Home /News /movies /

YOUNG HERO RAJ TARUN HILARIOUS ENTRY INTO JABARDASTH COMEDY SHOW PK

జబర్దస్త్ ఎంట్రీ ఇచ్చిన రాజ్‌తరుణ్.. ప్రమోషన్ కోసం తప్పట్లేదుగా..

జబర్దస్త్ కామెడీ షోలో రాజ్ తరుణ్ (raj tarun jabardasth)

జబర్దస్త్ కామెడీ షోలో రాజ్ తరుణ్ (raj tarun jabardasth)

Jabardasth Comedy Show Raj Tarun: జబర్దస్త్ కామెడీ షోకు ఉన్న డిమాండ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. గ్యాప్ వచ్చినా కూడా లాక్‌డౌన్ తర్వాత మళ్లీ మంచి రేటింగ్స్ తెచ్చుకుంది ఈ కార్యక్రమం.

జబర్దస్త్ కామెడీ షోకు ఉన్న డిమాండ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. గ్యాప్ వచ్చినా కూడా లాక్‌డౌన్ తర్వాత మళ్లీ మంచి రేటింగ్స్ తెచ్చుకుంది ఈ కార్యక్రమం. అందరికీ నవ్వులు పంచుతూ దూసుకుపోతున్న ఈ ప్రోగ్రామ్‌లో సినిమా ప్రమోషన్స్ కూడా బాగానే జరుగుతుంటాయి. ఈ క్రమంలోనే ఇప్పుడు రాజ్‌తరుణ్ మరోసారి జబర్దస్త్ ఎంట్రీ ఇచ్చాడు. ఓ స్కిట్‌లో అందరికీ నవ్వులు పూయించాడు ఈయన. ఇప్పటికే ఈ ఏడాది ఇద్దరి లోకం ఒక్కటే అంటూ డిజాస్టర్ ఇచ్చాడు రాజ్‌తరుణ్. త్వరలోనే ఒరేయ్ బుజ్జిగా సినిమాతో రాబోతున్నాడు.
జబర్దస్త్ కామెడీ షోలో రాజ్ తరుణ్ (raj tarun jabardasth)
జబర్దస్త్ కామెడీ షోలో రాజ్ తరుణ్ (raj tarun jabardasth)

ఈ సినిమాపై అంచనాలు కూడా లేవు కానీ కచ్చితంగా ఒరేయ్ బుజ్జిగా తనను రైట్ ట్రాక్‌లో పెడుతుందని నమ్ముతున్నాడు రాజ్. పైగా ఈ చిత్రాన్ని ఓటిటిలో విడుదల చేస్తారని ముందు వార్తలు వచ్చినా కూడా అదేం కాదు థియేటర్స్ ఓపెన్ చేసిన తర్వాతే తన సినిమాను విడుదల చేస్తారని చెప్తున్నాడు ఈ కుర్ర హీరో. గుండెజారి గల్లంతయిందే ఫేమ్ విజయ్ కుమార్ కొండా దీనికి దర్శకుడు.
జబర్దస్త్ కామెడీ షోలో రాజ్ తరుణ్ (raj tarun jabardasth)
జబర్దస్త్ కామెడీ షోలో రాజ్ తరుణ్ (raj tarun jabardasth)

ఒక లైలా కోసం తర్వాత చాలా గ్యాప్ తీసుకుని ఈ సినిమా చేసాడు విజయ్. మరోవైపు రాజ్ తరుణ్ కూడా కచ్చితంగా ఈ చిత్రం తను కోరుకున్న విజయం తీసుకొస్తుందని నమ్ముతున్నాడు. జబర్దస్త్ కామెడీ షోలో ఎంట్రీ ఇచ్చి తన సినిమా గురించి ప్రమోషన్ చేసుకుంటున్నాడు ఈ హీరో. తనదైన కామెడీ టైమింగ్‌తో బాగానే నవ్విస్తున్నాడు రాజ్. వచ్చే వారం ఈ ఎపిసోడ్ ప్రసారం కానుంది.
Published by:Praveen Kumar Vadla
First published:

Tags: Jabardasth comedy show, Raj tarun, Telugu Cinema, Tollywood

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు