Bigg Boss 5 Telugu - Siri Hanumanth: ప్రస్తుతం బుల్లితెరపై బిగ్ బాస్ సీజన్ 5 ప్రసారమై మూడు వారాలు అవుతుంది. ఇక మొదటి రోజు నుంచే ఈ సీజన్ మొత్తం బాగా హైలెట్ గా మారింది. అంతేకాకుండా రేటింగ్ కూడా ఓ రేంజ్ లో దూసుకుపోతుంది. మొత్తం 19 మంది కంటెస్టెంట్ లు ఎంట్రీ ఇవ్వగా అందులో ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే. ఈసారి కంటెస్టెంట్ లందరూ బాగా యాక్టివ్ గా ఉండటమే కాకుండా గట్టి పోటీగా ఉన్నారు. ఇదిలా ఉంటే తన మొదటి ప్రియుడు గురించి కన్నీళ్లు పెట్టుకుంది సిరి హనుమంత్.
ఇందులో ఎలిమినేషన్ రౌండ్ లో ఎంత ఫైర్ గా ఉంటారో మామూలు సమయాలలో మాత్రం బాగా కూల్ గా కనిపిస్తారు. అప్పుడప్పుడు కొందరు ఎమోషనల్ కూడా అవుతున్నారు. ఇక బిగ్ బాస్ ఇంట్లో నిన్నటి ఎపిసోడ్ లో అందరూ చాలా వరకు ఎమోషనల్ అయ్యారు. బిగ్ బాస్ కంటెస్టెంట్ లందరికీ తమ తొలి ప్రేమ జ్ఞాపకాలు పంచుకోమని తెలిపాడు. దాంతో ప్రతి ఒక్క కంటెస్టెంట్ తమ మొదటి ప్రేమల గురించి పంచుకొని కాస్త కంటతడి కూడా పెట్టారు.
ఇక మరో కంటెస్టెంట్ సిరి హనుమంత్ కూడా తన ఫస్ట్ లవ్ గురించి చెబుతూ బాగా ఏడ్చింది. అంతేకాకుండా ఈమె లవ్ గురించి విన్న వాళ్లంతా అయ్యో పాపం అని అనుకున్నారు. ఇక ఆమె చెప్పిన విషయాలు ఏంటంటే.. అతడి పేరు విష్ణు అని కాని తను ముద్దుగా చిన్నూ అని పిలుచుకునేదట. తను ఆ సమయంలో పదో తరగతి చదువుతున్నాను అన్ని తమ ఇల్లు ఎదురెదురుగా ఉంటాయని ఓసారి అతడు వచ్చి తనకు ప్రపోజ్ చేశాడని తెలిపింది. వెంటనే తను కూడా ఓకే అని చెప్పిందట.
అతను మాత్రం చాలా పొసెసివ్ అని.. తాను కాలేజ్ ఫ్రెండ్స్ తో మాట్లాడిన కూడా తట్టుకోలేడు అని తెలిపింది. ఓ సారి తమకు గొడవ అయిందని.. అదే సమయంలో తనకు పెళ్లి సంబంధం వస్తే ఓకే అని కూడా చెప్పానని తెలిపింది. ఇక తనకు మరుసటి రోజు ఎంగేజ్మెంట్ అని తెలియగా అతడు వచ్చి తన కాళ్లు పట్టుకొని నువ్వు కావాలి నువ్వు లేకుండా నేను ఉండలేను అంటూ బాగా ఏడ్చాడట. ఇక తనకు కూడా అతడు ఇష్టం ఉండేసరికి ఎంగేజ్మెంట్ ఉన్నా కూడా అతడితో ఇంట్లోనుంచి పారిపోయిందట.
కానీ ఆ సమయంలో తన తల్లి తనతో మాట్లాడి ఇంటికి తీసుకు వచ్చిందట. అలా కొన్ని రోజుల వరకు వారి మధ్య మంచి రిలేషన్ ఉందని.. ఓ రోజు ఉదయం 3 గంటలకు మెలకువ వచ్చిందని మళ్లీ పడుకొని ఎనిమిది గంటలకు లేచాక తను చనిపోయాడని తెలిసిందట. అంతేకాకుండా తనకు ఏ సమయానికి మేలుకు వచ్చిందో ఆ సమయానికే తనకు యాక్సిడెంట్ అయిందని బాగా ఏడ్చింది. అతడి కోసం ఎంతో చేశాను అంటూ అని దేవుడు తనకి ఇవ్వలేదని బాగా ఎమోషనల్ అయ్యింది. ఇక అందరూ వచ్చి తనను ఓదార్చే ప్రయత్నం చేశారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bigg Boss 5 Telugu, Hey siri, Siri hanumanth, Star Maa