Saaho: ప్రభాస్ ‘సాహో’ సినిమా ఏడు రోజుల కలెక్షన్స్..

సాహో సినిమా భారీ అంచనాలతో వచ్చింది. అనుకున్నట్టుగానే ఈ సినిమాకు ఫస్ట్ డే అన్ని భాషల్లో అనూహ్యమైన స్పందన వచ్చింది. మొత్తంగా వారం రోజుల్లో అన్ని భాషల్లో కలిపి రూ.370 కోట్లకు పైగా కలెక్ట్ చేసినట్టు చిత్ర వర్గాలు ప్రకటించాయి.

news18-telugu
Updated: September 7, 2019, 1:46 PM IST
Saaho: ప్రభాస్ ‘సాహో’ సినిమా ఏడు రోజుల కలెక్షన్స్..
‘సాహో’ పోస్టర్ Photo ; Twitter
  • Share this:
సాహో సినిమా భారీ అంచనాలతో వచ్చింది. అనుకున్నట్టుగానే ఈ సినిమాకు ఫస్ట్ డే అన్ని భాషల్లో అనూహ్యమైన స్పందన వచ్చింది. మొదటి రోజే ఈ సినిమా ఓవరాల్‌గా రూ.138 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. మొత్తంగా ఏడు రోజులకు అన్ని భాషల్లో కలిపి రూ.370 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసినట్టు చిత్ర యూనిట్ అఫీషియల్‌గా ప్రకటించింది. ఇప్పటికే బాహుబలి 1,2, 2.0 సినిమాల తర్వాత సౌత్ ఇండియాలో నాలుగో స్థానంలో ఉంది సాహో. ఐతే తొలి  వారం రోజుల్లో 4 రోజులు హాలీడేస్ ఉండటంతో భారీ వసూళ్లు అయితే వచ్చాయి. కానీ ఆ తర్వాత వీక్ డేస్ మొదలు కాగానే సినిమా కూడా వీక్ అయిపోయింది. దాంతో బయ్యర్లకు కూడా టెన్షన్ మొదలైంది.

young rebel star prabhas saaho first week colletions,prabhas,prabhas saaho movie collections,saaho 7days collections,saaho first week collections,saaho,saaho movie collections,saaho movie 6 days collections,saaho movie,saaho movie twitter,prabhas movie saaho,prabhas twitter,prabhas saaho collections,telugu cinema,ప్రభాస్,ప్రభాస్ సాహో కలెక్షన్స్,సాహో కలెక్షన్స్,సాహో 6 డేస్ కలెక్షన్స్,తెలుగు సినిమా,సాహో ఫస్ట్ వీక్ కలెక్షన్స్,సాహో 7 రోజుల కలెక్షన్స్,
‘సాహో’ ఫస్ట్ వీక్ కలెక్షన్స్ (Twitter/Photo)


ఈ చిత్రం 290 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. అంటే ఇంకా దాదాపు రూ.85 కోట్లు వసూలు చేయాలి. రెండో వారం కూడా తెలుగులో ఏ భారీ సినిమా లేదు.. దాంతో ఖచ్చితంగా మరికొన్ని వసూళ్లు రావడం ఖాయం. అయితే తెలుగులో ఈ చిత్రం రూ.124 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. కానీ ఇప్పటి వరకు ఆరు రోజుల్లో వచ్చిన మొత్తం 82 కోట్ల షేర్ మాత్రమే. అంటే ఇంకా రూ.42 కోట్లు వెనకబడే ఉంది. ప్రస్తుతం పరిస్థితి చూస్తుంటే అన్ని కోట్లు రావడం మాత్రం అంత ఈజీ కాదు. హిందీలో ఈ సినిమా ఇప్పటి వరకు రూ.110 కోట్లు వసూళ్లు సాధించినట్టు ట్రేడ్ వర్గాలు చెప్పాయి. మొత్తానికి డివైడ్ టాక్‌తోనూ వసూళ్ల సునామీ సృష్టిస్తోంది ప్రభాస్.
Published by: Kiran Kumar Thanjavur
First published: September 7, 2019, 1:45 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading