Ntr Host Another Special Programme: తెలుగులో బిగ్‌బాస్‌కు పోటీగా మ‌రో ఛానెల్‌ స్పెష‌ల్ షో.. రంగంలోకి దిగుతున్న ఎన్టీఆర్‌..?

nandamuri taraka rama rao

Ntr - Host Special Programme: య‌ంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ హోస్ట్‌గా మ‌రో స్పెష‌ల్ షో ప్రారంభం అవుతుంది.. ఇంత‌కీ ఆ షో చేస్తున్న ఛానెల్ ఎదో తెలుసా?

  • Share this:
    యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ .. నేటి త‌రం అగ్ర క‌థానాయ‌కుల్లో నంద‌మూరి వార‌సుడు. ప్ర‌స్తుతం జ‌క్కన్న ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న ఆర్ఆర్ఆర్ సినిమా చిత్రీక‌ర‌ణ‌లో రామ్‌చ‌ర‌ణ్‌తో క‌లిసి న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ తుది ద‌శ‌కు చేరుకుంటోంది. ఈ నేప‌థ్యంలో ఎన్టీఆర్ త‌న త‌దుప‌రి చిత్రాల‌పై ఫోక‌స్ పెడుతున్నాడ‌ట‌. ఇప్ప‌టికే త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో ఎన్టీఆర్ ఓ సినిమా చేస్తాడ‌నే సంగ‌తి తెలిసిందే. ఇప్పుడు హీరోల ఆలోచ‌నా తీరు మారుతుంది. ఒక‌ప్ప‌టిలా ఎన్టీఆర్ కేవ‌లం సినిమాల‌కే ప‌రిమితం కావాల‌నుకోవడం లేదు. సినిమాల నుండి ఏమాత్రం తీరిక దొరికినా, క‌మ‌ర్షియ‌ల్ యాడ్స్‌లో న‌టిస్తున్నాడు. అయితే అంత‌కు ముందే బుల్లితెర‌పై కూడా రంగ ప్ర‌వేశం చేశాడు. నేటి త‌రం అగ్ర క‌థానాయకుల్లో ఎన్టీఆర్ మాత్ర‌మే బుల్లితెర‌పై వీక్ష‌కుల‌ను మెప్పించిన స్టార్‌. తెలుగు రియాలిటీ షో బిగ్‌బాస్ మొద‌టి సీజ‌న్‌కు ఎన్టీఆర్ వ్యాఖ్యాత‌గా వ్య‌వ‌హ‌రించిన సంగ‌తి తెలిసిందే. బిగ్‌బాస్ మొద‌టి సీజ‌న్‌కు క్రేజ్ తీసుకురావ‌డంలో ఎన్టీఆర్ స‌క్సెస్ అయ్యాడు. త‌న బిజీ క‌మిట్‌మెంట్సో, ఇత‌ర కార‌ణాలేమో కానీ.. త‌ర్వాత ఎందుక‌నో బిగ్‌బాస్ త‌ర్వాత సీజ‌న్స్ చేయ‌డానికి ఆస‌క్తి చూప‌లేదు. త‌ర్వాత ఎన్టీఆర్ స్థానాన్ని నాని, నాగార్జున భ‌ర్తీ చేశారు.

    అయితే లేటెస్ట్ ఇండస్ట్రీ వ‌ర్గాల స‌మాచారం మేర‌కు మ‌రోసారి ఎన్టీఆర్ హోస్ట్‌గా మార‌బోతున్నాడ‌ట‌. అయితే స‌మాచారం మేర‌కు ఎన్టీఆర్ బిగ్‌బాస్ షోకు వ్యాఖ్యాత‌గా వ్య‌వ‌హ‌రించ‌బోవ‌డం లేదు. ఎంట‌ర్‌టైన్‌మెంట్ ఛానెల్స్ ఒక‌టైన జెమినీ టీవీ నిర్వాహ‌కులు ఓ భారీ షో ప్లాన్ చేశారు. ఈ షోకు ఎన్టీఆర్ వ్యాఖ్యాత‌గా వ్య‌వ‌హ‌రిస్తాడ‌ని, అందుకు మొత్తంలో రెమ్యున‌రేష‌న్ కూడా ఇవ్వ‌డానికి జెమినీ నిర్వాహ‌కులు ఓకే చెప్పార‌ని స‌మాచారం. త్వ‌ర‌లోనే దీనికి సంబంధించిన ప్ర‌క‌ట‌న వెలువ‌డే అవ‌కాశం ఉంద‌ని స‌మాచారం.

    అయితే అంత వ‌ర‌కు ఎన్టీఆర్ చేతిలో క‌మిట్ అయిన సినిమాల‌ను పూర్తి చేసే ప‌నిలో ఉంటాడు. ట్రిపుల్ ఆర్‌లో ఎన్టీఆర్ తెలంగాణ గోండు వీరుడు కొమురంభీమ్ పాత్ర‌ధారిగా న‌టిస్తోన్న సంగ‌తి తెలిసిందే. స్వాతంత్య్రానికి ముందు జ‌రిగిన ఓ ఫిక్ష‌న్ పీరియాడిక్ బ్యాక్‌డ్రాప్‌తో ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి ఈ సినిమాను తెర‌కెక్కిస్తున్నారు. ఈ సినిమాలో ఎన్టీఆర్ జ‌త‌గా హాలీవుడ్ న‌టి ఒలివియా మోరిస్ న‌టిస్తుది. అలాగే రామ్‌చ‌ర‌ణ్ ఇందులో మ‌న్యం వీరుడు అల్లూరి సీతారామ‌రాజు పాత్ర‌లో న‌టిస్తుండ‌గా ఆయ‌న జోడీగా ఆలియాభ‌ట్ న‌టిస్తుంది. వ‌చ్చే ఏడాది సినిమా షూటింగ్‌ను పూర్తి చేసి త‌ర్వాత ప‌రిస్థితుల‌ను బ‌ట్టి జ‌క్క‌న్న ట్రిపుల్ ఆర్ రిలీజ్ డేట్ గురించి ఓ ప్ర‌క‌ట‌న చేసే అవ‌కాశం ఉంద‌ని టాక్‌. అయితే ఇండ‌స్ట్రీ వ‌ర్గాల స‌మాచారం మేర‌కు ఈ సినిమా 2022లోనే విడుద‌ల‌య్యే అవ‌కాశాలున్నాయ‌ట‌.
    Published by:Anil
    First published: