హోమ్ /వార్తలు /సినిమా /

Prabhas new car: కొత్త కారు కొన్న ప్రభాస్.. ఎన్ని కోట్లు తెలుసా..?

Prabhas new car: కొత్త కారు కొన్న ప్రభాస్.. ఎన్ని కోట్లు తెలుసా..?

ప్రభాస్ లగ్జరీ కార్ (Prabhas new car)

ప్రభాస్ లగ్జరీ కార్ (Prabhas new car)

Prabhas new car: ప్రభాస్ మరో కారు కొనేసాడని తెలుస్తుంది. ఏకంగా 7 కోట్లు పెట్టి ఈయన కొత్త కారు తీసుకున్నట్లు ప్రచారం జరుగుతుంది. సోషల్ మీడియాలో ఈ కారుకు సంబంధించిన ఫోటోలు కూడా వైరల్ అవుతున్నాయి.

తెలుగు ఇండస్ట్రీలో చాలా మంది హీరోలకు కార్స్ పిచ్చి ఉంది. మార్కెట్‌లోకి ఏ కొత్త కారు వచ్చినా కూడా అది తమ ఇంట్లో ఉండాలనుకుంటారు. అందులో ప్రభాస్ కూడా ఒకరు. ఈయనకు కూడా కార్ల పిచ్చి చాలానే ఉంది. ముఖ్యంగా ఏ కొత్త కారు వచ్చినా కూడా వెంటనే కొనేస్తుంటాడు యంగ్ రెబల్ స్టార్. పైగా ఇప్పుడు పాన్ ఇండియన్ స్టార్ కూడా. అన్నింటికంటే ముఖ్యంగా ఇండియాలో హైయ్యస్ట్ రెమ్యునరేషన్ తీసుకునే హీరో ప్రభాస్. ఈయన సినిమాకు 100 కోట్ల పారితోషికం అందుకుంటున్నాడు. ప్రస్తుతం నాలుగు సినిమాలతో బిజీగా ఉన్నాడు ప్రభాస్. అన్నీ పాన్ ఇండియన్ సినిమాలే కావడం గమనార్హం. రాధే శ్యామ్ జులైలో విడుదల కానుంది. సలార్ 2022 ఎప్రిల్ 14న విడుదల కానుంది. అది వచ్చిన నాలుగు నెలల్లోనే ఆది పురుష్ 2022 ఆగస్టులో విడుదల కానుంది. ఇక నాగ్ అశ్విన్ సినిమా 2024 సమ్మర్ రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఇన్ని సినిమాలు చేస్తున్నా కూడా తన జీవితాన్ని కూడా అంతే లగ్జరీగా గడిపేస్తుంటాడు. ప్రస్తుతం తాను చేస్తున్న సినిమాలన్నీ పాన్ ఇండియన్ కావడంతో ముంబైలోనే ఇల్లు తీసుకోవాలని చూస్తున్నాడు ప్రభాస్‌.

అందుకే అక్కడే 50 కోట్లకు పైగా ఖర్చు చేసి ఓ భారీ విల్లా కొనుగోలు చేసేందుకు పావులు కదుపుతున్నాడు. మరోవైపు ఇప్పుడు కొత్త కారు కూడా తీసుకున్నాడు ప్రభాస్. లంబోర్గిని అవెంటాడర్‌ ఎస్‌ రోడ్‌స్టర్‌ కారును ప్రభాస్‌ కొనుగోలు చేసినట్లు సోషల్‌ మీడియాలో వార్తలు వస్తున్నాయి.

prabhas lamborghini aventador roadster car,prabhas,prabhas twitter,prabhas instagram,prabhas movies,prabhas new car,prabhas new car with 7 crore,prabhas baught new car,ప్రభాస్,ప్రభాస్ కొత్త కారు,ప్రభాస్ లంబోర్గినీ కార్,7 కోట్లు పెట్టి కారు కొన్న ప్రభాస్
ప్రభాస్ లగ్జరీ కార్ (Prabhas new car)

మార్చ్ 28న ఈ కారు హైదరాబాద్‌కు వచ్చేస్తుందని తెలుస్తుంది. ఇదిలా ఉంటే జూనియర్ ఎన్టీఆర్ కూడా ఇదే కంపెనీ కారును ఈ మధ్యే కొన్నాడు. ఇప్పుడు ప్రభాస్ అంతకంటే మోడ్రన్ కారు తీసుకున్నాడు. ఈ నేపథ్యంలో ఫోటోలు కూడా వైరల్ అవుతున్నాయి. ఈ కారు ధర దాదాపు 7 కోట్లకు పైగానే ఉంటుందని అంచనా. ఇప్పటికే ప్రభాస్ దగ్గర BMW 520D, ఇన్నోవా క్రిస్టా, జగువార్‌ ఎక్స్‌జేఎల్‌, రేంజ్‌ రోవర్‌ వోగ్‌, రోల్స్‌ రాయ్స్‌ గోస్ట్‌ కార్లు ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది. ఇప్పుడు ఈ లిస్టులోకి లంబోర్గీని జాయిన్ అయింది. దాంతో ప్రభాస్‌కు కంగ్రాట్స్ చెప్తున్నారు అభిమానులు.

First published:

Tags: Prabhas, Telugu Cinema, Tollywood