Shanmukh Jaswanth: ప్రస్తుతం షణ్ముఖ్ జశ్వంత్ అనే పేరు టాలీవుడ్ హీరోల కంటే ఎక్కువగా వినిపిస్తుంది. సోషల్ మీడియా ద్వారా పరిచయమైన షణ్ముఖ్ జశ్వంత్ మొత్తానికి ఓ సెలబ్రేటి హోదాను అందుకున్నాడు. యూట్యూబ్ లో ఎన్నో షార్ట్ ఫిలిమ్స్, వెబ్ సిరీస్ లలో నటించి మంచి పేరు సంపాదించుకొని యూట్యూబ్ స్టార్ గా నిలిచాడు. అంతేకాకుండా సోషల్ మీడియాలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా సంపాదించుకున్నాడు. ఇదిలా ఉంటే బిగ్ బాస్ లోకి షణ్ముఖ్ ఎంట్రీ డౌట్ గానే అనిపిస్తుంది.
గత కొన్ని రోజుల నుండి బుల్లితెరలో బిగ్ బాస్ సీజన్ 5 గురించి తెగ వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. అంతేకాకుండా త్వరలోనే ఈ షో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఇందులో పాల్గొనే కంటెస్టెంట్ ల పేర్లు బాగా ప్రచారం అవుతున్నాయి. అందులో ముఖ్యంగా యూట్యూబ్ స్టార్ షణ్ముఖ్ జస్వంత్ ఆ కంటెస్టెంట్ లిస్టు లో ఉన్నాడని అందరూ అనుకున్నారు. అంతేకాకుండా ఇతనికి బిగ్ బాస్ యాజమాన్యం కోటి రూపాయల పారితోషకం ఇవ్వనున్నట్లు తెగ వార్తలు కూడా వినిపించాయి.
కానీ తాజాగా షణ్ముఖ్ కు రెమ్యూనరేషన్ విషయంలో అంత అవకాశం లేదని తెలుస్తుంది. యూట్యూబ్ లో సరికొత్త వెబ్ సిరీస్ తీసి అభిమానులను ఆకట్టుకోగా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఇతడికి స్టార్ మా అవకాశం ఇవ్వలేదని వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఆయనకు కోటి రూపాయలు ఇవ్వడానికి కూడా బిగ్ బాస్ యాజమాన్యం సిద్ధంగా లేదట. అందుకు అతడికి అవకాశం ఇవ్వలేదని తెలుస్తుంది.
మంచి స్టార్ హోదా లో ఉన్నందుకు షణ్ముఖ్ కు ఇదే మైనస్ పాయింట్ అయిందని తెలుస్తుంది. దీంతో ఈ విషయం ప్రస్తుతం అందరి దృష్టిలో పడగా తన అభిమానులు ఇంత బెట్టు చేస్తే ఎలా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఇదంతా పక్కన పెడితే వెండితెరపై కూడా హీరోగా అడుగు పెట్టనున్నట్లు గతంలో టాక్ వినిపించింది. కానీ ఈ విషయం గురించి అధికారిక ప్రకటన మాత్రం రాలేదు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bigg boss season 5, Deepthi Sunaina, Shanmukh jaswanth, Star Maa, Youtube star, Youtuber