బాలీవుడ్‌లో ఆగని ప్రభాస్ ‘సాహో’ రికార్డ్స్.. మరోసారి దుమ్ము దులిపాడుగా..

రాజమౌళి తెరకెక్కించిన ‘బాహుబలి’ సినిమాతో ప్రభాస్ క్రేజ్.. టాలీవుడ్ నుంచి దేశ వ్యాప్తంగా పెరిగింది. ఆ తర్వాత ప్రభాస్ ‘సాహో’ మూవీతో పాన్ ఇండియా లెవల్లో పలకరించాడు. తాజాగా ఈ సినిమా మరోసారి..

news18-telugu
Updated: July 16, 2020, 5:58 PM IST
బాలీవుడ్‌లో ఆగని ప్రభాస్ ‘సాహో’ రికార్డ్స్.. మరోసారి దుమ్ము దులిపాడుగా..
‘సాహో’ (twitter/Photo)
  • Share this:
రాజమౌళి తెరకెక్కించిన ‘బాహుబలి’ సినిమాతో ప్రభాస్ క్రేజ్.. టాలీవుడ్ నుంచి దేశ వ్యాప్తంగా పెరిగింది. ఆ తర్వాత ప్రభాస్ ‘సాహో’ మూవీతో పాన్ ఇండియా లెవల్లో పలకరించాడు. తాజాగా యంగ్ రెబల్ ప్రభాస్ ‘సాహో’తో మరో రికార్డు అందుకున్నాడు. అవును ఏ భారతీయ హీరో సాధించలేని రికార్డు ‘సాహో’తో ప్రభాస్ సొంతం చేసుకున్నాడు. వివరాల్లోకి వెళితే.. తాజాగా ప్రభాస్ బాలీవుడ్ బడా హీరోలైన సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్, ఆమీర్ ఖాన్‌లు సాధించలేనిది ఇపుడు ప్రభాస్ సాధించి చూపెట్టాడు. గత కొన్నేళ్లుగా బాలీవుడ్ అగ్ర నటుడు షారుఖ్ ఖాన్ హిట్టు కోసం మొఖం వాచిపోయేలా ఎదురు చూస్తున్నాడు. ‘హ్యాపీ న్యూ ఇయర్’ తర్వాత ఆ స్థాయి హిట్ అన్నదే లేదు. మరోవైపు ఆమీర్ ఖాన్..‘దంగల్’ వంటి సినిమాలతో సంచలనాలు సృష్టిస్తున్నా ఆ తర్వాత అదే ఊపును కంటిన్యూ చేయడం లేదు. ఇంకోవైపు సల్మాన్ ఖాన్.. చెత్త రివ్యూలతో బాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర వందల కోట్లు కొల్లగొడుతున్న సరైన హిట్టు మాత్రం అందుకోలేకపోతున్నాడు. కానీ తెలుగు హీరో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ మాత్రం.. వరుసగా ‘బాహుబలి 1’, బాహుబలి 2’ తో పాటు తాజాగా ‘సాహో’తో వరుసగా రూ.400 కోట్లను అందుకున్న తొలి భారతీయ హీరోగా రికార్డులకు ఎక్కిన సంగతి తెలిసిందే కదా.

Jacqueline Fernandez is top indian celebrity of tik tok,Jacqueline Fernandez,prabhas,prabhas saaho,prabhas saaho Jaqueline Fernandez,Jacqueline Fernandez tik tok queen,tik tok queen Jacqueline Fernandez,Riteish Deshmukh,kapil sharma,madhuri dixit,bollywood,tik tok,tick talk,జాక్వెలిన్ ఫెర్నాండేజ్,జాక్వెలిన్ టిక్ టాక్,జాక్వెలిన్ ఫెర్నాండేజ్ టిక్ టాక్ స్టార్,ప్రభాస్ సాహో,ప్రభాస్ సాహో,రితేష్ దేశ్‌ముఖ్,మాధురి దీక్షిత్,కపిల్ శర్మ,ప్రభాస్
ప్రభాస్,జాక్వెలిన్ ఫెర్నాండేజ్ (Youtube/Credit)


ఇప్పటి వరకు బాలీవుడ్ హీరోలకు మాత్రమే పరిమితమైన వందల కోట్ల కలెక్షన్స్‌ను ఈజీగా రాబట్టేస్తున్నాడు. ఇప్పటికే ప్రభాస్ నటించిన ‘సాహో’ సినిమా నెగిటివ్ టాక్ తెచ్చుకున్నా.. బాక్సాఫీస్ దగ్గర మాత్రం రూ.400 కోట్లను రాబట్టి.. బాక్సాఫీస్ దగ్గర ఇంకా స్టడీగా రన్ అవుతూనే ఉంది. కేవలం బాలీవుడ్‌లోనే రూ. 200 కోట్లను రాబట్టింది.  ఏమైనా ఒక తెలుగు హీరో అయివుండి.. జాతీయ స్థాయిలో ఈ రకమైన వసూళ్లతో బీటౌన్ హీరోలకు ప్రకంపనలు పుట్టిస్తున్నాడు ప్రభాస్. తాజాగా ఈయన యాక్ట్  చేసిన ‘సాహో’ హిందీ వెర్షన్ డిజిటల్ వేదికగా కొత్త రికార్డులు క్రియేట్ చేసింది. ఇప్పటి వరకు హిందీలో అత్యధిక టీఆర్పీ సాధించిన టెలివిజన్ ప్రీమియర్‌గా ‘సాహో’ రికార్డులు బద్దలు కొట్టింది.

సాహో పోస్టర్ (Saaho poster)
సాహో పోస్టర్ (Saaho poster)


ఇప్పటి వరకు ‘సాహో’ టెలివిజన్‌లో మూడు సార్లు టెలికాస్ట్ అయింది. మూడు సార్లు దుమ్ము దులిపే టీఆర్పీ సాధించింది. మొదటి సారి ఈ చిత్రాన్ని టెలికాస్ట్ చేసినపుడు దాదాపు 1 కోటి 28 లక్షల వ్యూవర్ షిప్ దక్కించుకుంది. రెండోసారి ఈ సినిమా ప్రసారమైనపుడు 52 లక్షల పైగా ఇంప్రెషన్స్ రాబట్టింది. ముచ్చటగా మూడోసారి ఈ సినిమా టీవీలో టెలికాస్ట్ అయినపుడు 83 లక్షల వ్యూవర్ షిప్ సొంతం చేసుకున్నట్టు తాజాగా రేటింగ్స్ వెల్లడించాయి. దీంతో మరోసారి బాలీవుడ్‌లో హీరోగా ప్రభాస్ ఇంపాక్ట్ ఎలా ఉందో మరోసారి ప్రూవ్ అయింది. ప్రస్తుతం ప్రభాస్.. రాధాకృష్ణ దర్శకత్వంలో ‘రాధే శ్యామ్’ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో ప్రభాస్ సరసన పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది.
Published by: Kiran Kumar Thanjavur
First published: July 16, 2020, 5:51 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading