హోమ్ /వార్తలు /సినిమా /

Dhee Judge Poorna: పూర్ణ బ్యాడ్ డోర్ సాంగ్‌ను ఆవిష్కరించనున్న షర్మిల

Dhee Judge Poorna: పూర్ణ బ్యాడ్ డోర్ సాంగ్‌ను ఆవిష్కరించనున్న షర్మిల

Instagram

Instagram

Dhee Judge Poorna: బ్యాక్ డోర్ సినిమాలోని యుగాల భారత స్త్రీని అనే పల్లవితో సాగే పాటను రేపు వైఎస్ఆర్ కూతురు వైఎస్ షర్మిల ఆవిష్కరించబోతున్నారు.

అవును సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన పూర్ణ కెరీర్ ఆ తరువాత కాస్త నెమ్మదించినా.. ఇప్పుడు మళ్లీ పలు వరుస సినిమాలతో ఆమె బిజీగా మారింది. అనూహ్యంగా బాలకృష్ణ, బోయపాటి కాంబినేషన్‌లోని మూవీలో అవకాశం దక్కించుకున్న పూర్ణ.. బ్యాక్ డోర్ అనే మరో మూవీలోనూ నటిస్తోంది. కర్రి బాలాజీ డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమాను శ్రీనివాసరెడ్డి నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే పలు పాటలను పూరి జగన్నాధ్ వంటి పలువురు ఆవిష్కరించారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన మరో పాటను రిలీజ్ చేయబోతున్నారు. ఈ సినిమాలోని యుగాల భారత స్త్రీని అనే పల్లవితో సాగే పాటను రేపు వైఎస్ఆర్ కూతురు వైఎస్ షర్మిల ఆవిష్కరించబోతున్నారు.

రేపు సాయంత్రం 6 గంటలకు షర్మిల ఆ పాటను రిలీజ్ చేయనున్నారు. త్వరలోనే తెలంగాణలో రాజకీయ పార్టీని ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్న వైఎస్ షర్మిల.. ఇందుకు సంబంధించి రాష్ట్రంలోని పలు వర్గాలు, జిల్లాల ప్రజలతో సమావేశమవుతున్నారు. ఈ క్రమంలోనే రేపు బ్యాక్ డోర్ సినిమా పాటను షర్మిల ఆవిష్కరించనున్నారు. మహిళల్లో స్పూర్తి నింపే పాట కావడంతోనే ఆమె ఈ పాటను ఆవిష్కరించేందుకు అంగీకరించినట్టు తెలుస్తోంది.


ప్రస్తుతం పూర్ణ ప్ర‌స్తుతం తెలుగులో బాల‌కృష్ణ- బోయ‌పాటి మూవీలో ఒక కీల‌క పాత్ర‌లో న‌టిస్తోంది. అలాగే సుంద‌రి, బ్యాక్ డోర్, తెలుగులో నాకు న‌చ్చ‌ని ప‌దం ప్రేమ‌లో న‌టిస్తోంది. ఇక జ‌య‌ల‌లిత జీవిత క‌థ ఆధారంగా త‌మిళ చిత్రం త‌లైవిలో వీకే శ‌శిక‌ళ పాత్ర‌లో న‌టించారు. వెంకటేశ్ దృశ్యం-2లో కూడా ఆమె కీలక పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం. గత ఏడాది పూర్ల కన్నమూచి అనే వెబ్ సిరీస్ లో కూడా నటించింది.

First published:

Tags: Poorna (Shamna Kasim), YS Sharmila

ఉత్తమ కథలు