ఆ దేశంలో కూడా ప్రభాస్ క్రేజ్ మాములుగా లేదుగా..

హీరోగా ప్రభాస్ క్రేజ్ మన దేశంలోనే కాదు.. విదేశాల్లోనూ పీక్స్‌లో ఉంది. అంతేకాదు అక్కడ కూడా ప్రభాస్ సినిమాలను వాళ్ల సొంత సినిమాల్ల ఆదరిస్తున్నారు.

news18-telugu
Updated: July 23, 2020, 10:40 PM IST
ఆ దేశంలో కూడా ప్రభాస్ క్రేజ్ మాములుగా లేదుగా..
ప్రభాస్ (Twitter/Photo)
  • Share this:
హీరోగా ప్రభాస్ క్రేజ్ మన దేశంలోనే కాదు.. విదేశాల్లోనూ పీక్స్‌లో ఉంది. అంతేకాదు అక్కడ కూడా ప్రభాస్ సినిమాలను వాళ్ల సొంత సినిమాల్ల ఆదరిస్తున్నారు. హీరోగా ప్రభాస్ విషయానికొస్తే.. ఎపుడైతే.. రాజమౌళి దర్శకత్వంలో ‘బాహుబలి’ సినిమా చేసాడో హీరోగా ప్రభాస్ క్రేజ్ లోకల్ లెవల్ నుంచి గ్లోబల్ లెవల్‌కు పెరిగింది. అంతేకాదు బాహుబలితో బాలీవుడ్ హీరోలకు కూడా సాధ్యం కానీ రికార్డులను తన వశం చేసుకున్నాడు. ఆ తర్వాత ‘సాహో’ తో మరోసారి బాక్సాఫీస్‌ను షేక్ చేసాడు.ఈ చిత్రం బ్యాడ్ టాక్‌తో కూడా కళ్లు చెదరే వసూళ్లను సాధించింది. ప్రస్తుతం ప్రభాస్.. రాధాకృష్ణ దర్శకత్వంలో ‘రాధే శ్యామ్’ సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే బాహుబలి మూవీ రష్యాతో పాటు జపాన్ వంటి దేశాల్లో మంచి ఆదరణ పొందింది. ఇక జపాన్ దేశంలో రజినీకాంత్ తర్వాత ఎన్టీఆర్‌కు కూడా ఓ మోస్తరు అభిమానులున్నారు. తాజాగా జపాన్ ఫేవరేట్ హీరోల లిస్టులో ప్రభాస్ కూడా ఉన్నాడు. అక్కడ షాపుల్లో ప్రభాస్ బాహుబలి గెటప్ బొమ్మలతో పాటు సాహోలో అతని గెటప్‌కు సంబంధించిన ఫోటోలతో పాటు టాయ్స్, మరియు వస్తువులు దర్శనమిస్తున్నాయి.

case filed on sahoo producers,case filed on sahoo producers in madhapur,case filed on uv producers,case on saaho,sahoo,sahoo movie,prabhas saaho,prabhas sahoo,saaho trailer,saaho movie,saaho,saaho teaser,case filed on producer dil raju for mr perfect movie,saaho movie trailer,case filed against bandla ganesh,prabhas saaho teaser,prabhas,pvp files case on tollywood,sahoo prabhas,prabhas sahoo movie,case filed against dil raju over prabhas film,
‘సాహో’ పోస్టర్ Photo ; Twitter


కరోనా కారణంగా ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాల్లో థియేటర్స్ బంద్ అయ్యాయి. ఇపుడు కరోనా జపాన్‌లో తగ్గుముఖం పట్టడంతో అక్కడ జపనీస్ వెర్షన్ ప్రభాస్ ‘సాహో’ సినిమా విడుదలైంది. ఈ సినిమా జపాన్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన విదేశీ చిత్రంగా రికార్డులకు ఎక్కింది. ’సాహో’ సినిమా ముందు వరకు అమీర్ ఖాన్ నటించిన ‘దంగల్’సినిమా ఎక్కువ వసూళ్లు సాధించిన చిత్రంగా ఉండేది. తాజాగా ఆ రికార్డును ‘సాహో’ సినిమా అధిగమించింది. ఇక జపాన్ దేశంలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల లిస్టులో ‘సాహో’ ’దంగల్’, ఇంగ్లీష్ వింగ్లీష్, 3 ఇడియట్స్ , ముత్తు , బాహుబలి 2 చిత్రాలు ఉన్నాయి. కాగా టాప్ 10 మూవీస్‌లో ప్రభాస్ నటించిన రెండు సినిమాలు ఉండటం విశేషం.
Published by: Kiran Kumar Thanjavur
First published: July 23, 2020, 10:40 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading