Jr NTR: సీఎం.. సీఎం అంటూ అరుపులు.. ఆగండి బ్రదర్ అంటూ సీరియస్ అయిన జూనియర్ ఎన్టీఆర్..

జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR)

Jr NTR: జూనియర్ ఎన్టీఆర్‌కు తెలుగు ఇండస్ట్రీలో ఉన్న ఇమేజ్ గురించి మాటల్లో చెప్పడం సాధ్యం కాదు. ఎందుకంటే మాస్‌లో అలాంటి బ్రహ్మాండమైన ఇమేజ్ సొంతం చేసుకున్నాడు ఈయన. తాజాగా ఈయన తెల్లవారితే గురువారం ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు..

  • Share this:
జూనియర్ ఎన్టీఆర్‌కు తెలుగు ఇండస్ట్రీలో ఉన్న ఇమేజ్ గురించి మాటల్లో చెప్పడం సాధ్యం కాదు. ఎందుకంటే మాస్‌లో అలాంటి బ్రహ్మాండమైన ఇమేజ్ సొంతం చేసుకున్నాడు ఈయన. తాజాగా ఈయన తెల్లవారితే గురువారం ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు వచ్చాడు తారక్. కీరవాణి చిన్న కొడుకు సింహా కోడూరి హీరోగా నటిస్తున్న ఈ సినిమా మార్చ్ 27న విడుదల కానుంది. తాజాగా ఈ చిత్ర ప్రీ రిలీజ్ వేడుకకు వచ్చిన జూనియర్ ఎన్టీఆర్.. అక్కడ చాలా విషయాల గురించి మాట్లాడాడు. ముఖ్యంగా తనకు జీవితంలో స్టేజీపై మాట్లాడటానికి ఇంత టెన్షన్ ఎప్పుడూ రాలేదని చెప్పాడు తారక్. రేపు పొద్దున్న తన కొడుకులు అభయ్, భార్గవ్ సాధించిన విజయాల గురించి మాట్లాడటానికి తనెంత ఇబ్బంది పడతానో.. ఇప్పుడు సింహా, భైరవ గురించి మాట్లాడటానికి కూడా అంతే ఇబ్బంది పడుతున్నానని చెప్పాడు ఎన్టీఆర్. అయితే తెల్లవారితే గురువారం సినిమా గురించి ఈయన మాట్లాడుతున్న సమయంలోనే కింది నుంచి అభిమానులు సిఎం, సిఎం అంటూ అరిచారు. తారక్ మాట్లాడుతున్నంత సేపు కూడా అలా అరుస్తూనే ఉన్నారు.

ఓ వైపు తనకు కంగారుగా ఉందని.. ఏం మాట్లాడాలో అర్థం కావడం లేదని జూనియర్ చెప్తున్న తరుణంలోనే అభిమానులు అలా అరిచే సరికి ఒక్కసారిగా సీరియస్ అయ్యాడు జూనియర్. తనకు దేవుడిచ్చిన కుటుంబం రాజమౌళి, కీరవాణి ఫ్యామిలీ అని.. ఆ కుటుంబానికి తానెప్పుడూ గెస్ట్ కాలేనని చెప్పుకొచ్చాడు జూనియర్. అలాగే వాళ్లు కూడా తనకు గెస్ట్ కాదని చెప్పాడు ఈయన. అలా ఎమోషనల్ స్పీచ్ మధ్యలో సీఎం సీఎం అనే అరుపులు జూనియర్‌ను బాగా డిస్టర్బ్ చేసాయి.
Jr NTR, jr ntr on politics, jr ntr political entry, evaru meelo kotishwarudu, meelo evaru kotishwarudu, ap politics, ap news, jr ntr tdp, జూనియర్ ఎన్టీఆర్, రాజకీయాల్లోకి జూనియర్ ఎన్టీఆర్, ఏపీ న్యూస్
జూనియర్ ఎన్టీఆర్(jr ntr)

దాంతో వెంటనే ఆగండి బ్రదర్.. ఆగమని చెప్తున్నానా అంటూ సీరియస్‌గా రియాక్ట్ అయ్యాడు తారక్. దాంతో అభిమానులు కూడా ఆయన మాట విన్నారు. అప్పటి వరకు అరిచినా వాళ్లు ఒక్కసారిగా సైలెంట్ అయిపోయారు. రాజకీయంగా ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ చాలా సైలెంట్‌గా ఉన్నాడు. అసలు తనకు పార్టీకి సంబంధం లేదన్నట్లు చాలా దూరంగా ఉన్నాడు. తనకు ప్రస్తుతం సినిమాలు తప్ప మరో లోకమే లేదని చెప్తున్నాడు తారక్. ఒకవేళ ఎప్పుడైనా తన అవసరం పడినపుడు తాత పెట్టిన పార్టీ కోసం వస్తానని చెప్తుంటాడు జూనియర్.

అయితే ఆ సమయం ఇప్పుడు కాదని చెప్పాడు నందమూరి తారక రామారావు. ఇలాంటి సమయంలో అభిమానులు ప్రేమతో అరిచినా కూడా జూనియర్‌కు కోపం తెప్పించాయి. దాంతో వాళ్లను అరిచినా కూడా తర్వాత మళ్లీ కూల్ చేసాడు తారక్. ఏదేమైనా కూడా రాజకీయాల నుంచి ఆయన దూరంగా ఉన్నా.. ఆయన్ని రాజకీయాలు మాత్రం దూరంగా ఉంచేలా కనిపించడం లేదు.
Published by:Praveen Kumar Vadla
First published: