వేలం పాటలో రికార్డు సృష్టించిన ‘యాత్ర’ ఫస్ట్ టిక్కెట్..

దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి జీవిత కథ ఆధారంగా ‘యాత్ర’ సినిమా తెరకెక్కుతోంది. ‘ఆనందో బ్రహ్మ’ ఫేమ్ మహి.వి.రాఘవ్ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రంలో వైయస్ఆర్ పాత్రలో మలయాళ మెగా స్టార్ మమ్ముట్టి నటించారు. మమ్ముట్టి ఈ క్యారెక్టర్ చేయడంతో ‘యాత్ర’ మూవీపై ట్రేడ్ వర్గాల్లో క్రేజ్ పెరిగింది. తాజాగా అమెరికాలో ‘యాత్ర’ సినిమాకు సంబంధించిన ఫస్ట్ టికెట్ రికార్డు రేటులో అమ్ముడుపోయింది. 

Kiran Kumar Thanjavur | news18-telugu
Updated: February 4, 2019, 2:13 PM IST
వేలం పాటలో రికార్డు సృష్టించిన ‘యాత్ర’ ఫస్ట్ టిక్కెట్..
‘యాత్ర’ సినిమా
  • Share this:
దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి జీవిత కథ ఆధారంగా ‘యాత్ర’ సినిమా తెరకెక్కుతోంది. ‘ఆనందో బ్రహ్మ’ ఫేమ్ మహి.వి.రాఘవ్ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రంలో వైయస్ఆర్ పాత్రలో మలయాళ మెగా స్టార్ మమ్ముట్టి నటించారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమాలో ఇతర ముఖ్యపాత్రల్లో నటిస్తున్న నటీనటుల లుక్స్‌తో పాటు ఈ సినిమా టీజర్‌కు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా మహానేత   వైయస్ పాత్రలో మమ్ముట్టి అతినట్టు సరిపోయారు. మమ్ముట్టి ఈ క్యారెక్టర్ చేయడంతో ‘యాత్ర’ మూవీపై ట్రేడ్ వర్గాల్లో క్రేజ్ పెరిగింది. తాజాగా అమెరికాలో ‘యాత్ర’ సినిమాకు సంబంధించిన ఫస్ట్ టికెట్ రికార్డు రేటులో అమ్ముడుపోయింది.

ఈ సినిమాను ఒకేసారి తెలుగుతో పాటు తమిళ్, మలయాళంలో రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటికే ఈసినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జోరు మీదున్నాయి. ఈ  సినిమాను ఫిబ్రవరి 8న రిలీజ్ చేయనున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలు జోరుమీదున్నాయి. ఈ సినిమా కోసం మమ్ముట్టి తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పుకున్నారు. ఇక తెలుగులో మమ్ముట్టి డైరెక్ట్‌గా నటిస్తోన్న నాల్గో సినిమా ఇది. ‘స్వాతి కిరణం’, ‘సూర్య పుత్రులు’, ‘రైల్వే కూలి’ సినిమాల తర్వాత మమ్ముట్టి తెలుగులో స్ట్రెయిట్‌గా నాల్గో సినిమా. ఈ అన్ని సినిమాల్లో తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పుకోవడం విశేషం.

మరోవైపు ఈ సినిమాకు సంబంధించిన  ఒక వార్త ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. అమెరికాలో  విడుదల కాబోతున్న ఈ సినిమా మొదటి షో టికెట్‌ను ‘యాత్ర’ సినిమా యూనిట్ వేలం వేశారు. ఈ వేలంలో మునీశ్వర్ రెడ్డి అనే  ఎన్నారై  ఈ సినిమా టికెట్‌ను 6,116 డాలర్లకు సొంతం చేసుకున్నాడు.  కరెన్సీలో అక్షరాల రూ.4.37 లక్షలు. అమెరికాలోని సియాటెల్‌ల ోఈ వేలం నిర్వహించారు. మొత్తానికి రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా కావడానికి దారి తీసిన పరిస్థితులపై తెరకెక్కిన ‘యాత్ర’ సినిమాకు ఈ రేంజ్‌లో టికెట్ రేటు పలకడం ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యానికి గురి చేస్తోంది.

కాజల్ అగర్వాల్ హాట్ ఫోటోస్


ఇవి కూడా చదవండి

రాజశేఖర్ ‘కల్కి’ టీజర్ మాములుగా లేదుగా..తెలుగు ఇండ‌స్ట్రీకి మ‌రో వార‌సుడు.. ఈ సారి దిల్ రాజు కుటుంబం నుంచి..

శరత్ బాబు ఆసక్తికర కామెంట్స్.. రమాప్రభకు రాసిచ్చిన కోట్లు ఎన్ని?

 
First published: February 4, 2019, 1:59 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading