Jr NTR classical dance: జూనియర్ ఎన్టీఆర్ చిన్నప్పటి క్లాసికల్ డాన్స్ వీడియో.. ఎంత బాగా చేసాడో..?

జూనియర్ ఎన్టీఆర్ భరతనాట్యం (Jr NTR dance)

Jr NTR: జూనియర్ ఎన్టీఆర్ మంచి నటుడు మాత్రమే కాదు అద్భుతమైన డాన్సర్ కూడా. అందులోనూ భరతనాట్యంలో ఈయనకు ప్రవేశం ఉంది. చిన్నప్పటి నుంచే క్లాసికల్ డాన్స్‌లో శిక్షణ తీసుకున్నాడు జూనియర్.

  • Share this:
జూనియర్ ఎన్టీఆర్ మంచి నటుడు మాత్రమే కాదు అద్భుతమైన డాన్సర్ కూడా. అందులోనూ భరతనాట్యంలో ఈయనకు ప్రవేశం ఉంది. చిన్నప్పటి నుంచే క్లాసికల్ డాన్స్‌లో శిక్షణ తీసుకున్నాడు జూనియర్. అందుకే ఇప్పుడు డాన్సులు కుమ్మేస్తున్నాడు. టాలీవుడ్‌లోనే కాదు ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో బెస్ట్ డాన్సర్స్‌లో ఎన్టీఆర్ కూడా ఒకడు అంటే అతిశయోక్తి కాదు. స్వయంగా హృతిక్ రోషన్ కూడా ఓ టైమ్‌లో జూనియర్ డాన్స్ గురించి ప్రస్తావించాడు. చిన్ననాటి నుంచి కూడా డాన్స్ అంటే ఉన్న ఆసక్తిని గమనించి తల్లి శాలిని కొడుకుకు డాన్స్ ట్రైనింగ్ ఇప్పించింది. అలా చిన్నపుడే ప్రదర్శనలు కూడా ఇచ్చాడు ఈయన. అప్పుడే బహుమతులు కూడా గెలుచుకున్నాడు. ఎన్టీఆర్ స్కూల్ ఏజ్‌లో ఉన్నపుడు ఇచ్చిన డాన్స్ పర్ఫార్మెన్స్ వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. అప్పట్లో నందమూరి చిన్నోడు చేసిన ఈ నాట్యానికి గిప్టులు కూడా బాగానే వచ్చాయి. క్లాసికల్ డాన్స్‌లో తన మెళుకువలు చూపించాడు జూనియర్ ఎన్టీఆర్. (Video Credit: Mana Stars)

తొలి సినిమా బాల రామాయణం కంటే ముందు ఈ డాన్స్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు జూనియర్. ఆ తర్వాత బాల రామాయణం.. ఆ తర్వాత మూడుళ్లకు నిన్ను చూడాలని సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు ఈయన. ఆ వెంటనే ఆది, సింహాద్రితో సూపర్ స్టార్ అయిపోయాడు. ప్రస్తుతం రాజమౌళి ట్రిపుల్ ఆర్‌తో పాటు త్రివిక్రమ్, ప్రశాంత్ నీల్ సినిమాలతో బిజీగా ఉన్నాడు జూనియర్ ఎన్టీఆర్.
Published by:Praveen Kumar Vadla
First published: