మేనేజర్ మాటలు నమ్మి కెరీర్ నాశనం చేసుకున్న టాలీవుడ్ హీరో..

సినిమా ఇండస్ట్రీ అంటే ఇంతే మరి.. ఒకప్పుడు బాగా బతికేసిన వాళ్లు కూడా ఇప్పుడు బికారులుగా ఉన్నారు. ముఖ్యంగా దీపం ఉన్నపుడే ఇల్లు చక్కబెట్టుకోవాలని పెద్దలు ఊరికే చెప్పలేదు. ఇండస్ట్రీలో ఈ రోజు..

Praveen Kumar Vadla | news18-telugu
Updated: November 6, 2019, 9:34 PM IST
మేనేజర్ మాటలు నమ్మి కెరీర్ నాశనం చేసుకున్న టాలీవుడ్ హీరో..
ప్రతీతాత్మక చిత్రం
  • Share this:
కాలం కలిసిరాకపోతే తాడే పామై కాటేస్తుందంటారు. ఇప్పుడు కూడా ఇండస్ట్రీలో ఓ కుర్ర హీరోకు ఇదే జరుగుతుంది. ఒకప్పుడు సంచలనాలు రేపిన ఆ హీరో పరిస్థితి ఇప్పుడు దారుణంగా తయారైంది. దీపం ఉన్నపుడే ఇల్లు చక్కబెట్టుకోవాలని పెద్దలు ఊరికే చెప్పలేదు. ఇండస్ట్రీలో ఈ రోజు ఉన్న టైమ్ రేపు ఉంటుందని క్లారిటీ రాలేదు. ఎంతో మంది స్టార్ హీరోలు కూడా ఈ రోజు కనిపించకుండా పోయారు. ఒకప్పుడు సంచలన హీరోలుగా ఇండస్ట్రీని ఏలేసిన ఉదయ్ కిరణ్, తరుణ్ లాంటి హీరోలు కూడా కొన్నాళ్ల తర్వాత కనిపించకుండా పోయారు.. పాపం ఉదయ్ అయితే ఏకంగా లోకాన్నే విడిచేసి తన దారి చూసుకున్నాడు. అలాంటి ఇండస్ట్రీలో ఇప్పుడు ఉన్నారు హీరోలు.

ఉదయ్ కిరణ్ ఫైల్ ఫోటో


ఇప్పుడు మనం చెప్పుకుంటున్న హీరోగారి పరిస్థితి కూడా అంతే. చాలా తక్కువ సమయంలోనే సర్రుమంటూ క్రేజ్ తెచ్చుకున్నాడు. ఎంత త్వరగా గుర్తింపు తెచ్చుకున్నాడో అంతే త్వరగా కెరీర్ నాశనం కూడా చేసుకున్నాడు. ఈ కుర్ర హీరో కెరీర్ నాశనం కావడానికి మేనేజర్ కూడా కారణం అని చెప్తుంటారు. ఇమేజ్‌కు మించిన రెమ్యునరేషన్ అడగటం.. కథలో వేలుపెట్టడంతో పాటు మేనేజర్ వింత చేష్టలు కూడా ఈయన కెరీర్ నాశనం చేసేలా చేసాయనే టాక్ ఉంది. ఓ పెద్ద హీరో నిర్మించిన చిన్న సినిమాతో ఇండస్ట్రీకి వచ్చి.. రెండో సినిమాతోనే సినిమా చూపించేసాడు. ఆ తర్వాత మూడో సినిమాతో మరో బ్లాక్ బస్టర్ కొట్టి అక్కడ్నుంచి ఫ్లాపుల దండయాత్ర మొదలుపెట్టాడు.

అగ్ర నిర్మాత దగ్గర నెల జీతానికి పని చేస్తున్న హీరో


లక్షల నుంచి కోట్లు కావాలంటూ అత్యాశకు పోవడమే కాకుండా డైరెక్షన్‌లో కూడా వేలెట్టేసి గెలికేయడంతో ఇప్పుడు ఆ హీరోను పట్టించుకోవడం లేదెవ్వరు. ఇలాంటి సమయంలో ఓ అగ్ర నిర్మాత ఈయనతో సినిమా నిర్మిస్తున్నాడు. అసలు ఇలాంటి సమయంలో ఆయనకు సినిమా ఇవ్వడమే ఎక్కువా.. ఇంక రెమ్యునరేషన్ కూడా ఇస్తాడా అనుకుంటున్న తరుణంలో ఓ షాకింగ్ నిజం బయటికి వచ్చింది. ఆ హీరోకు పారితోషికం కాకుండా నెల జీతం ఇస్తున్నాడని.. సినిమా అయిపోయినన్ని రోజులు ఆ జీతానికి పని చేస్తున్నాడని తెలుస్తుంది. ఇది విన్న తర్వాత అతన్ని అప్పట్లో అభిమానించిన వాళ్లు కూడా అయ్యో పాపం అనుకుంటున్నారు. ఆ సినిమా త్వరలోనే విడుదల కానుంది. అది హిట్టైతే మనోడికి ఈ ఇండస్ట్రీలో నూకలు ఇంకా ఉన్నట్లే.. లేదంటే మాత్రం బ్యాగ్ సర్దుకోవాల్సిందే.
First published: November 5, 2019, 5:54 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading