Ntr - Trivikram- Upeena Bucchi Babu Sana: త్రివిక్ర‌మ్‌కు వెయిటింగ్ త‌ప్ప‌దా? ఉప్పెన ద‌ర్శ‌కుడిపై క‌న్నేసిన ఎన్టీఆర్

Young Tiger NTR puts director Trivikram aside for Uppena director Buchi Babu Sana

Ntr - Trivikram- Upeena Bucchi Babu Sana: ఆర్ఆర్ఆర్ తర్వాత త్రివిక్రమ్‌తో ఎన్టీఆర్ సినిమా చేస్తాడనే సంగతి తెలిసిందే. అయితే కొన్ని కారణాలతో ఇప్పుడు ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబు సానా లైన్‌లోకి వచ్చినట్లు సమాచారం.

  • Share this:
    యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ త‌దుప‌రి సినిమాకు చ‌క‌చ‌కా పావులు క‌దుపుతున్నాడు. ఆర్ఆర్ఆర్ ముగియ‌గానే ఎన్టీఆర్ ..త్రివిక్ర‌మ్ సినిమా చేస్తాడ‌నే సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్ర‌క‌ట‌న వెలువ‌డింది కూడా. అయితే, ఇప్పుడు ప‌రిస్థితులు మారాయి. త్రివిక్ర‌మ్‌ను ఎన్టీఆర్ మ‌రికొన్ని రోజులు వెయిటింగ్‌లో పెట్టేలాగానే ఉంద‌ని ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లో టాక్ బ‌లంగా వినిపిస్తుది. అందుకు కార‌ణం, అంత‌కు ముందు ఎన్టీఆర్‌, త్రివిక్ర‌మ్ చేయాల‌నుకున్న సినిమా పొలిటిక‌ల్ బ్యాక్‌డ్రాప్‌లో అనుకున్నారు. కానీ ఆర్ఆర్ఆర్ త‌ర్వాత ఎన్టీఆర్ ప్యాన్ ఇండియా ట‌చ్ ఉన్న సినిమాలు చేయాల‌ని అనుకుంటున్నాడ‌ట‌. అందుక‌ని స్క్రిప్ట్‌ను మార్చ‌మ‌ని త్రివిక్ర‌మ్‌కు చెప్పాడ‌ట‌. ఇప్పుడు త్రివిక్ర‌మ్ ప్యాన్ ఇండియా ట‌చ్‌తో స్క్రిప్ట్‌లో మార్పులు చేర్పులు చేస్తున్నాడ‌ని స‌మాచారం.

    ఎన్టీఆర్ 30 సెట్స్‌పైకి వెళ్ల‌డానికి ఇంకా ప‌ట్టేలా ఉంది. ఈ గ్యాప్‌లో ఎన్టీఆర్ మ‌రో సినిమాను చేయ‌డానికి రెడీ అయ్యాడు. సినీ వ‌ర్గాల స‌మాచారం మేర‌కు రీసెంట్‌గా ఉప్పెన‌తో సెన్సేష‌న‌ల్ హిట్ కొట్టిన ద‌ర్శ‌కుడు బుచ్చిబాబు సానా ద‌ర్శ‌క‌త్వంలో మైత్రీ మూవీ మేక‌ర్స్ బ్యాన‌ర్‌లో ఓ సినిమా చేయ‌డానికి ఎన్టీఆర్ ఆస‌క్తి చూపుతున్నాడ‌ట‌. ప్ర‌స్తుతం క‌థా చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయి. అంతా ఓకే అయితే సినిమాను వెంట‌నే సెట్స్ పైకి తీసుకెళ్లిపోతారు.

    గోదావ‌రి జిల్లా బ్యాక్‌డ్రాప్‌తో ల‌వ్‌స్టోరిగా ఉప్పెన‌ను తెర‌కెక్కించిన ద‌ర్శ‌కుడు బుచ్చిబాబు, త‌దుప‌రి స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో అదే గోదావారి జిల్లాల కాన్సెప్ట్‌తో 1980లో చిత్రీక‌రించేలా ఓ క‌థ‌ను సిద్ధం చేసుకున్నాడ‌ని టాక్‌. మ‌రి ఉప్పెన ద‌ర్శ‌కుడితో ఎన్టీఆర్ సినిమా ఎంత వ‌ర‌కు ముందుకెళుతుందో తెలియాలంటే మ‌రికొన్ని రోజులు ఆగాల్సిందే.
    Published by:Anil
    First published: