• HOME
  • »
  • NEWS
  • »
  • MOVIES
  • »
  • YOUNG TIGER JR NTR BLAZER PRICE IN EVARU MEELO KOTEESWARULU GOING VIRAL IN SOCIAL MEDIA PK

Jr NTR blazer price: ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ కోసం జూనియర్ ఎన్టీఆర్ బ్లేజర్ ఖరీదు తెలుసా..?

Jr NTR blazer price: ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ కోసం జూనియర్ ఎన్టీఆర్ బ్లేజర్ ఖరీదు తెలుసా..?

ఎవరు మీలో కోటీశ్వరులు (Jr NTR)

Jr NTR blazer price: జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) ఏం చేసినా కూడా అభిమానులు ఓ కంట కనిపెడుతూనే ఉంటారు. అప్పట్లో రాజమౌళి(Rajamouli) కొడుకు పెళ్లికి వచ్చిన ఎన్టీఆర్ వాచ్ ఖరీదు దాదాపు 25 లక్షలకు పైగానే ఉంటుందని చెప్పారు. ఆ తర్వాత అతడి షూస్, మాస్క్ గురించి ఆరా తీసారు. ఇప్పుడు బ్లేజర్ గురించి చర్చ జరుగుతుంది.

  • Share this:
తమకు నచ్చిన హీరోల విషయంలో అభిమానులు ఎప్పుడూ కూడా వాళ్ల కంటే ఒక అడుగు ముందే ఉంటారు. తమ అభిమాన హీరోలకు సంబంధించిన అప్ డేట్స్ అన్నీ అందరికంటే ముందుగానే సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. వాళ్ల గురించి బయట అందరికీ చెప్పేస్తున్నారు. వాళ్లు ఏం చేసినా కూడా అభిమానులకు అలా తెలిసిపోతుందంతే. ముఖ్యంగా వాళ్లు వాడే బ్రాండ్స్ గురించి ఫ్యాన్స్ చాలా ఆసక్తిగా కనిపిస్తుంటారు. వీలైతే హీరోల మాదిరే వాళ్లు కూడా చేయాలని కలలు కంటుంటారు. అందుకే వాళ్లేం చేస్తున్నారు.. ఎలాంటి బ్రాండ్స్ వాడుతున్నారు.. ఏ రకమైన బట్టలు వేసుకుంటున్నారు అంటూ గమనిస్తుంటారు. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ విషయంలో కూడా ఇదే జరిగింది. ఈయనేం చేసినా కూడా అభిమానుల కళ్లన్నీ ఆయనపైనే ఉంటాయి. ముఖ్యంగా అప్పట్లో రాజమౌళి కొడుకు పెళ్లికి వచ్చిన ఎన్టీఆర్ వాచ్ ఖరీదు దాదాపు 25 లక్షలకు పైగానే ఉంటుందని చెప్పారు. ఆ తర్వాత అతడు వేసుకున్న షూస్ ధర కూడా 75 వేలకు పైగానే ఉంటుందని సాక్ష్యాలతో సహా ఫోటోలను విడుదల చేసారు.

మొన్నటికి మొన్న ఆయన పెట్టుకున్న మాస్క్ గురించి సోషల్ మీడియాలో వైరల్ చేసారు. ప్రస్తుతం ట్రిపుల్ ఆర్ సినిమాతో పాటు త్రివిక్రమ్, ప్రశాంత్ నీల్, కొరటాల శివ, బుచ్చిబాబు లాంటి దర్శకులతో పని చేయబోతున్న ఎన్టీఆర్.. సినిమాలతో పాటు బయట కూడా బిజీగానే ఉంటున్నాడు.

jr ntr,jr ntr twitter,jr ntr instagram,jr ntr mask,jr ntr mask sukumar daughter function,jr ntr movies,jr ntr mask rate,jr ntr mask price UA sports,jr ntr RRR shooting,jr ntr movies,telugu cinema,జూనియర్ ఎన్టీఆర్,జూనియర్ ఎన్టీఆర్ సినిమాలు,జూనియర్ ఎన్టీఆర్ మాస్క్ ధర
జూనియర్ ఎన్టీఆర్ సుకుమార్ ఫంక్షన్ (Sukumar Jr NTR)


ఆ మధ్య దర్శకుడు సుకుమార్ కూతురు వేడుకలో ఎన్టీఆర్ వేసుకున్న మాస్క్ గురించి ఆరా తీసి.. అది UA స్పోర్ట్స్ మాస్క్ అని తెలిపారు అభిమానులు. దాని ధర సుమారు రూ 2340. తమ హీరో అలాంటి మాస్క్ పెట్టుకున్నాడని కొందరు అభిమానులు ఇప్పుడు ఇదే మాస్క్ కొనుగోలు చేస్తున్నారు. ఎన్టీఆర్ ధరించడంతో దానికి సోషల్ మీడియాలో ఫ్రీ ప్రమోషన్ వచ్చేసింది. ఇప్పుడు ఆయన బ్లేజర్‌పై ఫ్యాన్స్ కన్ను పడింది. ఎవరో మీలో కోటీశ్వరులు షో కోసం ఈయన ప్రోమోలో వేసుకున్న బ్లేజర్ గురించే ఇప్పుడు చర్చ జరుగుతుంది.
jr ntr twitter,jr ntr blazer price,jr ntr blazer price in evaru meelo koteeswarulu,jr ntr evaru meelo koteeswarulu,evaru meelo koteeswarudu promo jr ntr,jr ntr evaru meelo koteeswarulu press meet live,evaru meelo koteeswarulu ntr,evaru meelo koteeswarulu launch event,evaru meelo koteeswarulu press meet,evaru meelo koteeswarudu promo,ఎవరు మీలో కోటీశ్వరులు జూనియర్ ఎన్టీఆర్,జూనియర్ ఎన్టీఆర్ బ్లేజర్ ప్రైస్ ఎవరు మీలో కోటీశ్వరులు
ఎవరు మీలో కోటీశ్వరులు (Jr NTR)

బాలీవుడ్ లెజెండరీ స్టైలిస్ట్ మనీష్ మల్హోత్రా ఈ బ్లేజర్ డిజైన్ చేసాడని తెలుస్తుంది. ఈ బ్లేజర్ ఖరీదు ఏకంగా 90 వేల రూపాయలు అని ప్రచారం జరుగుతుంది. ఎవరు మీలో కోటీశ్వరులు షో కోసం మనీష్ మల్హోత్రానే క్యాస్ట్యూమ్ డిజైన్ చేస్తున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం ఈయన నటిస్తున్న ట్రిపుల్ ఆర్ సినిమా అక్టోబర్ 13న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతుంది. ఆ తర్వాత కొరటాల శివ సినిమా సెట్స్‌పైకి రానుంది.
Published by:Praveen Kumar Vadla
First published:

అగ్ర కథనాలు