుబ్బా నవ్విస్తున్నారు. తాజా జబర్దస్త్ జడ్జి రోజా తనలోని కొత్త యాంగిల్‌ను చూపించారు. కమెడియన్‌గా అవతారమెత్తి.. హైపర్ ఆది స్కిట్‌లో నటించారు. పంచ్ ఫలక్‌నుమాకే పంచ్‌లా అన్నట్లుగా.. హైపర్ ఆదికే పంచ్‌లు వేస్తూ హైలైట్‌గా నిలిచారు రోజా.

  వచ్చే వారం ప్రసారమయ్యే జబర్దస్త్ షో‌కు సంబంధించి ఈటీవీ ప్రోమో విడుదల చేసింది. అందులో హైపర్ ఆది స్కిట్‌లో కమెడియన్‌గా కనిపించారు రోజా. 'రాజా' మూవీకి పేరడి చేశారు. సౌందర్య పాత్రలో ఆమె నటించారు. రాజా సినిమాలో వెంకటేష్, సుధాకర్ దొంగల్లా కనిపించగా.. ఈ స్కిట్‌లో హైపర్ ఆది, పరదేశి దొంగల పాత్రలు పోషించారు. ఇక ఇంట్లో పిల్లలుగా గణపతి సందడి చేశారు. దొంగలను వంటింట్లో పెట్టి తాళం వేసిన సీన్ నుంచి.. ఆది ఆటో డ్రైవర్‌గా మారడం, రోజా సింగర్‌గా పేరుతెచ్చుకోవడం, ఆమెకు సత్కారం చేయడం వరకు.. ఇందులో చూపించారు.

  సత్కార కార్యక్రమం చాలా ఫన్నీగా ఉండనున్నట్లు ప్రోమో చూస్తే అర్ధమవుతోంది. 'నేను ఈ స్థాయికి రావడానికి కారణం..'' అని రోజా అనగానే హైపర్ ఆది ఉబ్బితబ్బిపోతాడు. తన గురించే చెబుతుందని ఆశగా ఎదుచుచూస్తాడు. కానీ తాను ఈ పొజిషన్‌లో ఉన్నానంటే కారణం.. ఆ సెంటర్ కమెరావాళ్లు.. అని రోజా అనడంతో నవ్వులు పూశాయి. తన పేరు చెప్పకుండా తీవ్రంగా నిరాశపరించిందని వెరైటీ ఎక్స్‌ప్రెషన్ పెడతాడు ఆది. ఈ స్కిట్‌లో ఇలాంటి పంచ్‌లు చాలానే ఉన్నట్లున్నాయి. రోజా కామెడీ చూసిన నెటిజన్లు.. ఆమెపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఎమ్మెల్యే స్థాయిలో ఉండి కూడా జబర్దస్త్‌లో కమెడియన్‌గా నటించడం.. చాలా గ్రేట్ అని అభిప్రాయపడుతున్నారు. ఏదేమైనా వచ్చే వారం జబర్దస్త్‌లో ఈ స్కిట్ హైలైట్‌గా నిలవడం ఖాయమని అంటున్నారు. మరి పూర్తి స్కిట్ చూడాలంటే వచ్చే వారం వరకు వేచి చూడాల్సిందే.

  First published:

  Tags: Jabardasth, MLA Roja, Roja Selvamani, Tollywood

  ఉత్తమ కథలు