ఆయన కూలోడికి తక్కువ.. ముఠామేస్త్రీకి ఎక్కువ : పృథ్వీ ఘాటు విమర్శలు

Actor Prudhvi Raj comments on Jagan : జగన్ సీఎం అయినంత మాత్రానా వెళ్లి కలవాలా.. సినిమా వాళ్లేమైనా వ్యాపారస్తులా..? అని సెటైర్స్ వేసిన రాజేంద్రప్రసాద్ అనడాన్ని ఎలా చూడాలో అర్థం కావడం లేదన్నారు.

news18-telugu
Updated: August 16, 2019, 8:21 AM IST
ఆయన కూలోడికి తక్కువ.. ముఠామేస్త్రీకి ఎక్కువ : పృథ్వీ ఘాటు విమర్శలు
పృథ్వీ ఫైల్ ఫోటో
  • Share this:
టీడీపీ నేతలపై సినీ నటుడు,ఎస్‌వీబీసీ ఛైర్మన్ పృథ్వీరాజ్ విమర్శలతో విరుచుకుపడ్డారు. ఆ పార్టీ నేత అచ్చెన్నాయుడు కూలోడికి తక్కువ ముఠామేస్త్రీకి ఎక్కువ అని ఘాటుగా విమర్శించారు. అచ్చెన్నాయుడు నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నాడని మండిపడ్డారు.ఇక మరో నేత వర్ల రామయ్య చంద్రబాబు భజన చేస్తున్నారని.. గతంలో పదవి ఇవ్వనందుకు భోరున విలపించిన రోజులు గుర్తు లేవా అని ప్రశ్నించారు. పంద్రాగస్టు సందర్భంగా గురువారం పృథ్వీ మీడియాతో మాట్లాడారు.

జగన్ సీఎం అయితే సినీ పరిశ్రమ ఆయనకు కనీసం శుభాకాంక్షలు తెలపలేదని పృథ్వీ మరోసారి కామెంట్ చేశారు. సినీ పరిశ్రమ అంతా కలిసి సీఎంకు శుభాకాంక్షలు తెలిపితే ప్రపంచమంతా గర్వపడేదన్నారు.జగన్ సీఎం అయినంత మాత్రానా వెళ్లి కలవాలా.. సినిమా వాళ్లేమైనా వ్యాపారస్తులా..? అని సెటైర్స్ వేసిన రాజేంద్రప్రసాద్ అనడాన్ని ఎలా చూడాలో అర్థం కావడం లేదన్నారు. సీఎంను కలిసేవాళ్లు కలుస్తున్నారని.. కలవనివాళ్లకు అది వారి విజ్ఞత అని అన్నారు. ఏదేమైనా జగన్,చంద్రబాబులా ఆడంబరపు మనిషి కాదని.. సాదాసీదాగా ఉంటారని చెప్పుకొచ్చారు. గత ప్రభుత్వం 30 ఏళ్లలో చేయలేని ఎన్నో పనులను జగన్ 30 రోజుల్లో చేశారని చెప్పారు.

First published: August 16, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు