ప్రభాస్ సలహాను పాటిస్తున్న చిరంజీవి.. మెగాస్టార్‌కు యంగ్ రెబల్ హెల్ప్..

యంగ్ రెబల్ స్టార్‌తో మెగాస్టార్ చిరంజీవి (Twitter/Photo)

Megastar Chiranjeevi Prabhas | మెగాస్టార్ చిరంజీవి ప్రభాస్ సలహాను పాటిస్తున్నాడు. వివరాల్లోకి వెళితే..

 • Share this:
  మెగాస్టార్ చిరంజీవి ప్రభాస్ సలహాను పాటిస్తున్నాడు. వివరాల్లోకి వెళితే.. ప్రస్తుతం చిరంజీవి, కొరటాల శివ దర్శకత్వంలో ‘ఆచార్య’ సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే కదా. 2020 దసరాకు విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారు. కానీ ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో జూలై వరకు ఎలాంటి షూటింగ్స్ జరిగే పరిస్థితులు లేవు. దీంతో ఈ సినిమా వచ్చే యేడాదే ప్రేక్షకులు ముందుకు వచ్చే అవకాశాలున్నాయి. ఇదిలా ఉంటే ఈ చిత్రం తర్వాత కూడా వరుసగా దర్శకులకు ఆఫర్స్ ఇచ్చేస్తున్నాడు మెగాస్టార్. ఓ వైపు స్ట్రెయిట్ సినిమాలు చేస్తూనే.. కథ నచ్చితే రీమేకులు కూడా చేయాలని చూస్తున్నాడు చిరు. ఇప్పటికే మలయాళ సూపర్ హిట్ పొలిటికల్ థ్రిల్లర్ లూసిఫర్ సినిమా తెలుగు రీమేక్ రైట్స్ తీసుకున్నాడు చిరంజీవి. ఈ సినిమాను ఇక్కడ చేయాలని చిరు భావిస్తున్నాడు. ఐతే.. ఈ సినిమా చేయమని చిరంజీవికి ప్రభాస్ సలహా ఇచ్చాడట. అంతేకాదు ఈ సినిమాను సుజిత్ దర్శకత్వంలో చేయమని చెప్పింది కూడా ప్రభాసేనట.

  Chiranjeevi call to prabhas,chiranjeevi message to prabhas,rajamouli message to prabhas,megastar chiranjeevi,prabhas,saaho trailer,saaho movie,prabhas new movie saaho,Tollywood,సాహోను మెచ్చుకున్న చిరంజీవి,సాహోను మెచ్చిన రాజమౌళి,ప్రభాస్,సాహో ట్రైలర్,టాలీవుడ్
  చిరంజీవి,ప్రభాస్


  ప్రభాస్.. సాహో సినిమాను రెగ్యులర్ గాడ్ ఫాదర్ తరహా కథతో తెరకెక్కించిన అందులో యాక్షన్ సన్నివేశాలు, స్క్రీన్ ప్లే ప్రేక్షకులును ఆకట్టుకున్నాయి. మరోవైపు ప్రభాస్ సలహా మేరకు చిరంజీవి కూడా ఈ రీమేక్ కథను ఓకే చేయడంతో పాటు సుజిత్‌తో ఈ రీమేక్ బాధ్యతలు అప్పగించాడు. సాహో తర్వాత ఈయనకు మరోసారి పెద్ద హీరోను డైరెక్ట్ చేసే అవకాశం వచ్చింది. ప్రస్తుతం వీడియో కాల్స్ చేసి కథను మార్చుతున్నట్లు తెలిపాడు మెగాస్టార్. ఈ పొలిటికల్ యాక్షన్ డ్రామాను కూడా ఈయన చేతుల్లో పెడుతున్నాడు చిరు. ఈ సినిమాను కూడా కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ నిర్మించనుంది. డిసెంబర్ నుంచి లూసీఫర్ తెలుగు రీమేక్ మొదలుపెట్టాలని చూస్తున్నాడు చిరంజీవి. ఆచార్య కూడా పొలిటికల్ థ్రిల్లరే.. లూసీఫర్ కూడా అంతే. ఈ రెండు సినిమాల్లో రామ్ చరణ్ రెండో హీరోగా నటించే అవకాశం ఉంది.
  Published by:Kiran Kumar Thanjavur
  First published: