YOUNG HERO NITHIN WILL ACT IN CHIRANJEEVI BHOLA SHANKAR MOVIE SB
Chiranjeevi: మెగాస్టార్ సినిమాలో మరో యంగ్ హీరో.. ఎవరో తెలుసా?
Chiranjeevi Photo : Twitter
ఈ సినిమాలో కీర్తి సురేష్ చిరంజీవికి చెల్లిగా నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే కీర్తి సురేష్‌కు జంటగా ఈ యంగ్ హీరో కూడా చిరు సినిమాలో కనిపించనున్నాడని సమాచారం.
ఆచార్య సినిమా తర్వాత చిరంజీవి(Chiranjeevi) వరుసగా సినిమాలు చేస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం కొత్త సినిమాలతో బిజీగా మారిన విషయం తెలిసిందే. చిరు చేస్తున్న గాడ్ ఫాదర్ షూటింగ్ చివరి దశకు చేరుకొంది.. ఇక ప్రస్తుతం చిరు భోళా శంకర్(Bhola Shankar) షూటింగ్ లో బిజీగా ఉండబోతున్నాడు.. ఈ సినిమా కొత్త షెడ్యూల్ త్వరలోనే ప్రారంభం కానుంది. మెహర్ రమేష్(Mehar Ramesh) దర్శకత్వంలో తెరకెక్కుతున్న భోళా శంకర్ చిత్రంలో చిరు కు చెల్లెలిగా కీర్తి సురేష్(Keerthi Suresh) నటిస్తోంది.
అయితే తమిళ్ హిట్ సినిమా వేదాళం చిత్రానికి రీమేక్ గా ఈ సినిమా తెరకెక్కుతుంది. ఇప్పటికే ఈ చిత్రంపై మెగా అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. తాజాగా ఈ సినిమా గురించి మరో ఇంట్రస్టింగ్ వార్త ఒకటి నెట్టింట వైరల్ గా మారింది. అదేంటంటే.. ఈ చిత్రంలో మరో యంగ్ హీరో కూడా నటించనున్నాడు. ఆయన ఇంకెవరో కాదు. హీరో నితిన్. నితిన్ కూడా భోళాశంకర్ సినిమాలో ఒక కీలక పాత్రలో నటిస్తున్నాడట.. చిరు చెల్లెలు కీర్తి ప్రేమించినవాడిగా నితిన్ కనిపించనున్నాడని టాక్.
అంటే చిరుకు బావమరిదిగా యంగ్ హీరో మారనున్నాడట. అయితే నితిన్(Nithin) గెస్ట్ రోల్ లో మాత్రమే నటించనున్నాడని సమాచారం. గతంలో నితిన్ – కీర్తి సురేశ్ జోడీ ‘రంగ్ దే’(Rangde)లో సందడి చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ జంట కనిపిస్తే బావుంటుందని చెప్పడంతో నితిన్, చిరు పై ఉన్న అభిమానంతో ఓకే చేసినట్లు తెలుస్తోంది. అయితే ఈ వార్తలో నిజం ఎంత అనేది తెలియాలంటే ఈ వార్తపై మూవీ మేకర్స్ అధికారికంగా ప్రకటన రావాల్సిందే.
మరోవైపు నితిన్ హీరోగా ప్రస్తుతం మాచర్ల నియోజకవర్గం అనే సినిమా తెరకెక్కుతోంది. భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతుండగా ఈ సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి. నితిన్ కు జోడీగా ఈ సినిమాలో కృతిశెట్టి నటిస్తున్నారనే సంగతి తెలిసిందే. ఇటీవలే విడుదలైన విక్రమ్ సినిమాతో కూడా నితిన్ లాభాలు సాధించాడు. విక్రం సినిమాను తెలుగులో శ్రేష్ట్ మూవీస్ బ్యానర్ లో నితిన్ ఫాదర్ సుధాకర్ రెడ్డి రిలీజ్ చేశారు.అంతకుముందు కమల్ సినిమాలేవి పెద్దగా బాక్సాఫీస్ దగ్గర మంచి ఫలితాలు ఇవ్వని కారణంతో విక్రం సినిమాను కేవలం 6 కోట్లకే అమ్మేశారు.
Published by:Sultana Shaik
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.