Home /News /movies /

YOUTUBER SHANMUKH JASWANTH FANS FIRES ON SARAYU AND TROLLING ON HER IN SOCIAL MEDIA NR

Bigg Boss 5 Telugu Sarayu: షణ్ముఖ్ జశ్వంత్ వరస్ట్ అన్న సరయు.. ట్రోల్ చేస్తున్న ఫ్యాన్స్!

Bigg Boss 5 Telugu Sarayu

Bigg Boss 5 Telugu Sarayu

Bigg Boss 5 Telugu Sarayu: బుల్లితెరపై బిగ్ బాస్ సీజన్ 5 సందడి మొదలైంది. ఈ సీజన్ లో మొత్తం 19 మంది కంటెస్టెంట్ లు పాల్గొనగా నిన్నటితో ఈ షో ప్రారంభమై వారం రోజులు పూర్తయింది. ఇక ఇందులో ఎలిమినేషన్ రౌండ్ లో మొత్తం ఆరుగురు ఎలిమినేట్ లీస్ట్ లో ఉండగా అందులో నుండి బోల్డ్ బ్యూటీ సరయు బిగ్ బాస్ హౌస్ నుండి ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే.

ఇంకా చదవండి ...
    Bigg Boss 5 Telugu Sarayu: బుల్లితెరపై బిగ్ బాస్ సీజన్ 5 సందడి మొదలైంది. ఈ సీజన్ లో మొత్తం 19 మంది కంటెస్టెంట్ లు పాల్గొనగా నిన్నటితో ఈ షో ప్రారంభమై వారం రోజులు పూర్తయింది. ఇక ఇందులో ఎలిమినేషన్ రౌండ్ లో మొత్తం ఆరుగురు ఎలిమినేట్ లీస్ట్ లో ఉండగా అందులో నుండి బోల్డ్ బ్యూటీ సరయు బిగ్ బాస్ హౌస్ నుండి ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే. ఇక నిన్నటి ఎపిసోడ్ లో సరయు ఓ రేంజ్ లో ఫైర్ అయినట్లు కనిపించింది. ఇక షణ్ముఖ్ జశ్వంత్ పై ఓపెన్ కామెంట్స్ చేసింది.

    యూట్యూబ్ లో సెవెన్ ఆర్ట్స్ అనే వేదికగా బూతు మాటలతో వీడియోలు చేస్తూ బాగా హాట్ టాపిక్ గా నిలిచింది సరయు. ఈమె వీడియోలను చూసిన నెటిజన్లు ఓ రేంజ్ లో విమర్శలు చేస్తుంటారు. నెగెటివ్ కామెంట్స్ పెడుతుంటారు. అయినా కూడా ఈ బోల్డ్ బ్యూటీ వాటిని పట్టించుకోకుండా మరింత బూతులతో రెచ్చిపోతుంది. మొత్తానికి ఈ బోల్డ్ బ్యూటీకి బిగ్ బాస్ లో అవకాశం రాగా అందులో తనేంటో నిరూపించుకోకపోగా మొదటి వారానికే ఇంటి పట్టు పట్టాల్సి వచ్చింది.

    ఇది కూడా చదవండి: నీకు వంట చెయ్యడం రాదా.. ఆర్జే కాజల్‌కు చుక్కలు చూపించిన నాగార్జున.. దొరికిపోయా అంటూ?

    ఇలా ఉంటే నిన్నటి ఎపిసోడ్ లో మొత్తానికి ఎలిమినేట్ అయిన సరయు హౌస్ లో ఉన్న ప్రతి ఒక్క కంటెస్టెంట్ పై ఫైర్ అయ్యింది. ఎవరు బెస్ట్, ఎవరు వరెస్ట్ అనే కాన్సెప్ట్ లో ప్రతి ఒక్కరి గురించి ఓపెన్ కామెంట్స్ చేసింది. ఇక వరెస్ట్ ప్లేస్ లో షణ్ముఖ్ ను పెట్టి అతడి గురించి కొన్ని కామెంట్స్ చేసింది. నిజానికి తను హౌస్ లో ఉన్నంత కాలం షన్ను తో కూడా అంతగా మూవ్ అయినట్లు కనిపించలేదు. ఇక నిన్న మాత్రం షణ్ముఖ్ పై బాగానే ఫైర్ అయినట్లు అనిపించింది.

    ఇది కూడా చదవండి:నాగార్జున ప్రశ్న.. పబ్లిక్‌గా గర్ల్ ఫ్రెండ్ గురించి చెప్పేసిన షన్ను.. దీప్తినే అంటూ?

    అరేయ్ ఏంట్రా ఇది.. బయటే అనుకొని ఇలా రావొద్దురా.. ముందు ఆమెను లేపి.. అని అనడంతో వెంటనే సిరి సరయు కి గట్టిగా సమాధానమిచ్చింది. ఇక సరయు మాట్లాడుతున్న మాటలకు షణ్ముఖ్ సమాధానం చెప్పడానికి ప్రయత్నించిన కూడా సరయు గట్టిగా క్లాస్ తీసుకున్నట్లే అనిపించింది. ఇక వరస్ట్ ప్లేస్ పెట్టడంతో షణ్ముఖ్ ఏమి అనలేకపోయాడు. ఇక ఈ ఎపిసోడ్ ను చూసిన ప్రేక్షకులు, షణ్ముఖ్ ఫ్యాన్స్ సరయు పై తెగ ట్రోల్స్ చేస్తున్నారు. షణ్ముఖ్ ను వరస్ట్ అనే ముందు నువ్వు ఎలాంటి వీడియోలు చేస్తావ్.. నువ్వు మాట్లాడే మాటలు ఏంటి అంటూ సరయు పై బాగానే ఆడుకున్నారు షన్ను అభిమానులు.
    Published by:Navya Reddy
    First published:

    Tags: Bigg Boss 5 Telugu, Sarayu, Shanmukh jaswanth, Shanmukh trolls, Tollywood

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు