news18-telugu
Updated: October 12, 2019, 8:28 PM IST
వైఎస్ జగన్, ప్రభాస్
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, ఏపీ ముఖ్యమంత్రి వై.యస్.జగన్మోహన్ రెడ్డి ఒకే వేదికను పంచుకోనున్నారా.. వీరితో పాటు ఏపీ హిందూపురం ఎమ్మెల్యే సినీ నటుడు నందమూరి బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్, మహేష్ బాబు కూడా ఈ వేదికను పంచుకోనున్నారు.. వివరాల్లోకి వెళితే.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నపుడు ప్రతియేట అప్పటి ప్రభుత్వం ఉత్తమ చిత్రంతో పాటు ఉత్తమ నటీనటులకు నంది పురస్కారాలు ఇవ్వడం ఆనవాయితీగా వస్తోంది. ఇక కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నపుడు 2011లో చివరిసారిగా ఏపీ ప్రభుత్వం అవార్డులను ప్రకటించి పురస్కారాలను అందజేసింది.ఇక 2014లో విభజిత ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు నేతృత్వంలోని టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత 2012-13 రెండు సంవత్సారాలకు కలిపి నంది అవార్డులను ప్రకటించారు.

నంది అవార్డ్స్
2012కు గాను ‘ఎటో వెళ్లిపోయింది మనసు’ సినిమాలో నటనకు గాను నాని ఉత్తమనటుడిగా ఎంపికైతే.. 2013కు గాను ‘మిర్చి’ సినిమాలో నటనకు గాను ప్రభాస్ ఉత్తమ నటుడిగా నంది అవార్డుకు ఎంపికైయ్యాడు. అటు ప్రభాస్‌కు ఈ అవార్డు రావడంపై రచ్చ నడిచింది. అదే యేడాది ‘అత్తారింటికీ దారేది’ సినిమాలో నటనకు గాను పవన్ కళ్యాణ్‌ను ఎందుకు ఎంపిక చేయలేదని పవర్ స్టార్ ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా నానా రచ్చ చేసారు.

ప్రభాస్,నాని (ఫైల్ ఫోటోస్)
ఆ తర్వాత మరికొన్ని రోజుల తర్వాత 2014,2015,2016 మూడు సంవత్సరాలకు కలిపి నంది పురస్కారాలను ప్రకటించారు. ఈ అవార్డులు ప్రకటించినపుడు పెద్ద రచ్చే జరిగింది. ముఖ్యంగా బాలకృష్ణ నటించిన ‘లెజెండ్’ సినిమాకు ఉత్తమ నటుడు, ఉత్తమ చిత్రం సహా పలు విభాగాల్లో నంది అవార్డుకు ఎంపికైంది. ఉత్తమ నటుడిగా బాలయ్యను మినహాయిస్తే..మిగిలిన విభాగాల్లో అవార్డులు ఎందుకు ఇచ్చారని అప్పట్లో పెద్ద రచ్చే నడిచింది. అంతేకాదు. 2015 సంవత్సారానికి ‘శ్రీమంతుడు’ సినిమాకు కాను మహేష్ బాబుకు అవార్డు వచ్చింది. 2016 కు గాను ‘నాన్నకు ప్రేమతో’,‘జనతా గ్యారేజ్’ సినిమాలకు గాను జూనియర్ ఎన్టీఆర్ ఉత్తమ నటుడిగా ఎంపికయ్యారు. ఈ ముగ్గురు ఒకే సామాజిక వర్గానికి చెందిన వారు కావడం.. ఈ ముగ్గురు టీడీపీతో అనుబంధం ఉండటంపై ఈ అవార్డుల ప్రకటనపై పెద్ద దుమారమే రేగింది. దీంతో ఏపీ ప్రభుత్వం ఈ నంది అవార్డుల పురస్కార ప్రధాన కార్యక్రమాన్ని వాయిదా వేసారు.

బాలకృష్ణ,మహేష్ బాబు,జూనియర్ ఎన్టీఆర్ (ఫైల్ ఫోటో)
కట్ చేస్తే.. 2019 ఎన్నికల్లో వై.యస్.జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైయస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చింది. మరి వైసీపీ అధికారంలో వచ్చిన తరవాత గత ప్రభుత్వం ప్రకటించిన నంది అవార్డులను ఇస్తుందా లేదా అనేది చూడాలి. ఒక వేళ ఇస్తే.. ముఖ్యమంత్రి హోదాలో జగన్ చేతులు మీదుగా ప్రభాస్, బాలకృష్ణ సహా జూనియర్ ఎన్టీఆర్, మహేష్ బాబు, నాని అందుకోవాల్సి వస్తోంది. మరి వై.యస్.జగన్మోహన్ రెడ్డి కూడా ఎన్నో ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న నంది అవార్డలుకు మోక్షం కలిగిస్తాడా లేదా అనేది చూడాలి.
Published by:
Kiran Kumar Thanjavur
First published:
October 12, 2019, 8:19 PM IST