HOME »NEWS »MOVIE »young hero nikhil rejects offer in balakrishna boyapati film mnj

Balayya BB3 movie: బాలయ్య మూవీలో ఆఫర్.. చేయలేనని చెప్పేసిన యువ హీరో..!

Balayya BB3 movie: బాలయ్య మూవీలో ఆఫర్.. చేయలేనని చెప్పేసిన యువ హీరో..!
బాలకృష్ణ

నందమూరి బాల‌కృష్ణ (Balakrishna) ప్ర‌స్తుతం బోయ‌పాటి(Boyapati) ద‌ర్శ‌క‌త్వంలో న‌టిస్తోన్న విష‌యం తెలిసిందే. మాస్ అండ్ యాక్ష‌న్ ఎంట‌ర్‌గా ఈ చిత్రం తెర‌కెక్కుతోంది. అయితే ఈ మూవీ షూటింగ్ ప్రారంభ‌మైన‌ప్ప‌టి నుంచి ఏవో ఇబ్బందులు ఎదుర‌వుతూనే ఉన్నాయి

  • Share this:
    Balakrishna: నందమూరి బాల‌కృష్ణ ప్ర‌స్తుతం బోయ‌పాటి ద‌ర్శ‌క‌త్వంలో న‌టిస్తోన్న విష‌యం తెలిసిందే. మాస్ అండ్ యాక్ష‌న్ ఎంట‌ర్‌గా ఈ చిత్రం తెర‌కెక్కుతోంది. అయితే ఈ మూవీ షూటింగ్ ప్రారంభ‌మైన‌ప్ప‌టి నుంచి ఏవో ఇబ్బందులు ఎదుర‌వుతూనే ఉన్నాయి. మొద‌ట సినిమాటోగ్రాఫ‌ర్ ఈ మూవీ నుంచి త‌ప్పుకున్న‌ట్లు టాక్ న‌డిచింది. కానీ ఆ త‌రువాత నిర్మాత హామీతో అత‌డు కంటిన్యూ అవుతున్న‌ట్లు వార్తలు వ‌చ్చాయి. ఇక ఈ సినిమాలో బాల‌య్య‌ను ద్విపాత్రాభిన‌యంలో చూపించ‌నున్న‌ట్లు ముందే వెల్ల‌డించిన బోయ‌పాటి.. హీరోయిన్‌గా కొత్త వారిని ప‌రిచ‌యం చేస్తామ‌ని తెలిపాడు. చెప్పిన‌ట్లుగానే మాలీవుడ్‌కి చెందిన ప్ర‌యాగ మార్టిన్‌ని తీసుకొచ్చారు. ఆమెతో కొన్ని స‌న్నివేశాల‌ను కూడా తెర‌కెక్కించారు. అయితే వారిద్ద‌రి వ‌య‌సు బేధం క‌నిపిస్తున్నందున ఆమెను ద‌ర్శ‌కుడు ఈ ప్రాజెక్ట్ నుంచి తీసేసిన‌ట్లు వార్తలు వినిపించాయి.

    ఇక ఆ త‌రువాత సాయేషా సైగ‌ల్‌ని కూడా అధికారికంగా ప్ర‌క‌టించారు. కానీ ఆమె కూడా ఈ ప్రాజెక్ట్ నుంచి త‌ప్పుకోగా.. చివ‌ర‌కు ప్ర‌గ్యా జైశ్వాల్ ఫైన‌ల్ అయ్యింది. ఇదిలా ఉంటే తాజా స‌మాచారం ప్ర‌కారం ఈ మూవీ గురించిన మ‌రో వార్త సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతోంది. అదేంటంటే ఇందులో ఓ కీల‌క పాత్ర కోసం యువ హీరో నిఖిల్‌ని సంప్ర‌దించార‌ట మూవీ మేక‌ర్లు. కానీ నిఖిల్ మాత్రం ఈ ఆఫ‌ర్‌పై పెద్ద‌గా ఆసక్తిని చూప‌లేద‌ట‌.



    దీంతో ఆ పాత్ర కోసం ఇప్పుడు ఆది పినిశెట్టి, నారా రోహిత్‌ల‌తో సంప్ర‌దింపులు జ‌రుపుతున్నార‌ని.. వారిలో ఒక‌రు ఫైన‌ల్‌ని చేసి త్వ‌ర‌లోనే అధికారిక ప్ర‌క‌ట‌న ఇవ్వ‌నున్నార‌ని స‌మాచారం. కాగా ఈ మూవీని మిర్యాల ర‌వీంద‌ర్ రెడ్డి నిర్మిస్తుండ‌గా.. థ‌మ‌న్ సంగీతం అందిస్తున్నాడు. ఇప్ప‌టికే బాల‌య్య‌, బోయ‌పాటి కాంబినేష‌న్లో వ‌చ్చిన సింహా, లెజండ్ చిత్రాలు పెద్ద విజ‌యాల‌ను సాధించ‌డంతో.. ఈ మూవీపై అభిమానుల్లో మంచి అంచ‌నాలు ఉన్నాయి.
    Published by:Manjula S
    First published:December 31, 2020, 18:35 IST

    टॉप स्टोरीज