Chandu Sai: చిరంజీవి తోపు.. అలాగని నాగార్జున గారు, బాలయ్య తోపు కాదంటారా?: చందు సాయ్

pakkinti kurradu chandu sai

Chandu Sai: తమడా మీడియాలో చందు సాయి పక్కింటి కుర్రాడుగా ఎంతో మంచి గుర్తింపును సంపాదించుకున్నడు. అయితే ఇటీవలే చందు సాయి తమడా మీడియా నుంచి బయటకు వచ్చారు.

  • Share this:
    Chandu Sai: తమడా మీడియాలో చందు సాయి పక్కింటి కుర్రాడుగా ఎంతో మంచి గుర్తింపును సంపాదించుకున్నడు. అయితే ఇటీవలే చందు సాయి తమడా మీడియా నుంచి బయటకు వచ్చారు. ఇదివరకు పక్కింటి కుర్రాడుగా ఎన్నో అద్భుతమైన వీడియోలను చేసి ఎంతో మందిని ఆకట్టుకున్న చందు సాయి ఇకపై తమడా మీడియాకు గుడ్ బై చెబుతూ.. తన కొత్త జర్నీ ప్రారంభించబోతున్నారు. తమడా మీడియా నుంచి బయటకు వచ్చిన చందు సాయి ఇన్ఫినిటమ్ మీడియాతో కలిసి పని చేయనున్నాడు.

    అయితే గతంలో బంచిక్ బబ్లు అనే యూట్యూబర్ కూడా తమడా మీడియాలో పని చేసి ఆతర్వాత ఇన్ఫినిటమ్ మీడియాలో అడుగుపెట్టాడు. ఇక ఇప్పుడు పక్కింటి కుర్రాడు కూడా అలానే ఇన్ఫినిటమ్ మీడియాలో చేరాడు. ఇంకా అతని కంటెంట్ ను తమడా మీడియా ప్రమోట్ చెయ్యడానికి కారం తన కంటెంట్ బాగుంది కాబట్టే అని కంటెంట్ లేకపోతే తన వీడియోలు ఎవరు చూసేవారు కాదంటూ చెప్పుకొచ్చాడు సాయి చంద్.

    తన కొత్త సంస్థ గురించి మాట్లాడిన సాయి చంద్ ఇన్ఫినిటమ్ మీడియా వాళ్లు ప్రతి విషయాన్ని బిజినెస్‌గా చూడరు అని చెప్పుకొచ్చాడు. ఒక్క మాటలో చెప్పాలంటే యూట్యూబ్ లో మంచి క్రేజ్ సంపాదించుకున్న షణ్ముఖ్ జశ్వంత్ కూడా ఇదే ఇన్ఫినిటీ సంస్థలో పని చేస్తున్నాడు కాబట్టి అతనితో పరిచయం ఏర్పడినట్టు చెప్పుకొచ్చాడు. అయితే యూట్యూబ్ లో షణ్ముక్ నీ మించిన వారే లేరంటే ఎలా? ఎవరికి ఉండేది వాళ్లకు ఉంటుంది. ఎవరి స్కిల్స్ వాళ్లకు ఉంటాయి అని చెప్పిన సాయి చంద్ ఉదాహరణకు చిరంజీవి తోపు.. అలాగని నాగార్జున గారు తోపు కాదంటారా? బాలయ్య తోపు కాదా? ఎవరి స్కిల్స్ వారికి ఉంటాయి. ఎవరి స్టైల్ వారికి ఉంటుంది. అందరూ పోటీ పడితేనే ఒక్కోసారి ఒక్కొక్కరికి విజయం వరిస్తుంది. అంతే కానీ ఒకరే తోపు అంటే ఎలా.. టైం వచ్చినప్పుడు వారు టాప్ లో ఉంటారు అంతేకానీ ఒకరే తోపు అనడం ఏమాత్రం కరెక్ట్ కాదని చందు సాయి చేప్పుకొచ్చాడు. మరి చందు సాయి కొత్త జర్నీ ఎలా ఉంటుంది అనేది చూడాలి.
    Published by:Navya Reddy
    First published: