మళ్లీ రాజకీయాల్లోకి జూనియర్ ఎన్టీఆర్.. అలా మొదలవుతుంది..

Jr NTR: జూనియర్ ఎన్టీఆర్ ఏంటి.. మళ్లీ రాజకీయాల్లోకి రావడం ఏంటి అనుకుంటున్నారు కదా.. పదేళ్ల కిందే రాజకీయాల్లోకి వచ్చి పాతికేళ్లు కూడా నిండని వయసులోనే తన స్పీచులతో దంచేసాడు యంగ్ టైగర్.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: February 12, 2020, 12:25 PM IST
మళ్లీ రాజకీయాల్లోకి జూనియర్ ఎన్టీఆర్.. అలా మొదలవుతుంది..
జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR Trivikram movie on Politics)
  • Share this:
జూనియర్ ఎన్టీఆర్ ఏంటి.. మళ్లీ రాజకీయాల్లోకి రావడం ఏంటి అనుకుంటున్నారు కదా.. పదేళ్ల కిందే రాజకీయాల్లోకి వచ్చి పాతికేళ్లు కూడా నిండని వయసులోనే తన స్పీచులతో దంచేసాడు యంగ్ టైగర్. అప్పట్లో తెలుగుదేశం తరఫున ఈయన చేసిన ప్రచారం సంచలనమే. పార్టీ ఓడిపోయినా కూడా జూనియర్ మాత్రం తన మాటలతో ఆకట్టుకున్నాడు. ఆ తర్వాత పార్టీకి పూర్తిగా దూరంగా ఉన్నాడు ఈయన. కేవలం సినిమాలు మాత్రమే చేసుకుంటూ.. తన కెరీర్‌పై ఫోకస్ చేసాడు జూనియర్. ప్రస్తుతం రాజమౌళి సినిమాతో బిజీగా ఉన్నాడు ఈయన. ఆ తర్వాత కూడా త్రివిక్రమ్ శ్రీనివాస్, కొరటాల శివ లాంటి దర్శకులతో సినిమాలు సెట్ చేసుకున్నాడు ఈయన. అయితే ఇప్పుడు మళ్లీ జూనియర్ రాజకీయాల వైపు చూస్తున్నాడనే వార్తలు వినిపిస్తున్నాయి.

జూనియర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్ (Jr NTR Trivikram)
జూనియర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్ (Jr NTR Trivikram)


దాని వెనక కూడా ఓ కథ కూడా ఉంది. ఈయన రాజకీయాలు సినిమా కోసమే కానీ నిజంగా మాత్రం కాదు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో తనకు సినిమాలు తప్ప మరేదీ ముఖ్యం కాదంటున్నాడు ఈయన. తాత పార్టీ కోసం ఉంటానంటున్నాడు కానీ పార్టీ కోసం ఉంటానని చెప్పట్లేదు ఈయన. ఇదిలా ఉంటే ఆర్ఆర్ఆర్ తర్వాత ఈయన త్రివిక్రమ్‌తో చేయబోయే సినిమా పొలిటికల్ టచ్‌తో సాగుతుందని తెలుస్తుంది. అల వైకుంఠపురములో సినిమాతో ఇండస్ట్రీ హిట్ అందుకున్న త్రివిక్రమ్.. ఎన్టీఆర్ సినిమాతో మరోసారి సంచలనం సృష్టించాలని చూస్తున్నాడు. పొలిటికల్ టచ్ ఉంటుంది కాబట్టే ఈ చిత్రానికి అయిననూ పోయిరావలే హస్తినకు అనే టైటిల్ అనుకుంటున్నట్లు తెలుస్తుంది.

జూనియర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్ (Jr NTR Trivikram)
జూనియర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్ (Jr NTR Trivikram)


అరవింద సమేత సినిమా విజయం సాధించినా కూడా బ్లాక్ బస్టర్ అయితే కాదు. దాంతో ఆ బాకీ తీర్చేయాలని చూస్తున్నాడు ఈయన. ఈ సినిమాలో ఎన్టీఆర్ ఒక రాజకీయ నాయకుడి కొడుకు పాత్రలో కనిపించబోతున్నాడని తెలుస్తుంది. మహేష్ బాబు భరత్ అనే నేను.. రానా దగ్గుబాటి లీడర్.. విజయ్ దేవరకొండ నోటా తరహాలో అనూహ్యంగా రాజకీయాల్లోకి వచ్చే పాత్రలో ఇందులో ఎన్టీఆర్ కనిపిస్తాడని వార్తలు వినిపిస్తున్నాయి. అక్కడ్నుంచి రాజకీయాల్లో తనదైన ముద్రను హీరో ఎలా వేశాడనేది ఈ చిత్ర కథ అని ప్రచారం జరుగుతుంది.

జూనియర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్ (Jr NTR Trivikram)
జూనియర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్ (Jr NTR Trivikram)


ఇలాంటి కథతో చాలా సినిమాలు వచ్చాయి కానీ త్రివిక్రమ్ ఏదో మాయ చేస్తాడని నమ్ముతున్నారు అభిమానులు. లైన్ పాతదే అయినా కూడా స్క్రీన్ ప్లే కొత్తగా రాస్తాడులే అంటున్నారు ఫ్యాన్స్. ఈ చిత్రంలో మరోసారి పూజా హెగ్డేనే హీరోయిన్‌గా ఎంపిక చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. హారిక హాసిని బ్యానర్‌లోనే ఈ చిత్రం రాబోతుంది. 2021 సమ్మర్ కానుకగా ఎన్టీఆర్ సినిమా విడుదల కానుంది. మరి చూడాలిక.. గతంలో నాగ లాంటి సినిమాలో కాసేపు రాజకీయాలు చేసాడు ఎన్టీఆర్. ఒకవేళ ఈయన పూర్తిస్థాయిలో రంగంలోకి దిగితే ఎలా ఉంటుందనేది త్రివిక్రమ్ చూపించబోతున్నాడన్నమాట.
First published: February 12, 2020, 12:24 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading