news18-telugu
Updated: January 26, 2020, 4:27 PM IST
ప్రభాస్ (Twitter/Photo)
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్... వైసీపీ కీలక నేతతో భేటి కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. వివరాల్లోకి వెళితే.. బాహుబలి సిరీస్ తర్వాత ప్రభాస్.. సుజిత్ దర్శకత్వంలో ‘సాహో’ సినిమా చేసాడు. ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర సరైన ఫలితాన్ని అందుకోలేకపోయినా.. మొత్తంగా రూ. 400 కోట్ల కొల్లగొట్టి హీరోగా ప్రభాస్ స్టామినా ఏంటో చెప్పింది. ప్రస్తుతం ప్రభాస్.. రాధాకృష్ణ దర్శకత్వంలో పీరియాడికల్ బ్యాక్ డ్రాప్ మూవీ చేస్తున్నాడు. రీసెంట్గా ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైంది. ఈ సినిమాలో ప్రభాస్ సరసన పూజా హెగ్డే యాక్ట్ చేస్తోంది. మరోవైపు ఈ సినిమాలో రెబల్ స్టార్ కృష్ణంరాజు ముఖ్యపాత్రలో నటిస్తున్నాడు. మరోవైపు ప్రభాస్ తల్లి పాత్రలో ఒకప్పటి బాలీవుడ్ హీరోయిన్ భాగ్యశ్రీ యాక్ట్ చేయబోతున్నట్టు సమాచారం. తాజాగా ఈ షూటింగ్లో కృష్ణంరాజు,ప్రభాస్ లపై కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరించారు. తాజాగా ఈ షూటింగ్ స్పాట్‌కు వైసీపీకి చెందిన నర్సాపురం లోక్‌సభ సభ్యుడు రఘురామ కృష్ణంరాజు వచ్చి కృష్ణంరాజు, ప్రభాస్‌లను పలకరించాడు.

కృష్ణంరాజు, ప్రభాస్‌లతో వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు (Twitter/Photo)
అంతేకాదు ఈ సినిమాకు సంబంధించిన విషయాలను అడిగి తెలుసుకున్నాడు. అంతేకాదు రఘురామ కృష్ణంరాజు..అక్కడే ఉన్న కృష్ణంరాజుతో పాటు ప్రభాస్‌తో ఏపీలో జరుగుతున్న రాజకీయ పరిణామాలపై చర్చించినట్టు తెలుస్తోంది. మరోవైపు రఘురామ కృష్ణంరాజు.. కృష్ణంరాజుది ఒకటే సామాజిక వర్గంతో పాటు.. ఒక జిల్లావారు కావడం.. ఈ నేపథ్యంలోనే ప్రభాస్,కృష్ణంరాజులో భేటి అయ్యాడా ? లేకపోెతే.. గత కొంత కాలంగా రఘురామ కృష్ణంరాజు బీజేపీ పెద్దలతో చాలా క్లోజ్‌గా మూవ్ అవుతున్నాడు. ఈ క్రమంలోనే బీజేపీకి చెందిన కృష్ణంరాజుతో రఘురామ కృష్ణంరాజు భేటి కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.
Published by:
Kiran Kumar Thanjavur
First published:
January 26, 2020, 4:27 PM IST