ప్రభాస్ లేకపోయుంటే చచ్చిపోయి 15 ఏళ్లయ్యేదంటున్న నటుడు..

Prabhas: తెలుగు ఇండస్ట్రీలోనే కాదు దేశమంతా ఇప్పుడు ప్రభాస్ గురించి మాట్లాడుకుంటున్నారు. ఆయన బాహుబలి, సాహో సినిమాలు నేషనల్ వైడ్‌గా సంచలనం సృష్టించాయి. సాహో అయితే మన దగ్గర ఫ్లాప్ అయినా..

Praveen Kumar Vadla | news18-telugu
Updated: May 22, 2020, 8:09 PM IST
ప్రభాస్ లేకపోయుంటే చచ్చిపోయి 15 ఏళ్లయ్యేదంటున్న నటుడు..
ప్రభాస్ (Prabhas)
  • Share this:
తెలుగు ఇండస్ట్రీలోనే కాదు దేశమంతా ఇప్పుడు ప్రభాస్ గురించి మాట్లాడుకుంటున్నారు. ఆయన బాహుబలి, సాహో సినిమాలు నేషనల్ వైడ్‌గా సంచలనం సృష్టించాయి. సాహో అయితే మన దగ్గర ఫ్లాప్ అయినా కూడా హిందీలో హిట్ అయింది. దాంతో ప్రభాస్ రేంజ్ పెరిగిపోయింది. అయితే ఎంత మార్కెట్ పెరిగినా.. ఎంత ఇమేజ్ వచ్చినా కూడా బిహేవియర్‌లో మాత్రం ప్రభాస్ ఎప్పుడూ డౌన్ టూ ఎర్త్ ఉంటాడని చెబుతున్నారు అతడి సన్నిహితులు. స్నేహితులకు ఎప్పుడూ ప్రాముఖ్యత ఇస్తుంటాడు ఈయన. ఇక ఇప్పుడు ఓ నటుడు కూడా ఇదే చెప్పాడు. 15 ఏళ్ల కింద ప్రభాస్‌తో కలిసి చత్రపతి సినిమాలో నటించిన శేఖర్ గుర్తున్నాడా..? రాజమౌళి సినిమాల్లో దాదాపు అన్నింట్లోనూ ఈయన నటించాడు.

ఛత్రపతి శేఖర్ ప్రభాస్ (chatrapathi sekhar)
ఛత్రపతి శేఖర్ ప్రభాస్ (chatrapathi sekhar)


చత్రపతిలో ప్రభాస్ బెస్ట్ ఫ్రెండ్‌గా కనిపించి.. ఇంటర్వెల్ అప్పుడు చనిపోయే పాత్రలో నటించాడు శేఖర్. ఆ సినిమా సమయంలో జరిగిన ఓ సంఘటన గురించి ఇప్పుడు గుర్తు చేసుకున్నాడు శేఖర్. షూటింగ్ సమయంలో ప్రభాస్ ఎవరితోనూ మాట్లాడేవాడు కాదని.. సైలెంట్‌గా తన పని తాను చేసుకునేవాడని చెప్పాడు శేఖర్. ఓ రోజు షూటింగ్ కోసం సముద్రంలోకి వెళ్లామని.. ప్రభాస్ ఇంట్రో సీన్ కోసం ఒడ్డు కనబడకూడదని.. సముద్రం మధ్యలోకి వెళ్లాల్సి వచ్చిందని చెప్పాడు శేఖర్. ఆ సమయంలో విలన్ గ్యాంగ్ నుంచి తమ సరుకు కాపాడుకోడానికి సముద్రంలో తమ సరుకును దాచేస్తామని.. అప్పుడు తను నీళ్లలోకి మునిగి తీయాల్సిన సీన్ రాజమౌళి చిత్రీకరిస్తున్నాడని చెప్పాడు ఈయన.

ఛత్రపతి శేఖర్ ప్రభాస్ (chatrapathi sekhar)
ఛత్రపతి శేఖర్ ప్రభాస్ (chatrapathi sekhar)


ఆ సమయంలో తన కాళ్లు ప్రభాస్ పట్టుకుంటే.. బయటికి వచ్చిన తర్వాత కాలర్ అజయ్ పట్టుకోవాలని.. కానీ అనుకోకుండా అజయ్‌కు తన కాలర్ దొరక్కపోవడంతో ఎంత వేగంగా పైకి వచ్చానో.. అంతే వేగంగా మళ్లీ సముద్రంలోకి పడిపోయానని చెప్పాడు శేఖర్. ఆ సమయంలో తన కాళ్లు అస్సలు వదలకుండా అలాగే ప్రభాస్ పట్టుకున్నాడని.. చాలా సేపు వరకు అలాగే ఉన్నాడని.. లోపల తనకు ప్రభాస్ తన ప్రాణాల కోసం పడుతున్న శ్రమ అర్థం అవుతుందని చెప్పాడు శేఖర్. ఆ రోజు తనకేమైనా అవుతుందేమో అని ప్రభాస్ పడిన తాపత్రయం అంతా ఇంతా కాదని చెప్పాడు శేఖర్. ఇప్పటికీ ప్రభాస్ అలాగే ఉన్నాడని.. ఆ రోజు ప్రభాస్ లేకపోతే తన పరిస్థితి ఎలా ఉండేదో ఊహించుకుంటే భయమేస్తుందని చెప్పాడు శేఖర్. విక్రమార్కుడు సినిమాలో కూడా ఈయన కీలక పాత్రలో నటించాడు.

First published: May 22, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading