ప్రభాస్‌కు మొదలైన కొత్త తలనొప్పులు.. ఏం చేయాలో ఆలోచిస్తున్న డార్లింగ్.

యంగ్ రెబల్ ప్రభాస్‌ ఇపుడు తన అభిమానుల నుండి సెగ మొదలైంది. ప్రస్తుతం ఈ హీరో రాధాకృష్ణ దర్శకత్వంలో పీరియాడికల్ మూవీ చేస్తున్నాడు. ఈ సినమాకు ‘ఓ డియర్’ అనే పేరును పరిశీలిస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ప్రభాస్‌కు అభిమానుల నుండి సెగ మొదలైంది.

news18-telugu
Updated: May 25, 2020, 7:01 AM IST
ప్రభాస్‌కు మొదలైన కొత్త తలనొప్పులు.. ఏం చేయాలో ఆలోచిస్తున్న డార్లింగ్.
ఇండియాలో ఇప్పుడు ఖర్చులు పెరిగిపోయాయి. అందుకే మన హీరోలు కూడా రెమ్యునరేషన్ పెంచేస్తున్నారు. ఒకప్పుడు సినిమా 100 కోట్లు వసూలు చేస్తే ఔరా అని ఆశ్చర్యపోయేవాళ్ళు. కానీ ఇప్పుడు మన హీరోలే 100 కోట్లు వసూలు చేసే స్థాయికి ఎదిగిపోయారు.
  • Share this:
యంగ్ రెబల్ ప్రభాస్‌ ఇపుడు తన అభిమానుల నుండి సెగ మొదలైంది. ప్రస్తుతం ఈ హీరో రాధాకృష్ణ దర్శకత్వంలో పీరియాడికల్ మూవీ చేస్తున్నాడు. ఈ సినమాకు ‘ఓ డియర్’ అనే పేరును పరిశీలిస్తున్నారు. ఈ సినిమా తర్వాత వైజయంతీ మూవీస్ బ్యానర్‌లో నాగ్ అశ్విన్ దర్శకత్వంలో సోషియో ఫాంటసీ మూవీ చేస్తున్నాడు. ఐతే.. ఈ సినిమా ప్రారంభమై చాలా రోజులు అవుతున్న ఇప్పటి వరకు ఈ సినిమాకు సంబంధించిన అప్‌డేట్ ఏది బయటకు రాలేదు. దీంతో అభిమానులు ఈ చిత్ర నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ పై అసహనం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు సోషల్ మీడియా వేదిగా యూవీ క్రియేషన్స్‌ను ట్రోల్ చేస్తున్నారు. వరస్ట్ బ్యానర్ యూవీ క్రియేషన్స్ అనే ట్యాగ్‌తో సోషల్ మీడియాలో క్రియేట్ చేస్తున్న హంగామా మాములుగా లేదు. ఇదంతా ప్రభాస్ సినిమా అప్‌డేట్ కోసమే అభిమానులు ఇలా చేస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ లేదా టైటిల్ ప్రకటించే వరకు ప్రభాస్ అభిమానులు ఆగేలా కనిపించడం లేదు. అయితే అప్పట్లో లాక్‌డౌన్ నేపథ్యంలో పరిస్థితులను అర్ధం చేసుకోవాలని అభిమానులకు రిక్వెస్ట్ చేసారు. కానీ ఫ్యాన్స్ మాత్రం ప్రభాస్ సినిమాకు సంబంధించిన అప్‌డేట్ ఎప్పుడు ఇస్తారో కనీసం అదైనా చెప్పాలి అంటున్నారు. ఒకవైపు షూటింగ్స్ ఆగిపోయి నిర్మాతలు టెన్షన్ పడుతుంటే.. ప్రభాస్ అభిమానులు.. ఫస్ట్ లుక్ కోసం ఇలా రచ్చ చేయడం ఏమి బాగోలేదంటూ మరికొంత మంది ప్రభాస్ ఫ్యాన్స్ తీరు ఏమి బాగోలేదంటున్నారు. మొత్తానికి తన సినిమాకు సంబంధించిన ఏదైన ప్రకటన ప్రభాస్ ఇచ్చేంత వరకు అభిమానులు శాంతించేలా కనిపించడం లేదు.
Published by: Kiran Kumar Thanjavur
First published: May 25, 2020, 7:01 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading