హీరోయిన్‌ గదిలోకి హఠాత్తుగా ఊడిపడ్డ అభిమాని.. ఆ తర్వాత..

ఇదేంటని మౌనీ రాయ్ అతన్ని నిలదీయగా.. చేతిలో ఉన్న బొకేను కింద పడేసి మీద మీదకు వెళ్లాడు. మధ్యలో రాజ్‌కుమార్‌ రావు అడ్డుపడగా అతన్ని కడుపులో కొట్టాడు. దీంతో నొప్పితో అతను సోఫాలో పడిపోయాడు.

news18-telugu
Updated: November 16, 2019, 3:41 PM IST
హీరోయిన్‌ గదిలోకి హఠాత్తుగా ఊడిపడ్డ అభిమాని.. ఆ తర్వాత..
ప్రతీతాత్మక చిత్రం
  • Share this:
హిందీలో టీవి సీరియల్స్ ద్వారా పాపులారిటీ సంపాదించుకున్న నటి మౌనీ రాయ్.. బుల్లితెర నుంచి వెండితెరకు వెళ్లిన సంగతి తెలిసిందే. హీరో రాజ్‌కుమార్ రావ్‌తో కలిసి మౌనీ రాయ్ నటించిన 'మేడ్ ఇన్ చైనా' చిత్రం ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ నేపథ్యంలో హీరో హీరోయిన్లు వరుసగా ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు.ఇందులో భాగంగా ఓ ఇంటర్వ్యూ కోసం రాజ్‌కుమార్ రావ్,మౌనీ రాయ్ ఇద్దరు కలిసి వెళ్లారు. అక్కడ ఓ గదిలో ఇద్దరు కూర్చుని ఉండగా.. హఠాత్తుగా ఓ వ్యక్తి గదిలోకి ప్రవేశించాడు. చేతిలో బొకే పట్టుకుని మౌనీ రాయ్‌కి 'ఐ లవ్‌యూ' అని ప్రపోజ్ చేశాడు. దీంతో మౌనీ రాయ్ షాక్‌కి గురైంది.

ఇదేంటని మౌనీ రాయ్ అతన్ని నిలదీయగా.. చేతిలో ఉన్న బొకేను కింద పడేసి మీద మీదకు వెళ్లాడు. మధ్యలో రాజ్‌కుమార్‌ రావు అడ్డుపడగా అతన్ని కడుపులో కొట్టాడు. దీంతో నొప్పితో అతను సోఫాలో పడిపోయాడు. ఇదంతా చూసి ఏం జరుగుతుందో తెలియక మౌనీ రాయ్ భయంతో వణికిపోయింది. ఇక మౌనీ రాయ్‌ని ఎక్కువ సేపు టెన్షన్ పెట్టవద్దనుకున్నారో.. ఏమో.. ఇదంతా ప్రాంక్ అని రాజ్‌కుమార్ రావు చెప్పేశారు. దీంతో మౌనీ రాయ్ అతనిపై మండిపడింది. మరోసారి ఇలాంటివి రిపీట్ చేయవద్దని హెచ్చరించింది. ప్రస్తుతం యూట్యూబ్‌లో ఈ ప్రాంక్ వీడియో వైరల్‌గా మారింది.First published: November 16, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...