Praveen Kumar VadlaPraveen Kumar Vadla
|
news18-telugu
Updated: February 16, 2020, 11:06 AM IST
ఈ పెళ్లికి చాలా తక్కువ మంది మాత్రమే హాజరు కానున్నారు. ఇరు కుటుంబాలతో పాటు ఇండస్ట్రీ నుంచి కొందరు సన్నిహితులు రాబోతున్నట్లు తెలుస్తుంది.
తెలుగు ఇండస్ట్రీలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్‌లో నితిన్ ముందుంటాడు. ప్రభాస్, రానా లాంటి వాళ్ల తర్వాత నితిన్ పేరు ఎక్కువగా వినిపిస్తుంది. 35 ఏళ్ళు వచ్చేయడంతో ఇంకెప్పుడు పెళ్లి అంటూ చాలా ఏళ్లుగా నితిన్‌ను అంతా అడుగుతూనే ఉన్నాడు. ఈయన మాత్రం నోరు విప్పలేదు. ఇప్పుడు ఉన్నట్లుండి సడన్‌గా షాలిని అనే అమ్మాయితో నిశ్చితార్థం చేసుకున్నాడు. ఇది పెద్దలు కుదిర్చిన వివాహమేమో.. నిన్నమొన్నటి పరిచయమేమో అనుకున్నారంతా. కానీ ఈయన మాత్రం తన లవ్ స్టోరీని 8 ఏళ్లుగా నడిపిస్తున్నాడు. చాలా సైలెంట్‌గా ఈ హీరో ప్రేమలో ఉన్నాడు. ఇన్నేళ్ళ తర్వాత ఇరు కుటుంబాలను ఒప్పించి తన ఎనిమిదేళ్ల పరిచయం.. ఐదేళ్ల ప్రేమను పెళ్లితో శుభం కార్డ్ వేయబోతున్నాడు నితిన్.

నితిన్ షాలిని పెళ్లి (Nithiin Shalini wedding)
ఈయనకు కాబోయే భార్య షాలిని ఎం.బి.ఏ పూర్తి చేసింది. ఈమెతో నితిన్‌కు 8 ఏళ్ల పరిచయం ఉంది.. 2012లో ఓ కామన్ ఫ్రెండ్ నుంచి షాలినిని నితిన్ చూసాడు.. ఆ తర్వాత ఐదేళ్లుగా ఆమెతో ప్రేమలో ఉన్నాడు ఈ హీరో. కానీ ఇప్పటి వరకు చిన్న హింట్ కూడా ఇవ్వలేదు ఈ హీరో. ఎప్పుడు అడిగినా కూడా పెళ్లి గురించి కానీ.. ప్రేమ గురించి కానీ చెప్పకుండా జాగ్రత్త పడ్డాడు నితిన్. ఇక తనకు కాబోయే భార్య ముచ్చట్లు చెప్పాడు ఈయన. షాలిని అందరిని ఎంతో ప్రేమగా పలుకరిస్తుందని.. ఆ సింప్లిసిటీ చూసి తను ప్రేమలో పడిపోయానంటున్నాడు నితిన్. అందుకే ఆమె అంటే అంత ఇష్టం అంటున్నాడు ఈయన.

నితిన్ షాలిని పెళ్లి (Nithiin Shalini wedding)
అంతేకాదు.. తన ప్రొఫెషన్‌ను కూడా షాలిని అర్ధం చేసుకుంటుందని చెప్పాడు ఈ హీరో. అయితే ఇన్నాళ్లుగా ప్రేమలో ఉన్నా మా కెరీర్లో బిజీగా ఉండటం వల్ల ఈ విషయాన్ని బయట పెట్టలేదని.. తనకు షాలిని పర్ఫెక్ట్ అంటున్నాడు నితిన్. మాములుగా సినిమా ప్రమోషన్స్‌లోనే సిగ్గు పడుతుంటాడు ఈ హీరో.. కానీ తనకు కాబోయే భార్య గురించి మాత్రం చాలా బాగా మాట్లాడేసాడు ఈయన. ఎలాంటి సిగ్గు పడకుండా తన ప్రేయసి గురించి వివరాలు చెప్పుకొచ్చాడు ఈ హీరో.

నితిన్ షాలిని పెళ్లి (Nithiin Shalini wedding)
ప్రస్తుతం భీష్మ సినిమాలో పెళ్లంటే పారిపోయే పాత్రలో నటిస్తూ.. ఇప్పుడు మాత్రం పెళ్లి చేసుకుంటున్నాడు ఈయన. షాలిని తన ఫ్యామిలీతో బాగా కలిసిపోయిందని.. ఆమె లాంటి వ్యక్తితో ప్రేమలో పడటం కష్టమేమి కాదంటున్నాడు నితిన్. మొత్తానికి ఐదేళ్లు ఎవరి కంట పడకుండా.. ప్రేమించడం.. ప్రేమించిన అమ్మాయిని దాచేయడం అంటే చిన్న విషయం కాదు. అందుకే నితిన్ మామూలు ఖిలాడీ కాదంటున్నారు అభిమానులు. ఎప్రిల్ 16న దుబాయ్‌లో డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోబోతున్నాడు నితిన్.
Published by:
Praveen Kumar Vadla
First published:
February 16, 2020, 11:06 AM IST