YSRCP LEADERS TALKS ABOUT AP MINISTER KODALI NANI JR NTR RELATION SHIP TA
జూనియర్ ఎన్టీఆర్ ను హీరోను చేసిన నాని..
జూనియర్ ఎన్టీఆర్ ఫైల్ ఫోటో (Source: Twitter)
తెలుగులో వన్ ఆఫ్ ది నెంబర్ వన్ హీరోగా తనకంటూ ఒక ఇమేజ్ క్రియేట్ చేసుకున్న ఎన్టీఆర్ను హీరోను చేసింది నాని అట. అంతేకాదు హీరోగా తారక్ కెరీర్ను చక్కదిద్దడంలో కీ రోల్ ప్లే చేసింది కూడా నాని అని చెబుతున్నారు.వివరాల్లోకి వెళితే..
తెలుగులో వన్ ఆఫ్ ది నెంబర్ వన్ హీరోగా తనకంటూ ఒక ఇమేజ్ క్రియేట్ చేసుకున్న ఎన్టీఆర్ను హీరోను చేసింది నాని అట. అంతేకాదు హీరోగా తారక్ కెరీర్ను చక్కదిద్దడంలో కీ రోల్ ప్లే చేసింది కూడా నాని అని చెబుతున్నారు.వివరాల్లోకి వెళితే.. ఇక్కడ నాని అంటే తెలుగు కథానాయకుడు నాని కాదు.. ప్రస్తుతం ఏపీ మంత్రి అయిన కొడాలి నాని. తాజాగా ఏపీలో జరిగిన ఎన్నికల్లో వైసీపీ తరుపున ఎమ్మెల్యేగా గెలిచి ఏపీ పౌరసరఫరాల శాఖ మంత్రి అయ్యారు. ఈయన జూనియర్ ఎన్టీఆర్తో ‘సాంబ’ అనే సినిమా నిర్మించారు. అంతేకాదు ఎన్టీఆర్ కెరీర్ తొలినాళ్లలో ఆయనతో సన్నిహితంగా ఉంటూ వచ్చారు. తాజాగా ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి రావడంతో పాటు కొడాలి నాని మంత్రి కావడంతో ఆయనను పొగుడుతూ ఒక అభినందన సభ జరిగింది.
జూనియర్ ఎన్టీఆర్,నాని
ఈ సభలో మరో మంత్రి పేర్నినాని సహా పలువురు నేతలు కొడాలి నానిని ఆకాశానికి ఎత్తేస్తూ మాట్లాడారు. అందులో పేర్నినాని ఒకింత దూకుడుగా మాట్లాడతూ అసలు జూనియర్ ఎన్టీఆర్కు యాక్టింగ్ లో మెలకవలతో పాటు ఓనమాలు నేర్పింది కూడా నాని అంటూ పొగిడం అందరినీన ఆశ్చర్యానికి గురి చేసింది. అంతేకాదు తారక్.. ఈ స్థాయిలో హీరోగా ఉండడంలో కొడాలి నాని పాత్ర మరవలేనది అంటూ తనదైన శైలిలో కొడాలి నాని మునగ చెట్టు ఎక్కించారు మరో మంత్రి పేర్నినాని. ఇక జూనియర్ ఎన్టీఆర్..నటుడిగా బుడిబుడి అడుగులు వేస్తున్న సమయంలో కొడాలి నాని..అండగా ఉన్న విషయం తెలిసిందే. అంతకు ముందు ఆయన హరికృష్ణకు చేదోడు వాదోడుగా ఉండేవారన్న సంగతి తెలిసిందే. అది కాదన్నట్టు.. ఏదో ఎన్టీఆర్ స్టార్ కావడంలో కొడాలి నాని పాత్ర ఉన్నట్టు బిల్డప్ ఇవ్వడం మాత్రం అక్కడున్న కొంత మందికి నచ్చేలేదు. మొత్తానికి ఈ అభినంద సభలో ఏపీలో అధికారంలోకి రావడంలో ఎంతో కృషి చేసి జగన్మోహన్ రెడ్డిని స్మరించకుండా..అనవసరంగా జూనియర్ ఎన్టీఆర్ టాపిక్ తీసుకురావడాన్ని చూసి అక్కడ వున్న వాళ్లు అవాక్కయ్యారు.