యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్‌కు ఆయన హార్ట్ కోర్ అభిమానులు షాక్ ఇచ్చారు. దీంతో బాహుబలి రంగంలోకి దిగాడు. వివరాల్లోకి వెళితే.. ‘సాహో’ తర్వాత ప్రభాస్.. రాధాకృష్ణ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే కదా. ఈ సినిమాకు ‘ఓ డియర్’ అనే పేరుతో పాటు ‘రాధే శ్యామ్’ అనే పేర్లను పరిశీలిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అయి చాలా రోజులు అవుతున్న ఇప్పటి వరకు ఈ సినిమాకు సంబంధించిన ఏ విషయాన్ని యూవీ క్రియేషన్స్ వాళ్లు బయటకు చెప్పడం లేదు. దీంతో యంగ్ రెబల్ ప్రభాస్ ఇపుడు తన అభిమానుల నుండి సెగ మొదలైంది. ఐతే.. ఈ సినిమా ప్రారంభమై చాలా రోజులు అవుతున్న ఇప్పటి వరకు ఈ సినిమాకు సంబంధించిన అప్‌డేట్ ఏది బయటకు రాలేదు. దీంతో అభిమానులు ఈ చిత్ర నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ తో పాటు ప్రభాస్ పై అసహనం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు ఇపుడు ప్రభాస్ నటిస్తోన్ సినిమాకు అభిమానులే ‘రాధే శ్యామ్’ అనే టైటిల్ ఫిక్స్ చేసి సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు.
గతంలో ప్రభాస్ అభిమానులు.. సోషల్ మీడియా వేదిగా యూవీ క్రియేషన్స్‌ను ట్రోల్ చేసారు. వరస్ట్ బ్యానర్ యూవీ క్రియేషన్స్ అనే ట్యాగ్‌తో సోషల్ మీడియాలో కాస్త హడావుడి కూడా చేసారు. ఇలా చేస్తే సినిమాకు సంబంధించిన అప్‌డేట్ ఇస్తారేమోనన్న ఆశతో ప్రభాస్ అభిమానులు ఇలా చేసారు. ఇంత చేసినా.. యూవీ క్రియేషన్స్‌తో పాటు ప్రభాస్ నుండి ఎలాంటి చడీ చప్పుడు లేదు. ఈ మధ్యే ప్రభాస్.. గ్రీన్ ఇండియా చాలెంజ్‌లో భాగంగా మొక్కలు నాటాడు. ఆ సందర్భంగా నైనా ఈ చిత్రానికి సంబంధించిన ప్రకటన చేస్తాడేమే అని ఎదురు చూసినా ఎలాంటి అప్‌డేట్ మాత్రం రాలేదు. అందుకే అభిమానులు పూనుకొని ప్రభాస్ సినిమాకు ‘రాధే శ్యామ్’ అనే టైటిల్ ఫిక్స్ చేసారు. ఇక ప్రభాస్‌తో పాటు చిత్ర యూనిట్ ఆలోచనలు వేరే రకంగా ఉన్నాయి. ముందుగా ఈ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్ చేసి... ఆ తర్వాత ఈ సినిమాకు సంబంధించిన అప్‌డేట్స్ ఒక్కొక్కటిగా ఇవ్వాలనే నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. . మొత్తానికి తన సినిమాకు సంబంధించిన ఏదైన ప్రకటన ప్రభాస్ ఇచ్చేంత వరకు అభిమానులు శాంతించేలా కనిపించడం లేదు. ఈ సినిమా తర్వాత ప్రభాస్ వైజయంతీ మూవీస్ బ్యానర్‌లో నాగ్ అశ్విన్ దర్శకత్వంలో సోషియో ఫాంటసీ మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే కదా
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bollywood, Nag Ashwin, Pooja Hegde, Prabhas20, Tollywood