ప్రభాస్‌కు బాలీవుడ్‌లో అరుదైన గౌరవం.. సాహోకు అవార్డు..

Prabhas: బాహుబలి సినిమాతో దేశవ్యాప్తంగా సూపర్ స్టార్ అయిపోయాడు ప్రభాస్. ఆ సినిమా తీసుకొచ్చిన మార్కెట్ నిలబెట్టుకోడానికి సాహో అంటూ మరోసారి ప్యాన్ ఇండియన్ సినిమా చేసి సక్సెస్ అయ్యాడు ప్రభాస్.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: February 21, 2020, 8:11 PM IST
ప్రభాస్‌కు బాలీవుడ్‌లో అరుదైన గౌరవం.. సాహోకు అవార్డు..
ప్రభాస్ ‘సాహో’ (Prabhas Saaho)
  • Share this:
బాహుబలి సినిమాతో దేశవ్యాప్తంగా సూపర్ స్టార్ అయిపోయాడు ప్రభాస్. ఆ సినిమా తీసుకొచ్చిన మార్కెట్ నిలబెట్టుకోడానికి సాహో అంటూ మరోసారి ప్యాన్ ఇండియన్ సినిమా చేసి సక్సెస్ అయ్యాడు ప్రభాస్. తెలుగులో ఈ చిత్రం విజయం సాధించలేదు కానీ బాలీవుడ్‌‌లో మాత్రం 150 కోట్లకు పైగా వసూలు చేసింది సాహో. సుజీత్ తెరకెక్కించిన ఈ చిత్రం నార్త్ ఆడియన్స్‌కు బాగానే కనెక్ట్ అయింది. మన ప్రేక్షకులు తిరస్కరించినా కూడా సాహోతో అక్కడ మంచి మార్కెట్ సంపాదించాడు ప్రభాస్. ఇక ఈ చిత్రంతో ఇప్పుడు అక్కడ అవార్డు కూడా సొంతం చేసుకున్నాడు యంగ్ రెబల్ స్టార్. ఆయనకు పిలిచి మరీ ప్రతిష్మాత్మక అవార్డు ఇచ్చారు.
ప్రభాస్ ‘సాహో’ (Prabhas Saaho)
ప్రభాస్ ‘సాహో’ (Prabhas Saaho)


సాహో సినిమా తొలిరోజు నుంచే బాలీవుడ్‌‌లో వసూళ్ల వర్షం కురిపించాడు ప్రభాస్. ఆ తర్వాత కూడా 150 కోట్ల వరకు వసూలు చేసింది సాహో. ఈ సినిమాతో బాలీవుడ్ బిజినెస్ అవార్డ్స్ హైయెస్ట్ గ్రాసింగ్ మెయిల్ డెబ్యూ అవార్డు సొంతం చేసుకున్నాడు యంగ్ రెబల్ స్టార్. 2019 ఆగస్టు 30న విడుదల అయిన సాహో బాలీవుడ్‌లో సంచలనం సృష్టించింది. ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డాడు ప్రభాస్. ఇందులో సొంతంగా డబ్బింగ్ కూడా చెప్పుకున్నాడు. హిందీ నేర్చుకుని మరీ డబ్ చేసుకున్నాడు ప్రభాస్. ఈ ఏడాది జనవరి 27న జపాన్‌లో కూడా సాహో సినిమా విడుదలైంది.
ప్రభాస్ ‘సాహో’ (Prabhas Saaho)
ప్రభాస్ ‘సాహో’ (Prabhas Saaho)

ప్రభాస్, శ్రద్ధ కపూర్ ప్రమోషన్ కూడా చేసారు. సాహో తెలుగులో ఫ్లాప్ అయినా కూడా ప్రభాస్ కెరీర్‌కు మాత్రం బాగానే సాయపడింది. ఈయన నేషనల్ వైడ్ స్టార్ కావడానికి సాహో మరింత హెల్ప్ కానుంది. ప్రస్తుతం ఈయన రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో ఓ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ చేస్తున్నాడు. పూజా హెగ్డే ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది. యు.వి.క్రియేషన్స్, గోపికృష్ణ బ్యానర్ సంయుక్తంగా ప్రభాస్ సినిమాను నిర్మిస్తున్నాయి. దాదాపు 130 కోట్ల బడ్జెట్ తో ఇది కూడా పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా వస్తోంది. ఏదేమేనా కూడా ప్రభాస్ ప్రస్తుతం నేషనల్ ఇమేజ్ ఎంజాయ్ చేస్తున్నాడు.
First published: February 21, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading