హోమ్ /వార్తలు /సినిమా /

సంచలన దర్శకుడుతో ప్రభాస్ క్రేజీ మూవీ..

సంచలన దర్శకుడుతో ప్రభాస్ క్రేజీ మూవీ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ (Twitter/Photo)

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ (Twitter/Photo)

ప్రస్తుతం ప్రభాస్ .. రాధాకృష్ణ దర్శకత్వంలో ‘జాన్’ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత ప్రభాస్.. కొరటాల శివ దర్శకత్వంలో ఒక సినిమాకు కమిటైనట్టు సమాచారం. వీటితో పాటు మరో క్రేజీ డైరెక్టర్‌తో నెక్ట్స్ ప్రాజెక్ట్ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం.

ఇంకా చదవండి ...

  బాహుబలితో ప్రభాస్ క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. ఆ సినిమా తర్వాత సుజిత్ దర్శకత్వంలో చేసిన ‘సాహో’ డిజాస్టర్ టాక్ తెచ్చుకున్నా.. బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా దాదాపు రూ.400 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసి హీరోగా ప్రభాస్ సత్తా ఏంటో అందరికీ తెలిసేలా చేసింది. ప్రస్తుతం ప్రభాస్ .. రాధాకృష్ణ దర్శకత్వంలో ‘జాన్’ సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రం వచ్చే యేడాది సమ్మర్‌లో విడుదల కానుంది. ఈ సినిమా తర్వాత ప్రభాస్.. కొరటాల శివ దర్శకత్వంలో ఒక సినిమాకు కమిటైనట్టు సమాచారం. దీంతో పాటు అర్జున్ రెడ్డి సినిమాతో సంచలన దర్శకుడిగా తనకంటూ ఒక ఐడెంటిటీ ఏర్పరుచుకున్న సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ప్రభాస్.. ఒక మూవీ ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. ఇప్పటికే సందీప్ రెడ్డి వంగా చెప్పిన స్టోరీ లైన్‌కు ప్రభాస్ ఓకే చెప్పాడట.

  young rebel star prabhas crazy project with sandeep reddy vanga movie,prabhas,prabhas saaho.prabhas sandeep reddy vanga,young rebel star prabhas,prabhas instagram,prabhas twitter,prabhas facebook,sandeep reddy vanga facebook,sandeep reddy vanga instagram,sandeep reddy vanga twitter,sandeep reddy vanga,arjun reddy,sandeep vanga,sandeep reddy,director sandeep reddy vanga,sandeep reddy interview,prabhas,arjun reddy movie,kabir singh director sandeep reddy,director sandeep vanga interview,sandeep raddy vanga and prabhas movie,ranbir kapoor and sandeep reddy vanga,sandeep raddy vanga movie with prabhas,prabhas - sandeep vanga combo fix,samantha about sandeep reddy vanga,bollywood,hindi cinema,telugu cinema,tollywood,ప్రభాస్,సాహో ప్రభాస్,సాహో,ప్రభాస్ సందీప్ రెడ్డి వంగా,సందీప్ రెడ్డి వంగా,సందీప్ రెడ్డి వంగా ప్రభాస్ మూవీ
  ప్రభాస్, సందీప్ రెడ్డి వంగా (File Photos)

  ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్‌ తో కలిసి టీ సిరీస్ ప్యాన్ ఇండియా లెవల్లో తెరకెక్కించనున్నారు. ఇక సందీప్ రెడ్డి వంగా విషయానికొస్తే.. ఆల్రెడీ ‘అర్జున్ రెడ్డి’ రీమేక్ ‘కబీర్ సింగ్’ సినిమాతో బాలీవుడ్‌లో కూడా సత్తా చాటాడు. మొత్తానికి రొటీన్‌కు భిన్నమైన చిత్రాలను తెరకెక్కించే సందీప్ రెడ్డి వంగా .. ప్రభాస్‌తో ఎలాంటి చిత్రాన్ని తెరకెక్కిస్తాడనేది ఇంట్రెస్టింగ్ పాయింట్ అనే చెప్పాలి.

  Published by:Kiran Kumar Thanjavur
  First published:

  Tags: Bollywood, Mythri Movie Makers, Prabhas, Sandeep reddy vanga, Tollywood

  ఉత్తమ కథలు