హోమ్ /వార్తలు /సినిమా /

Sri Simha: యంగ్ హీరో శ్రీ సింహా కొత్త చిత్రం 'భాగ్ సాలే' ఫస్ట్ లుక్ విడుదల..

Sri Simha: యంగ్ హీరో శ్రీ సింహా కొత్త చిత్రం 'భాగ్ సాలే' ఫస్ట్ లుక్ విడుదల..

శ్రీ సింహా  ‘భాగ్ సాలే’ ఫస్ట్ లుక్ విడుదల (Twitter/Photo)

శ్రీ సింహా ‘భాగ్ సాలే’ ఫస్ట్ లుక్ విడుదల (Twitter/Photo)

Sri Simha: నేటి తరం ప్రేక్షకులని అలరించే సరికొత్త కథతో యువ హీరో శ్రీ సింహా (Sri Simha Koduri) కొత్త చిత్రం 'భాగ్ సాలే' (Bhaag Saale) ఫస్ట్ లుక్ నేడు విడుదల చేశారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

Sri Simha: నేటి తరం ప్రేక్షకులని అలరించే సరికొత్త కథతో యువ హీరో శ్రీ సింహా (Sri Simha Koduri) కొత్త చిత్రం 'భాగ్ సాలే' (Bhaag Saale) ఫస్ట్ లుక్ నేడు విడుదలయింది. ప్రణీత్ సాయి దర్శకత్వంలో క్రైమ్ కామెడీ గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని వేదాన్ష్ క్రియేటివ్ వర్క్స్, బిగ్ బెన్, సినీ వ్యాలీ మూవీస్ సినిమా బ్యానర్లపై అర్జున్ దాస్యన్, యష్ రంగినేని, కళ్యాణ్ సింగనమల నిర్మిస్తున్నారు.టైటిల్ మరియు ఫస్ట్ లుక్ విడుదల సందర్భంగా నిర్మాత అర్జున్ దాస్యన్ మాట్లాడుతూ "ఈతరం ప్రేక్షకులని అలరించే కథతో థ్రిల్లింగ్ క్రైమ్ కామెడీ గా తెరకెక్కుతున్న మా చిత్రం 'భాగ్ సాలే' ఫస్ట్ లుక్ నేడు విడుదలయింది. ప్రణీత్ సాయి దర్శకత్వంలో యువ హీరో శ్రీ సింహా, అర్జున్ పాత్రలో నటిస్తుండగా నేహా సొలంకి హీరోయిన్ గా నటిస్తుంది. జాన్ విజయ్ మరియి నందిని రాయ్ ప్రతినాయక పాత్రలు చేస్తున్నారు.ఏం చేసైనా అనుకున్నది సాధించాలనుకునే ఒక యువకుడి పాత్ర చుట్టూ తిరిగే ఈ కథ ఆద్యంతం థ్రిల్ చేస్తుంది. ఇందులో రాజీవ్ కనకాల, వైవా హర్ష, సత్య, సుదర్శన్, వర్షిణి తదితరులు నటిస్తుండగా చిత్ర విజయం పై మాకు పూర్తి నమ్మకముంది." అన్నారు.

సంగీతం కాల భైరవ అందిస్తుండగా, ఎడిటింగ్ కార్తీక ఆర్ శ్రీనివాస్, సినిమాటోగ్రఫీ రమేష్ కుషేందర్ చేస్తున్నారు.చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణంతర కార్యక్రమాలు జరుపుకుంటూ విడుదలకి సిద్ధంగా ఉంది. శ్రీ సింహా కోడూరి విషయానికొస్తే.. కీరవాణి కుమారుడైన ఈయన రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ‘యమ దొంగ’ సినిమాలో చిన్నప్పటి ఎన్టీఆర్ పాత్రలో నటించారు. ఆ తర్వాత మర్యాద రామన్నలో కూడా బాలనటుడిగా యాక్ట్ చేశారు.

ఇక జక్కన్న దర్శకత్వంలో తెరకెక్కిన ఈగలో కూడా (బిందు) సమంత ఫ్రెండ్ పాత్రలో నటించారు. ఇక 2019లో ‘మత్తువదలరా’ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత ‘తెల్లవారితే గురువారం’ సినిమాతో పలకరించారు. తాజాగా ఈయన ‘బాగ్ సాలే’ మూవీతో పలకరించబోతున్నారు. ఈ సినిమా తర్వాత ‘దొంగలున్నారు జాగ్రత్త’ సినిమాతో పలకరించబోతున్నారు.

Bollywood Heroes in South: సౌత్ సినిమాలపై ఫోకస్ పెడుతున్న బాలీవుడ్ హీరోలు.. ’గాడ్ ఫాదర్’తో సల్మాన్ ఖాన్ గ్రాండ్ ఎంట్రీ..

నటీనటులు: శ్రీ సింహ కోడూరి, నేహా సొలంకి, రాజీవ్ కనకాల, జాన్ విజయ్, వర్షిణి సౌందరాజన్, నందిని రాయ్, వైవా హర్ష, సత్య, సుదర్శన్, ప్రిథ్వీ రాజ్, ఆర్ జె హేమంత్, బిందు చంద్రమౌళి..నిర్మాతలు: అర్జున్ దాస్యన్, యష్ రంగినేని, కళ్యాణ్ సింగనమల

దర్శకుడు: ప్రణీత్ సాయి

ఛాయాగ్రహణం: రమేష్ కుషేందర్

సంగీతం: కాల భైరవ

ఎడిటర్: ఆర్.కార్తీక శ్రీనివాస్

ఆర్ట్ డైరెక్టర్: శృతి నూకల

ఫైట్ మాస్టర్: రామ కృష్ణ

కొరియోగ్రాఫర్: భాను, విజయ్ పోలకి

ఎగ్జిక్యూటివ్ నిర్మాత: అశ్వత్థామ, గిఫ్ట్సన్ కొరబండి

Published by:Kiran Kumar Thanjavur
First published:

Tags: Sri Simha Koduri, Telugu Cinema, Tollywood

ఉత్తమ కథలు