Saaho Trailer Talk: ‘సాహో’ ట్రైలర్ టాక్.. నిజంగానే ప్రభాస్ సాహో అనిపించాడుగా..

Saaho Trailer Talk | ‘బాహుబలి’ వంటి భారీ సక్సెస్ తర్వాత ప్రభాస్.. సుజిత్ దర్శకత్వంలో దాదాపు రూ.200 కోట్ల భారీ బడ్జెట్‌తో ‘సాహో’ సినిమా చేసాడు. తాజాగా ఈ సినిమా ట్రైలర్ విడుదలైంది.

news18-telugu
Updated: August 10, 2019, 5:12 PM IST
Saaho Trailer Talk: ‘సాహో’ ట్రైలర్ టాక్.. నిజంగానే ప్రభాస్ సాహో అనిపించాడుగా..
‘సాహో’ ట్రైలర్ టాక్ (ట్విట్టర్ ఫోటో)
news18-telugu
Updated: August 10, 2019, 5:12 PM IST
‘బాహుబలి’ వంటి భారీ సక్సెస్ తర్వాత ప్రభాస్.. సుజిత్ దర్శకత్వంలో దాదాపు రూ.200 కోట్ల భారీ బడ్జెట్‌తో ‘సాహో’ సినిమా చేసాడు. ఇప్పటికే ఈ సినిమా ప్రారంభానికి ముందు ఒక టీజర్‌తో ఈ సినిమా ఎలా ఉండబోతుందో చెప్పిన చిత్ర యూనిట్ తాజాగా ఈ సినిమాకు సంబంధించిన మేకింగ్ విజువల్స్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. అంతేకాదు ఇప్పటికే విడుదల చేసిన టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది.  . తాజాగా సాహో సినిమా ట్రైలర్ విడుదల చేసారు. ఈ టీజర్ కూడా ఓ రేంజ్‌లో ఉంది. ఈ సినిమాలో సీన్స్, ఛేజింగ్ దృష్యాలను చూస్తే.. ఓ హాలీవుడ్ సినిమా చూస్తున్నామా అనే రేంజ్‌లో ఉంది. దర్శకుడిగా సుజిత్ టేకింగ్, ఫోటోగ్రఫీ, ప్రభాస్ స్టంట్స్ ఓ రేంజ్‌లో ఉన్నాయి.2 నిమిషాల 46 సెకన్లు ఈ ట్రైలర్ ఉంది.

అంతేకాదు ప్ర‌భాస్ ఏదైతే న‌మ్మ‌కం సుజీత్ మీద పెట్టుకున్నాడో దాన్ని వంద శాతం పూర్తి చేసినట్టే ఉంది ఈ ట్రైలర్ చూస్తుంటే.. విజువల్ ట్రీట్ చూసిన తర్వాత సినిమా రేంజ్ ఏంటో దర్శక నిర్మాతలకు కూడా క్లారిటీ వచ్చేసింది. మొత్తంగా ముంబాయిలో రూ.2000 కోట్లను ఎవరో దొంగలిస్తారు. అది దొంగతనం చేసింది ఎవరు ? హీరో ఈ దొంగతనం చేసాడా ? ఎవరు చేసారు ? శ్రద్దా కపూర్ ఈ సినిమా అమృతా నాయర్ అనే క్రైమ్ బ్రాంచ్ ఆఫీసర్ పాత్రలో నటించింది. ముంబాయిలో దొంగతనం చేసిన వాళ్లను పట్టుకునే పనిలో ఉంటుంది. మరోవైపు ప్రభాస్, శ్రద్దాల కెమిస్ట్రీ అదిరిపోయింది. ఇక గల్లీలో ఎవరైనా సిక్స్ కొడతాడు. కానీ స్టేడియంలో కొట్టినవాడికే ఓ రేంజ్ ఉంటది అనే డైలాగులు బాగున్నాయి. విజువల్స్ పరంగా ‘సాహో’ హాలీవుడ్ రేంజ్‌లో ఉంది.

young rebel star prabhas saaho triler talk,saaho trailer talk,prabhas saaho trailer talk,prabhas,prabhas instagram,prabhas facebook,prabhas twitter,young rebel star prabhas saaho triler talk,saaho teaser,saaho teaser talk,prabhas saaho teaser talk,saaho movie,saaho movie twitter,saaho movie teaser,saaho movie new teaser,saaho movie teaser june 13,prabhas,prabhas twitter,prabhas instagram,prabhas saaho movie new poster,prabhas saaho movie poster,prabhas saaho movie surprise,saaho movie,saaho release date,saaho release date aug 15th,saaho,saaho movie release date,saaho trailer,saaho movie trailer,saaho teaser,saaho official trailer,prabhas new movie,saaho full movie,saaho movie release date fixed,saaho movie updates,saasho release date,saaho movie review,saaho public talk,prabhas saaho,saaho telugu movie,saaho movie trailer update,saaho first look,saaho movie release date update,saaho movie release date latest update,prabhas movies,saaho movie teaser,telugu cinema,సాహో,సాహో ట్రైలర్ టాక్,సాహో ట్రైలర్, సాహో టీజర్,సాహో టీజర్ టాక్,అదరగొట్టిన సాహో టీజర్,సాహో టీజర్‌తో అదరగొట్టిన ప్రభాస్,సాహో న్యూ టీజర్,జూన్ 13న సాహో టీజర్,సాహో సర్‌ప్రైజ్,సాహో న్యూ పోస్టర్,సాహో పోస్టర్,సాహో ఆగస్ట్ 30న విడుదల,ప్రభాస్ సాహో,తెలుగు సినిమా
‘సాహో’ ట్రైలర్ టాక్ (ట్విట్టర్ ఫోటో)


ఈ సినిమాను ముందుగా ఆగష్టు 15న రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ అప్పటికే పోస్ట్ ప్రొడక్షన్ పనులు బాకీ ఉండటంతో ఈ సినిమాను ఆగష్టు 30న విడుదల చేస్తున్నారు. ఒక్క సినిమా అనుభవం ఉన్న దర్శకుడికి 200 కోట్లు బ‌డ్జెట్ అంటే చిన్న విష‌యం కాదు. ‘ర‌న్ రాజా ర‌న్‌’తో ఆక‌ట్టుకున్న సుజీత్.. సాహోతో సంచ‌ల‌నం సృష్టించ‌డం ఖాయం అని ఈ ట్రైలర్  చూస్తే చెప్పొచ్చు.  తెలుగులో ఇప్ప‌టి వ‌ర‌కు విజువ‌ల్ గ్రాండియ‌ర్స్ ఎలా ఉంటాయో మ‌న ద‌ర్శ‌కులు చూపించారు కానీ హాలీవుడ్ రేంజ్ యాక్ష‌న్ స్టాండ‌ర్డ్స్ ఎలా ఉంటాయో ఇప్పుడు సుజీత్ చూపించ‌డానికి రెడీ అవుతున్నాడు. ఈ సినిమాతో ‘సాహో’ మరోసారి దేశ వ్యాప్తంగా అందిరితో ‘సాహో’ అనిపిస్తాడో చూడాలి.

First published: August 10, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...