news18-telugu
Updated: November 27, 2020, 9:50 PM IST
మహాతల్లి జాహ్నవి (Instagram/Photo)
Mahathalli | జాహ్నవి దాసెట్టి.. పాపులర్ తెలుగు యూట్యూబ్ స్టార్.. మహాతల్లి పేరుతో ఈమెకు యూట్యూబ్‌లో ఓ ఛానల్ ఉంది. అక్కడ జాహ్నవి ఛానల్‌కు పది లక్షల మంది సబ్‌స్కైబర్స్ ఉన్నారు. ఈమె చేసే వీడియోలకు మంచి వ్యూసే దక్కుతున్నాయి. తాజాగా ఈమెకు గత కొన్ని రోజులుగా దగ్గు, జలుబుతో బాధ పడుతోంది. దీంతో ఎందుకైనా మంచిదని డాక్టర్లను సంప్రదించింది. వారి సలహాతో కరోనా పరీక్షలు చేయించుంది. ఈ టెస్టుల్లో ఆమెకు కరోనా నెగిటివ్ అని తేలింది. దీంతో మహాతల్లితో పాటు ఆమె కుటుంబ సభ్యులు ఊపరి పీల్చుకున్నారు. అయితే.. డాక్టర్లు మాత్రం ఆమెకు రెగ్యులర్‌గా వచ్చే జలుబు మాత్రమే అని చెప్పారు. అలా అని అశ్రద్ధగా ఉండకుండా.. పలు జాగ్రత్తలు తీసుకోవాలని సలహా ఇచ్చారట. జాహ్నవి ప్రతి మిడ్ వీకెండ్ అంటే.. ఎవ్రీ బుధవారం ఓ వీడియోను తన యూట్యూబ్ ఛానల్లో పెడుతుంది. ఈ వీడియోలో మన రోజువారీ జీవితాలకు సంబంధించిన చిత్ర విచిత్రమైన పరిస్థితులను చర్చిస్తుంది.
జాహ్నవి దాసెట్టి మొదట షార్ట్ ఫిల్మ్స్ లోనటించి.. బడా స్టార్‌గా అవతరించింది. జాహ్నవి కర్నూలుకు చెందినది. అక్కడే ఆమె సెయింట్ జోసెఫ్, కర్నూలులో ఆమె స్కూల్ విద్యను అభ్యసించింది. ఆ తర్వాత ఆమె భోపాల్ నిఫ్ట్‌లో చేరి పట్టభద్రురాలైంది. ఇక ఆ తర్వాత 2013 లో ముంబైలో ఫ్యాషన్ మర్చండైజర్గా ఉద్యోగం చేయడం ప్రారంభించింది. ఆ తర్వాత ఆమె జాబ్‌ను వదిలేసి నటనపై ఆమె ఆసక్తితో యూట్యూబ్ ఛానల్‌ను ప్రారంభించింది.
జాహ్నవి మహత్తల్లి అనే ఛానల్‌ను 11 మార్చి 2016 న ప్రారంభించింది. ప్రస్తుతం ఆమె ఛానెల్‌కు 1.78 మిలియన్ పైగా సబ్‌స్కైబర్స్ ఉన్నారు. ఆమె వ్యక్తిగత జీవితానికి వస్తే.. జాహ్నవి 7 సెప్టెంబర్ 1991 లో జన్మించింది. ఆమె తండ్రి న్యాయవాది, తల్లి ప్రిన్సిపాల్. జాహ్నవి తన ప్రియుడు జూలై 1, 2018 న సుశాంత్ రెడ్డిని వివాహం చేసుకుంది. హలీమ్ ఆమెకు ఇష్టమైన ఆహారం. మొత్తంగా మహాతల్లికి కరోనా నెగిటివ్ అని తేలడంతో ఆమె అభిమానులు ఊపరి పీల్చుకుంటున్నారు.
Published by:
Kiran Kumar Thanjavur
First published:
November 27, 2020, 9:50 PM IST