హోమ్ /వార్తలు /సినిమా /

ఎన్టీఆర్ పై వైసీపీ నేత ఆసక్తికర వ్యాఖ్యలు..

ఎన్టీఆర్ పై వైసీపీ నేత ఆసక్తికర వ్యాఖ్యలు..

జూనియర్ ఎన్టీఆర్ (Twitter/Photo)

జూనియర్ ఎన్టీఆర్ (Twitter/Photo)

గత ఎన్నికల్లో చంద్రబాబు నేతృత్వంలోని టీడీపీ ఘోర పరాజయం తర్వాత  తెలుగు దేశం పార్టీకి చెందిన చాలా మంది నేతలు పక్కచూపులు చూస్తున్నారు.ఈ నేపథ్యంలో వైయస్ఆర్పీ నేత ఆసక్తికర వ్యాఖ్యలు చేయడం హాట్ టాపిక్‌గా మారింది.

గత ఎన్నికల్లో చంద్రబాబు నేతృత్వంలోని టీడీపీ ఘోర పరాజయం తర్వాత  తెలుగు దేశం పార్టీకి చెందిన చాలా మంది నేతలు పక్కచూపులు చూస్తున్నారు. ఇప్పటికే టీడీపీకి చెందిన రాజ్యసభ సభ్యులు బీజేపీ కండువా కప్పుకున్న సంగతి తెలిసిందే కదా. మరోవైపు టీడీపీకి చెందిన మిగిలిన నేతుల వైసీపీ, బీజేపీవైపు చూస్తున్నారు. తాజాగా తెలుగు దేశం పార్టీకి చెందిన వల్లభనేని వంశీ..తెలుగు దేశం పార్టీకి రాజీనామా చేయడం ఏపీ రాజకీయాల్లో హీట్ పుట్టించింది. ఈ నేపథ్యంలో టీడీపీ రానున్న రోజుల్లో ఎవరు పగ్గాలు చేపడితే.. పార్టీ తిరిగి కోలుకుంటుదనే దానిపై జోరుగా ఊహాగానాలు ఊపందకున్నాయి.  ప్రస్తుతం తెలుగు దేశం ఉన్న క్లిష్ట పరిస్థితుల్లో జూనియర్ ఎన్టీఆర్ పార్టీ పగ్గాలు చేపడితే బాగుంటుందిని చాలా మంది తెలుగు దేశం అభిమానులతో పాటు రామ్ గోపాల్ వర్మ వంటి దర్శకులు స్పందించిన సంగతి తెలిసిందే కదా. ఈ నేపథ్యంలో వైయస్ఆర్పీ నేత ఏపీ తెలుగు అకాడమీ చైర్మన్ లక్ష్మీ పార్వతి  జూనియర్ ఎన్టీఆర్ పై సంచలన  ఆరోపణలు గుప్పించింది.


ysrcp leader lakshmi parvathi sensational comments about jr ntr here are the details,jr ntr,lakshmi parvathi,balakrishna,lakshmi parvathi comments on jr ntr,lakshmi parvathi ys jagan mohan reddy chandrababu naidu,lakshmi parvathi comments on lokesh,lakshmi parvathi comments on balakrishna,lakshmi parvathi jr ntr balakrishna chandrababu naidu lokesh,jr ntr twitter,jr ntr facebook,jr ntr instagram,lakshmi parvathi facebook,lakshmi parvathi,tollywood,telugu cinema,లోకేష్,లక్ష్మీ పార్వతి,జూనియర్ ఎన్టీఆర్,జూ ఎన్టీఆర్,తారక్,లక్ష్మీ పార్వతి జూ ఎన్టీఆర్,బాలకృష్ణ లక్ష్మీ పార్వతి,లక్ష్మీ పార్వతి తారక్ ఎన్టీఆర్ లోకేష్,చంద్రబాబు నాయుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి లక్ష్మీ పార్వతి
లక్ష్మీపార్వతి, జూనియర్ ఎన్టీఆర్


 రీసెంట్‌గా టీడీపీ గన్నవరం ఎమ్మెల్యే.. వల్లభనేని వంశీ మాట్లాడుతూ.. జూనియర్ ఎన్టీఆర్‌కు నారా లోకేష్ భయపడుతున్నారని.. అందుకే ఆయన్ని పార్టీ దరిదాపుల్లోకి కూడా రానివ్వడం లేదని సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే కదా. ఎన్టీఆర్ పార్టీ పగ్గాలు చేపడితే కానీ తెలుగు దేశం పార్టీ గాడిలో పడదని ఆయన వ్యాఖ్యానించిన

సంగతి తెలిసిందే కదా. దీనిపై ఎన్టీఆర్ సతీమణి ఏపీ తెలుగు అకాడమీ చైర్మన్.. మాట్లాడుతూ.. నారా లోకేష్ కంటే ఎన్టీఆర్ 100 రెట్లు బెటర్ అని కామెంట్స్ చేసింది. అంతేకాదు జూనియర్ ఎన్టీఆర్ దగ్గర ప్రజలను మెప్పించగలిగే నటనతో పాటు మంచి వాక్ చాతుర్యం కూడా ఉందన్నారు. అంతేకాడు సబ్జెక్ట్ మీద అతనికి మంచి కమాండ్ ఉంది. ఇలా లోకేష్ కంటే ఎన్టీఆర్‌లో చాలా క్వాలిటీస్ ఉన్నాయని చెప్పుకొచ్చింది. అంతేకాదు లోకేష్‌ ఏ విషయం పై అవగాహన లేదంది. తనకు  రాసిచ్చిన దాంట్లో ఏమి చదవాలో  కూడా తెలియదని కామెంట్స్ చేసింది లక్ష్మీ పార్వతి. నిజానికి 2009 ఎన్నికల్లో చంద్రబాబు.. అప్పటి చిరంజీవి నేతృత్వంలోని  ప్రజారాజ్యం పార్టీని ధీటుగా ఎదుర్కొవడానికి జూనియర్ ఎన్టీఆర్‌తో ప్రచారం చేయించిన సంగతి తెలిసిందే కదా.కానీ ఆ ఎన్నికల్లో టీడీపీకి అధికారం దక్కని విషయం తెలిసిందే కదా. ఆ  తర్వాత జూనియర్ ఎన్టీఆర్ పూర్తిగా రాజకీయాలను పక్కనపెట్టి.. సినిమాలపైనే తన ఫోకస్ పెట్టాడు. అంతేకాదు గత ఎన్నికల్లో తన అక్క సుహాసిని తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేసినా..కనీసం ప్రచారం కూడా చేయని సంగతి తెలిసిందే కదా.

First published:

Tags: Chandrababu Naidu, Jr ntr, Lakshmi Parvathi, TDP, Telugu Cinema, Tollywood, Ysrcp

ఉత్తమ కథలు