Prabhas: ఈ సారి ప్రభాస్ పుట్టినరోజు వేడుకలు జరిగేది అక్కడే.. ఎందుకో తెలుసా..

గత నాలుగేళ్లుగా సినిమాల మధ్యే బిజీగా గడిపాడు ప్రభాస్. వరుసగా ‘బాహుబలి’, ఆ తర్వాత ‘సాహో’ చిత్రాల వల్ల యంగ్ రెబల్ స్టార్‌కు కోరుకున్న విశ్రాంతి దొరకలేదు.ఈ సారి పుట్టినరోజు వేడుకలను వెరైటీగా ప్లాన్ చేశాడు.

news18-telugu
Updated: October 12, 2019, 9:48 PM IST
Prabhas: ఈ సారి ప్రభాస్ పుట్టినరోజు వేడుకలు జరిగేది అక్కడే.. ఎందుకో తెలుసా..
‘సాహో’ (twitter/Photo)
  • Share this:
గత నాలుగేళ్లుగా సినిమాల మధ్యే బిజీగా గడిపాడు ప్రభాస్. వరుసగా ‘బాహుబలి’, ఆ తర్వాత ‘సాహో’ చిత్రాల వల్ల యంగ్ రెబల్ స్టార్‌కు కోరుకున్న విశ్రాంతి దొరకలేదు. ఈ ఫోర్ ఇయర్స్‌లో ప్రభాస్ తన పుట్టినరోజు వేడుకలని సెట్స్ పై జరుపుకున్నాడు. ఈ నెల 23న ప్రభాస్ పుట్టినరోజు. ఈ పుట్టినరోజుతో యంగ్ రెబల్ 40వ పడిలోకి అడుగుపెడతాడు. దాంతో అభిమానులు కూడా ప్రభాస్ బర్త్ డేను స్పెషల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి రెడీ అవుతున్నారు. ఈ నెల 19న లండన్‌లోని రాయల్ ఆల్బర్ట్ హాల్‌లో ‘బాహుబలి’ సినిమాను ప్రదర్శించనున్నారు. అంతేకాదు ఈ హాల్‌లో ప్రదర్శించబోతున్న తొలి నాన్ ఇంగ్లీష్ సినిమాగా ‘బాహుబలి’ రికార్డులకు ఎక్కనుంది. అక్కడ ‘బాహుబలి’ తెలుగు వెర్షన్‌ను సబ్ టైటిల్స్‌తో ప్రదర్శించనున్నారు. ఈ వేడుకల తర్వాత ప్రభాస్.. లండన్‌లోనే తన 40వ పుట్టినరోజును గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకునే అవకాశాలున్నాయని ఆయన సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే ప్రభాస్ పుట్టినరోజుకు సంబంధించిన ఏర్పాట్లు లండన్‌లో మొదలైనట్టు సమాచారం.

 

First published: October 12, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు