అదంతా రోజా చలవే.. జబర్దస్త్‌లోకి స్టార్ కమెడియన్ల ఎంట్రీ..

Jabardasth Comedy Show : జబర్దస్త్ కామెడీ షో అంటేనే నవ్వులు.. జోక్స్, పంచ్‌లకు కేరాఫ్ అడ్రస్‌గా మారిపోయిందీ షో. ఇద్దరు హాట్ యాంకర్లు, ఇద్దరు జడ్జిలు, బోలెడంత మంది ఆర్టిస్టులు కలిసి ప్రతి గురు, శుక్రవారాల్లో నవ్వుల పండుగను తీసుకొస్తారు.

news18-telugu
Updated: January 10, 2020, 7:15 AM IST
అదంతా రోజా చలవే.. జబర్దస్త్‌లోకి స్టార్ కమెడియన్ల ఎంట్రీ..
రోజా,పోసాని కృష్ణమురళి (Twitter/Photo)
  • Share this:
జబర్దస్త్ కామెడీ షో అంటేనే నవ్వులు.. జోక్స్, పంచ్‌లకు కేరాఫ్ అడ్రస్‌గా మారిపోయిందీ షో. ఇద్దరు హాట్ యాంకర్లు, ఇద్దరు జడ్జిలు, బోలెడంత మంది ఆర్టిస్టులు కలిసి ప్రతి గురు, శుక్రవారాల్లో నవ్వుల పండుగను తీసుకొస్తారు. మల్లెమాల ప్రొడక్షన్స్ సమర్పణలో వస్తున్న జబర్దస్త్‌పై.. ఇప్పుడు వైసీపీ ఎఫెక్ట్ పడుతోందా? కామెడీ ట్రాక్‌కే కాదు.. రాజకీయ ట్రాక్‌కు కూడా ఈ షో వేదికగా నిలిచిందా? అంటే అవుననే సంకేతాలు వినిపిస్తున్నాయి. గతంలో మెగా బ్రదర్ నాగబాబు, రోజా కలిసి జడ్జిలుగా వ్యవహరించేవారు. జబర్దస్త్, ఎక్స్‌ట్రా జబర్దస్త్.. రెండింటికీ వారిద్దరే జడ్జిలు. అయితే.. అదిరింది షోకు నాగబాబు వెళ్లిపోయాక రోజా ఒంటరయ్యారు. కొన్ని షోలకు ఆమె ఒంటరిగానే జడ్జిగా వ్యవహరించారు. కొన్నింటికి హీరోలు కార్తికేయ, నిఖిల్, సాయిధరమ్ తేజ్ రోజాతో పాటు జడ్జిలుగా వ్యవహరించారు. వారి సినిమాలు ప్రమోషన్ చేయించుకోవడానికి మాత్రమే వాళ్లు షోకు వచ్చారు.

అయితే, వారి తర్వాత జడ్జిలుగా ఎంట్రీ ఇచ్చిన వారిలో కమెడియన్లు అలీ, పోసాని కృష్ణమురళి ఉన్నారు. రేపు వచ్చే ఎక్స్‌ట్రా జబర్దస్త్ ద్వారా సూపర్ స్టార్ కృష్ణ తనయుడు నరేష్ కూడా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. వీళ్లంతా సినిమా పరిశ్రమకు చెందినవారే. అయితే.. వారందరూ జగన్ నేతృత్వంలోని వైసీపీ పార్టీకి చెందిన వారు కావడం గమనార్హం. ముందుగా రోజా నగరి నియోజవవర్గానికి చెందిన వైసీపీ ఎమ్మెల్యే. వైసీపీ ప్రభుత్వం ఏర్పడ్డాక ఏపీఐఐసీ చైర్ పర్సన్‌గానూ ఆమె నియమితులయ్యారు. అదీకాక.. వైసీపీలో ఆమె కీలక నేత.

దీనిబట్టి వైసీపీ నేతలు జబర్దస్త్‌లోకి ఎంట్రీ ఇస్తున్నారని, జనసేనకు చెందిన నాగబాబు వెళ్లిపోయాక జబర్దస్త్ షో వైసీపీ నేతలతో నిండిపోతోందని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇందతా రోజా చలవేనని, రోజా సిఫారసు చేయడం వల్లే అలీ, పోసాని, నరేష్ జడ్జిలుగా షోకు వస్తున్నారని సినీ వర్గాల్లో, నెట్టింట్లో జోరుగా చర్చ నడుస్తోంది.

First published: January 10, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు