Young Tiger Ntr: పండగరోజు ఆ పనిచేయబోతున్న యంగ్‌ టైగర్‌..!

Young tiger ntr and Trivikram movie launch date confirmed

Young Tiger Ntr: అరవింద సమేత వీరరాఘవ తర్వాత యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ హీరోగా త్రివిక్రమ్‌ దర్శకత్వంలో రూపొందనున్న సినిమా లాంఛనంగా ప్రారంభం కాబోయే సినిమాకి ముహూర్తం కుదిరింది.

  • Share this:
    పండగరోజు తెలుగు అగ్ర కథానాయకుల్లో ఒకరైన ఎన్టీఆర్‌ ఓ పని చేయబోతున్నాడట. ఇంతకీ ఆయన చేయబోతన్న పనేంటో తెలుసా..! అనే వివరాల్లోకి వెళితే.. యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ ప్ర‌స్తుతం రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో 'ఆర్ఆర్ఆర్(రౌద్రం ర‌ణం రుధిరం)' సినిమాను పూర్తి చేసే ప‌నిలో ఉన్నాడు. ఈ సినిమా పూర్తి చేయ‌గానే స్టార్ డైరెక్ట‌ర్ త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేయ‌బోతున్న సంగ‌తి తెలిసిందే. ఈ ఏడాదిలోనూ ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్ల‌డానికి రంగం సిద్ధ‌మ‌వుతుంది. ప్ర‌స్తుతం ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి. తాజా సమాచారం మేరకు ఈ సినిమాను తెలుగు సంవత్సరాది ఉగాదిరోజున లాంఛనంగా ప్రారంభించాలని యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌, త్రివిక్రమ్‌ డిసైడ్‌ అయ్యారని సమాచారం. అంటే ఏప్రిల్‌ 13న ఎన్టీఆర్‌ 30వ సినిమా షూటింగ్‌ ప్రారంభం అవుతుంది. ఈ నెలలో ఎన్టీఆర్‌ వారం రోజుల పాటు ఈ సినిమా షూటింగ్‌లో పాల్గొంటాడు.

    తర్వాత కాస్త గ్యాప్‌ తీసుకుని మే, జూన్‌ నెలల్లో ఏకధాటిగా సినిమాను పూర్తి చేసే పనిలో పడతాడట ఎన్టీఆర్‌. ఈ ఏడాది డిసెంబర్‌ నెలలోపు ఈ సినిమా షూటింగ్‌ను పూర్తి చేసి నెక్ట్స్‌ సినిమాకు వెళ్లిపోవాలనేది ఎన్టీఆర్‌ ఆలోచనగా కనిపిస్తుందట. అర‌వింద‌స‌మేత వీరరాఘ‌వ సినిమా త‌ర్వాత ఎన్టీఆర్‌, త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న చిత్ర‌మిది. ఎన్టీఆర్ ఆర్ట్స్‌, హారిక అండ్ హాసిన క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై ఈ సినిమా రూపొంద‌నుంది. గ‌త ఏడాది అల వైకుంఠ‌పుర‌ములో సినిమాతో నాన్ బాహుబ‌లి రికార్డుల‌ను క్రియేట్ చేసిన త‌ర్వాత త్రివిక్ర‌మ్ డైరెక్ట్ చేస్తున్న సినిమా ఇది.

    మరోవైపు రాజమౌళి దర్శకత్వంలో చరణ్‌తో కలిసి ఎన్టీఆర్‌ చేస్తున్న ట్రిపుల్‌ ఆర్‌ సినిమా షూటింగ్‌ ముగింపు దశకు చేరుకుంటోంది. ఈ సినిమాలో ఎన్టీఆర్‌ తెలంగాణ గోండు వీరుడు కొమురం భీమ్‌ పాత్రలో కనిపించబోతున్నాడు. ఈ సినిమా దసరా సందర్భంగా అక్టోబర్‌ 13న విడుదల కానుంది.
    Published by:Anil
    First published: