BIgg Boss 5 Telugu Shanmukh Jaswanth: స్టార్ మా లో ప్రసారమవుతున్న రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 5 మొత్తానికి ఓ రేంజ్ లో దూసుకుపోతుంది. నాలుగు సీజన్ లు పూర్తికాగా ఈ సీజన్ మరింత హైలెట్ గా కనిపిస్తుంది. ఈసారి ఇందులో మొత్తం 19 మంది కంటెస్టెంట్ లు పాల్గొని తమ పరిచయాలు కూడా పెంచుకున్నారు. షో ప్రారంభమై వారం రోజులు కూడా దాటలేదు అప్పుడే గొడవలు కూడా జరుగుతున్నాయి. ఇదిలా ఉంటే తాజాగా మరో కంటెస్టెంట్ షణ్ముఖ్ పబ్లిక్ గా దీప్తి పేరు చెప్పేసాడు.
యూట్యూబ్ స్టార్ గా నిలిచిన షణ్ముఖ్ జశ్వంత్ మొత్తానికి బిగ్ బాస్ లో అడుగు పెట్టాడు. మొదటి మూడు రోజులు సైలెంట్ గా కనిపించగా ఆ తర్వాత ఏదో అన్నట్లుగా మాట్లాడుతున్నాడు. ఇదిలా ఉంటే తాజాగా ఈ వారం చివరి రెండు రోజుల్లో నాగార్జున వచ్చి సందడి చేసి ఎలిమినేట్ అయినా కంటెస్టెంట్ ను ఇంట్లో నుంచి బయటకు పంపిస్తారు. దీంతో శనివారం రోజు జరిగిన ఎపిసోడ్ లో నాగార్జున ఎంట్రీ ఇచ్చి కంటెస్టెంట్ లతో కాసేపు ముచ్చటించాడు.
ఇది కూడా చదవండి:డైరెక్ట్‌గా షోలోనే అక్కడికి వెళ్దాం అని అడిగేసిన సరయు.. నాగార్జున కూడా?
ఇక ఎలిమినేషన్ రౌండ్ లో ఉన్న వారిలో కొందరి సేఫ్ జోన్ లోకి పంపించాడు. వారం రోజులు మొత్తం జరిగిన విషయాల గురించి ప్రతి ఒక్క కంటెస్టెంట్ తో మాట్లాడాడు. అందులో ఎవరు ఇష్టం ఎవరి ఇష్టం కాదో అని తోటి కంటెస్టెంట్ ల గురించి ఓపెన్ కామెంట్స్ చేస్తున్న సమయంలో ఓ కంటెస్టెంట్ షణ్ముఖ్ గురించి కొన్ని కామెంట్స్ చేసింది. తను తన దిండు పై రెండు లెటర్స్ రాసుకొని వాటిని లేవగానే చూస్తూ ఉండటంలో యాక్టివ్ గా కనిపిస్తాడు అని కామెంట్ చేసింది. మళ్లీ అవి చెడిపేశాడు అంటూ తెలుపగా.. నాగార్జున ఎవరు అని అడిగేసరికి తన గర్ల్ ఫ్రెండ్ పేరు సార్ అని లీక్ చేశారు.
నాగార్జున వెంటనే ఇంతకీ ఆ పేరు ఎవరు అని ప్రశ్నించగా వెంటనే షణ్ముఖ్.. దీప్తి సార్ అంటూ తన మనసులో మాటను బయట పెట్టేసాడు. ఇంకేముంది తన గర్ల్ ఫ్రెండ్ దీప్తి సునయననే అంటూ ఫిక్స్ అయ్యారు. గతంలో వీరి మధ్య లవ్ నడుస్తుందా అని ఎన్నో ప్రశ్నలు ఎదురవగా.. ఏదో ఒక పొంతనలేని సమాధానం చెబుతూ తప్పించుకునే వారు. మొత్తానికి ఈ బిగ్ బాస్ షో వల్ల దీప్తి సునయనను లవ్ చేస్తున్నట్లు కన్ఫామ్ చేశాడు షణ్ముఖ్. గతంలో దీప్తి సునైనా కూడా బిగ్ బాస్ హౌస్ లో పాల్గొని షణ్ముఖ్ గురించి కొన్ని ఓపెన్ కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Akkineni nagarjuna, Bigg boss 5 telugy, Deepthi Sunaina, Shanmukh jaswanth